నీళ్లతో బరువు తగ్గొచ్చా? ఎంత తాగితే తగ్గుతారు? ఇలా బరువు తగ్గాలంటే ఏం చెయ్యాలి? తెలుసుకుందాం.

తగినంత వ్యాయామం చేస్తూ, పోషకాలు అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటూ తగినన్ని నీళ్ల తాగితే దాని వల్ల బరువు తగ్గొచ్చు.

శరీరంలో 60 శాతం నీరే. రకరకాల విసర్జన క్రియల్లో కొంత నీరు నష్టపోతూ ఉంటుంది. ఆరోగ్యంగా ఉండేందుకు ఇలా నష్టపోయిన నీటిని తిరిగి నింపాలి.

తగినన్ని నీళ్లు తాగినపుడు పగటి పూట ఎక్కువ తినాలనే ఆశ పుట్టదు. క్యాలరీలు చేర్చడం తగ్గుతుంది.

నీరు శరీరంలో పోషకాల సంశ్లేషణ చెయ్యడానికి, వాటిని శక్తిగా మార్చడానికి సహాయపడుతుంది.

నీళ్లతో ఎలాంటి క్యాలరీలు చేరకుండా శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది.

హైడ్రేటెడ్‌గా ఉంచుతూ వర్కవుట్ సమయంలో మరింత చురుకుగా పనిచేసేందుకు దోహదం చేస్తుంది.

నీరు జీర్ణక్రియకు, విసర్జనకూ అవసరం. ఈ రెండు క్రియలు సజావుగా సాగితే బరువు అదుపులో ఉంటుంది. బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది.

శరీర బరువు, చేసే పని, వాతావరణ పరిస్థితులు, స్త్రీలా పురుషులా అనేదాన్ని బట్టి రోజుకు ఎన్ని నీళ్లు తాగాలనేది ఆధారపడి ఉంటుంది.

ప్రతి రోజు తప్పనిసరిగా సగటున కనీసం ఎనిమిది కప్పుల నీళ్లు తాగాల్సి ఉంటుంది.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels