దక్షిణ భారత దేశంలో దొరికే అరుదైన పండు పనస. దీని రుచి మాత్రమే కాదు, ఇందులోని పొషకాలు కూడా చాలా ప్రత్యేకం.

పనసతొనల్లో తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్, ఫైబర్ వల్ల రక్తంలో షుగర్ స్థాయిలను అదుపు చేస్తాయి.

విటమిన్ సి, కెరొటెనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బులు, కంటి సమస్యలను నివారిస్తాయి.

ఒక కప్పు పనస తొనల ద్వారా తగినంత ఫైబర్, ప్రొటీన్, విటమిన్ ఎ, సి, రైబోఫ్లెవిన్, మెగ్నీషియం, పొటాషియం, కాపర్ దొరుకుతాయి.

పనస పండులోని ఫైబర్, తక్కువ క్యాలరీల వల్ల ఇది బరువు తగ్గేందుకు కూడా దోహదం చేస్తుంది.

కాల్షియం శోషణకు దోహదం చేసే మెగ్నీషియం ఉండడం వల్ల పనసపండు ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

పనస పండులోని విటమిన్ ఎ, సి వల్ల నిరోధక వ్యవస్థ బలంగా తయారవుతుంది.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!

Images courtesy : Pexels