మెరిసే, ఆరోగ్యకరమైన జుట్టు పొందాలంటే మంచి పోషకాహారం తీసుకోవాలి. బెర్రీల నుంచి నారింజ వరకు ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, రాస్ బెర్రీస్, బ్లాక్ బెర్రీస్ వీటన్నింటిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి హానికరమైన రాడికల్స్ నుంచి జుట్టు కుదుళ్లు దెబ్బతినకుండా రక్షిస్తాయి. అవకాడోలో విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్నాయి. ఇవి తలకు పోషణ అందిస్తాయి. బొప్పాయిల విటమిన్ ఎ అధిక మోతాదులో ఉంటుంది. తల, చర్మం, జుట్టుకు పోషణ అందిస్తుంది. బొప్పాయి చుండ్రును తగ్గించి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. నేరేడుపండ్లలో అవసరమైన కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు ఉన్నాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. ఆఫ్రికాట్లు కూడా ఆరోగ్యకరమైన శిరోజాలను ప్రోత్సహిస్తాయి. నారింజ, ద్రాక్ష పండ్లు వంటి సిట్రస్ పండ్లు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఆరోగ్యకరమైన జుట్టుకు సహాయపడుతాయి.