నల్లని చిన్న సబ్జాగింజలు తులసి జాతికి చెందిన మొక్క నుంచి వస్తాయి. వీటిలో చాలా పోషకాలున్నాయి.

సబ్జా గింజల్లో ఫైబర్ తోపాటు విటమిన్లు ఎ, కె, సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

సబ్జా గింజల్లో ఉండే ఫైబర్ వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యం బాగుపడుతుంది. మలబద్దకం తగ్గిస్తుంది.

నీళ్లతో సబ్జా కలిపినపుడు జెల్ మాదిరిగా మారుతాయి. వీటిని తీసుకుంటే కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది.

నీళ్లలో కలిపిన సబ్జాగింజలు నీటిని నిలుపుకుంటాయి. వీటిని తీసుకున్నపుడు చాలా సమయం పాటు శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది.

సబ్జా గింజల్లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్‌ను సంతులనపరిచి ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గిస్తాయి.

కొన్ని అధ్యయనాలు సబ్జా గింజలతో రక్తంలో షుగర్ స్థాయిలు కూడా అదుపు చేస్తాయని చెబుతున్నాయి.

ఫైబర్ వల్ల త్వరగా గ్లూకోజ్ విడుదలను అదుపు చేస్తాయి. కనుక డయాబెటిక్స్ కి మంచి స్నాక్ టైమ్ డ్రింక్ గా వీటిని తీసుకోవచ్చు.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!

Images courtesy : Pexels