అన్వేషించండి

Breast Cancer: ఈ లక్షణాలు కనిపిస్తే మగవారు రొమ్ము క్యాన్సర్ బారిన పడినట్టే!

అదేంటి రొమ్ము క్యాన్సర్ వచ్చేది ఆడవాళ్ళకి మాత్రమే కదా అనుకుంటున్నారా? కానీ అది కేవలం అపోహ మాత్రమే. పురుషులు కూడా దీని బారిన పడే ప్రమాదం ఉంది.

రొమ్ము క్యాన్సర్ అనగానే మహిళలకి మాత్రమే వస్తుందని అనుకుంటారు. కానీ వాస్తవానికి అది పురుషులకి కూడా వచ్చే అవకాశం ఉంది. మగవారికి రొమ్ముల నిర్మాణం యుక్తవయసులో ఉన్న బాలికల మాదిరిగానే ఉంటుంది. అయితే వారికి వయసు పెరిగే కొద్ది పెరుగుదల ఉండదు. పురుషులు కూడ స్త్రీలు మాదిరిగానే రొమ్ము క్యాన్సర్ కి గురవుతారు. గణాంకాల పరంగా మనిషి తన జీవితకాలంలో రొమ్ము క్యాన్సర్ ని అభివృద్ధి చేసే ప్రమాదం దాదాపు వెయ్యి మందిలో ఒకరికి ఉంటుంది. అయితే స్త్రీలకు ఉన్నట్టుగా పురుషులలో ముందస్తుగా వ్యాధిని గుర్తించే స్క్రీనింగ్ విధానాలు లేవు.

పురుషులలో రొమ్ము క్యాన్సర్ కు కారణమయ్యే కారకాలు

⦿ వయసు అనేది ముఖ్యమైన అంశం. 60 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్కులు దీని బారిన పడే అవకాశం ఉంది.

⦿ కుటుంబంలో ఎవరైనా స్త్రీకి రొమ్ము క్యాన్సర్ చరిత్ర ఉంటే అది మగవారికి కూడా ప్రమాదాన్ని పెంచుతుంది.

⦿ ఛాతీపై రేడియేషన్ చికిత్స చేస్తే రొమ్ము క్యాన్సర్ అభివృద్ధికి దోహదపడుతుంది

⦿ హార్మోన్ చికిత్సలు, పరిస్థితిలు, అంటువ్యాధులు లేదా కొన్ని విషాల వల్ల కూడా సంభవించే అవకాశం ఉంది. మగ హార్మోన్ స్థాయిలని ప్రభావితం చేసే క్లైన్ ఫెల్టర్స్ సిండ్రోమ్ వంటి పరిస్థితులు కూడా ప్రమాదాన్ని పెంచుతాయి.

⦿ ఈస్ట్రోజెన్ సప్లిమెంట్లు తీసుకోవడం కూడా రొమ్ము  కణజాలంపై ప్రభావం చూపుతాయి

⦿ కాలేయ సిర్రోసిస్ వ్యాధులు ప్రమాదానికి దోహదపడతాయి

⦿ ఊబకాయం మగ వారిలో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది

లక్షణాలు గుర్తించడం ఎలా?

స్త్రీలు అనుభవించినట్టే మగవారి రొమ్ములో కూడా గడ్డలు ఏర్పడతాయి. రక్తస్రావం, చనుమొలలో మార్పులు సంభవిస్తాయి. రొమ్ము ప్రాంతం చుట్టు ఉన్న చర్మంలో మార్పులు, అసౌకర్యం, నొప్పి కూడా వస్తుంది.

పురుషులలో కనిపించే రొమ్ము క్యాన్సర్ రకాలు

ఇన్వాసివ్ డక్టల్ కార్సినోమా: ఇది నాళాలలో ఉద్భవించే క్యాన్సర్ కణాలను కలిగి ఉంటుంది. ఈ క్యాన్సర్ కణాలు శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే అవకాశం ఉంది.

డక్టల్ కార్సినోమా (DCIS): DCIS అనేది రొమ్ము పరిస్థితిని సూచిస్తుంది. క్యాన్సర్ కణాలు నాళాల లైనింగ్ కు మాత్రమే పరిమితం చేయబడి ఉంటాయి.

రోగనిర్ధారణ

రొమ్ము క్యాన్సర్ జయించడంలో కీలక పాత్ర పోషించేది ముందస్తుగా వ్యాధిని గుర్తించడమే. పైన చెప్పిన విధంగా ఏమైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. మగవారిలో రొమ్ము క్యాన్సర్ ని నిర్ధారించడంలో మొదటి దశ శారీరక పరీక్ష. రొమ్ములో ఏవైనా ముద్దలు, మార్పులు కనిపిస్తే వెంటనే పరీక్షక్ చేయించుకోవాలి.

ఇమేజింగ్ పరీక్ష

మమోగ్రఫీ, రొమ్ము ఎక్స్ రే తో కణితులు గుర్తించవచ్చు. అయితే వీటికి మమోగ్రామ్ ల ద్వారా బయట పడకపోవచ్చు. అల్ట్రా సౌండ్, ఏంఆర్ఐ వంటి ఇమేజింగ్ పరీక్షలు సిఫార్సు చేస్తారు.

బయాప్సీ

ఇమేజింగ్ పరీక్షలో ఏదైన తేడాగా అనిపిస్తే క్యాన్సర్ కణాల ఉనికిని నిర్ధారించడం కోసం బయాప్సీ చేస్తారు. రొమ్ము ప్రాంతం నుంచి చిన్న కణజాలం తీసుకుని పరీక్ష చేస్తారు.

హిస్టోపాథాలజీ

బయాప్సీ తర్వాత కణజాల నమూనా పాథాలజిస్ట్ కి పంపిస్తారు. కణితి రకం,గ్రేడ్ ని వాళ్ళు మైక్రో స్కోప్ ద్వారా పరిశీలిస్తారు.

హార్మోన్ టెస్ట్

క్యాన్సర్ కణాలలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ ఉన్నాయో లేదో తెలుసుకోవడం కోసం హార్మోన్ టెస్ట్ కీలకం.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also Read: మొటిమలు లేని చర్మం కావాలా? అయితే మీ పొట్టని ఆరోగ్యంగా ఉంచుకోండి

టాప్ హెడ్ లైన్స్

Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
Overthinking : అతిగా ఆలోచించి సతమతమవుతున్నారా? ఓవర్‌థింకింగ్‌ను తగ్గించే 3 సులభమైన మార్గాలు ఇవే
అతిగా ఆలోచించి సతమతమవుతున్నారా? ఓవర్‌థింకింగ్‌ను తగ్గించే 3 సులభమైన మార్గాలు ఇవే
Post-Flood Home Cleaning : వరద నీరు తగ్గిన తర్వాత ఇంటిని ఎలా శుభ్రం చేయాలి? తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే
వరద నీరు తగ్గిన తర్వాత ఇంటిని ఎలా శుభ్రం చేయాలి? తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Embed widget