నీరసం రాకుండా రోజంతా చురుకుగా ఉండాలంటే సమతుల ఆహారం తీసుకోవాలి.

సంక్లిష్ట పిండి పదార్థాలు కలిగిన క్వినోవా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి తగ్గిస్తుంది. శరీరంలో ఐరన్ లోపం ఏర్పడకుండా నివారిస్తుంది.

ఒమెగా3 ఫ్యాటీ ఆసిడ్లతో ఉండే నూనె కలిగిన చేపలు తీసుకోవాలి. బి విటమిన్ శక్తి సంశ్లేషణకు అవసరం.

శరీరంలో ఆక్సిజన్ రవాణాకు ఐరన్ తప్పకుండా కావాలి. విటమిన్ ఎ, సి, మెగ్నీషియం కలిగిన ఆకుకూరలు తప్పకుండా తీసుకోవాలి.

ఆక్రూట్, బాదాముల వంటి గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్, ఫైబర్ ఉంటాయి. ఇవి శక్తి విడుదలకు అవసరం.

కాల్షియం ఎముకలు, కండరాల బలానికి అవసరం. ప్రొబయోటిక్స్ కూడా కలిగిన పెరుగు జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి అవసరం.

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా కలిగిన బ్లూబెర్రీలు తీసుకుంటే నీరసం తగ్గుతుంది.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels