చాక్లెట్ సిరప్, వెనిలా, చాక్లెట్ ఐస్ క్రీం స్కూప్ తో ఇంట్లోనే చాక్లెట్ తయారు చేసుకోవచ్చు. వెన్న 100గ్రా, చక్కెర 200గ్రా, కోకో 4 టేబుల్ స్పూన్స్, పాలు పావు కప్పు, పిండి 150 గ్రా గుడ్లు 2, బేకింగ్ పౌడర్ 1 స్పూన్ వాల్నట్స్ ముందుగా వెన్న, చక్కెర, కోకో, పాలు పోసి కలపాలి. తర్వాత మిగిలిన పదార్థాలన్నింటిని వేసి కలపాలి. బేకింగ్ టిన్లో 180 డిగ్రీల సెల్సియస్ వద్ద 25 నిమిషాలపాటు ఓవెన్‌లో ఉంచాలి. తర్వాత బయటకు తీసి చల్లారిన తర్వాత చతురస్రాకారంలో కత్తిరించుకోవాలి. ఇప్పుడు దీన్ని చాక్లెట్ సిరప్, వెనిల్లా ఐస్ క్రీం తో సర్వ్ చేయాలి.