Fruit Custard Recipe : సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ కస్టర్డ్.. ఈ టేస్టీ రెసిపీతో హీట్‌ని బీట్ చేసేయండి
Summer Special Recipe : ఎండలో తిరిగి.. ఇంటికి వచ్చిన తర్వాత చల్లగా.. నోటికి రుచిగా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ తింటే ఆ సుఖమే వేరు. దీనిని బయట కొనుక్కుని తినడం కంటే ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.

Tasty Fruit Custard Recipe : సమ్మర్లో చల్లగా, టేస్టీగా ఏమైనా తినాలనుకునేవారు కచ్చితంగా ఫ్రూట్ కస్టర్డ్ ట్రై చేయవచ్చు. దీనిని ఇంట్లోనే చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. కేవలం కొన్ని పదార్థాలతో ఇంట్లోనే రెగ్యులర్‌గా ఉండే పండ్లతో దీనిని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ సమ్మర్ హీట్‌ని టేస్టీ టేస్టీ కూల్ రెసిపీతో బీట్ చేయాలనుకుంటే దీనిని కచ్చితంగా ట్రై చేయండి. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
కావాల్సిన పదార్ధాలు
ఫ్యాట్ మిల్క్ - లీటర్
కస్టర్డ్ పౌడర్ - 65 గ్రాములు
పంచదార - కప్పు
మిల్క్మైయిడ్ - అర డబ్బా
దానిమ్మ గింజలు - కప్పు
ద్రాక్ష - కప్పు
అరటి పండు - కప్పు
యాపిల్ - కప్పు
జీడిపప్పు - అరకప్పు
తయారీ విధానం
ముందుగా పాలను మందపాటి గిన్నెలోకి తీసుకోవాలి. స్టౌవ్ వెలిగించి దానిపై పాలు పెట్టాలి. పాలు పూర్తిగా ఫ్యాట్ ఉండే వాటిని ఎంచుకుంటే ఈ డిష్ బాగుంటుంది. పాలు మరిగే సమయంలో ఫ్రూట్స్ అన్ని సిద్ధం చేసుకోవాలి. దానిమ్మ నుంచి గింజలు సపరేట్ చేసి పెట్టుకోవాలి. ద్రాక్షలు బాగా కడిగి వాటిని మధ్యలోకి కట్ చేసుకుని ఉంచుకోవాలి. అరటిపండును రౌండ్‌గా కట్ చేసి.. వాటిని మధ్యలోకి కోసి పెట్టుకోవాలి. యాపిల్‌పై ఉన్న తొక్కను తీసేసి.. ఆ ముక్కలను చిన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. మీకు నచ్చితే మామిడి పండును కూడా యాడ్ చేసుకోవచ్చు.
కస్టర్ట్ పౌడర్‌ను ఓ గిన్నెలోకి తీసుకుని దానిలో నీరు పోసి కలపాలి. దీనివల్ల పౌడర్ ఉండలు కట్టకుండా ఉంటుంది. పాలు కాస్త మరిగి పొంగు వచ్చిన తర్వాత కస్టర్డ్ పౌడర్ మిక్స్‌ని వేయాలి. పాలను కలుపుతూనే ఉండాలి. లేదంటే ఉండలు కట్టే అవకాశముంది. అలాగే స్టౌవ్‌ని కూడా తక్కువ మంటపైనే ఉంచాలి. కలుపుతూనే ఉండాలి. మిల్క్ మెయిడ్ కూడా పాల మిశ్రమంలో వేయాలి.
మిల్క్ మెయిడ్ అడుగు పడుతుంది కాబట్టి.. మిశ్రమాన్ని కచ్చితంగా తిప్పుతూ ఉండాలి. అది మీకు కావాల్సినట్టు మారేవరకు దానిని తిప్పుతూనే ఉండాలి. మీకు నచ్చిన తీరులో కస్టర్డ్ మారిందనుకున్నప్పుడు స్టావ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి. మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. అనంతరం దానిలో ముందుగా సిద్ధం చేసుకున్న పండ్లను వేయాలి. మిశ్రమం వేడిగా ఉన్నప్పుడు పండ్లు వేస్తే నీరు వచ్చేస్తుంది. కాబట్టి కచ్చితంగా మిశ్రమం చల్లారాకే వేసుకోవాలి.
జీడిపప్పును కూడా పలుకులుగా చేసి ఈ మిక్స్‌లో వేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ ఫ్రూట్ కస్టర్డ్ రెడీ. అయితే దీనిని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని తింటే రుచి మరింత బాగుంటుంది. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకుని గార్నిష్ చేసుకోవచ్చు. సమ్మర్లో ఉదయాన్నే దీనిని తయారు చేసుకుని.. మధ్యాహ్నం తింటే ఆ రుచి, హాయిని వర్ణించనవసరం లేదు. దీనిని పిల్లల నుంచి పెద్దలవరకు అందరూ ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం. ఈ సమ్మర్లో హీట్‌ని టేస్టీగా బీట్ చేయాలనుకుంటే ఈ టెస్టీ రెసిపీని ట్రై చేసేయండి.






















