అన్వేషించండి

Acne: మొటిమలు లేని చర్మం కావాలా? అయితే మీ పొట్టని ఆరోగ్యంగా ఉంచుకోండి

అదేంటి పొట్ట ఆరోగ్యానికి, చర్మం మీద వచ్చే మొటిమలకి సంబంధం ఏముందని అనుకుంటున్నారా? కానీ ఇది నిజం. పేగులు ఆరోగ్యంగా ఉంటేనే మీ చర్మం కూడా యవ్వనంగా మెరిసిపోతుంది.

యువతులు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఎదుర్కొనే సమస్య మొటిమలు. వీటి వల్ల వచ్చే నల్ల మచ్చలు అందాన్ని చెడగొట్టేస్తాయి. వీటికి పర్మినెంట్ సొల్యూషన్ అంటే చాలా కష్టం. ఒత్తిడి, చర్మం మీద మురికి పేరుకుపోవడం, కాలుష్య వాతావరణం, జిడ్డు చర్మం వల్ల మొటిమలు ఎక్కువగా వస్తాయని అనుకుంటారు. కానీ నిజానికి మొటిమలు ఎందుకు వస్తాయో తెలుసా? పొట్ట ఆరోగ్యం సరిగా లేకపోతే మొటిమలు వస్తాయట. అదేంటి పొట్టకి, చర్మానికి సంబంధం ఏంటని అనుకుంటున్నారా? కానీ ఉందండోయ్. మీ గట్ ఆరోగ్యంగా ఉంటేనే చర్మం కూడా అందంగా కనిపిస్తుంది.

చర్మ సమస్యలకు స్కిన్ మాత్రమే కారణం కాదు పొట్ట ఆరోగ్యం కూడా ప్రధాన కారణం. పొట్టలో 100 రకాలకు పైగా  బ్యాక్టీరియా నిల్వ ఉంటాయి. గట్ మైక్రోబయోమ్ లేదా ఏదైనా ఇతర సమస్యలు ఏర్పడితే అవి మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అనారోగ్యకరమైన పొట్ట చర్మం చికాకు, మొటిమలు వంటి అనేక చర్మ సమస్యల్ని కలిగిస్తుంది. వీటికి సాధారణ వైద్యం కంటే పురాతన ఆయుర్వేద వైద్యం చక్కగా పని చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. చర్మ సమస్యల్ని నయం చేసేందుకు పొట్ట ఆరోగ్యం చాలా ముఖ్యమనే విషయం గుర్తు పెట్టుకోవాలి.

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం పొట్ట, చర్మ ఆరోగ్యాన్ని సమతుల్యం చేసేందుకు అద్భుతమైన మూలికలు ఉన్నాయి. ఇవి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. ఎటువంటి దుష్ప్రభావాలు కలగకుండా సమస్య మూలాలని నిర్మూలిస్తుంది. పేగు ఆరోగ్యానికి, మొటిమలు తొలగించుకోవడానికి ఆయుర్వేదంలోని మొక్కల సారం చక్కగా పని చేస్తాయి. మంజిష్ట, అశోక్ చాల్, శతావరి, పచ్చి పసుపు వంటి మూలికలు మొటిమలు రాకుండా నివారిస్తాయని ఆయుర్వేద నిపుణులు వెల్లడిస్తున్నారు.

మంజిష్ట

దీన్ని ఇండియన్ మ్యాడర్ అని కూడా పిలుస్తారు. మేజిక్ హెర్బ్ గా పని చేస్తుంది. రక్తాన్ని శుద్ది చేస్తుంది. జీర్ణక్రియ సరిగా లేకోయినా, చర్మ సమస్యలు నివారించడంలో, వృద్ధాప్య సంకేతాలు తగ్గించడంలో ప్రసిద్ధి చెందింది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మానికి చాలా మేలు చేస్తాయి. మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాని తొలగిస్తుంది.

పేగు సమస్యలు నివారించడంలో మంజిష్ట ఉపయోగకరంగా పని చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ప్లాట్యులెంట్ లక్షణాలు మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

అశోక చాల్

అశోక చాల్ అంటే అశోక చెట్టు బెరడు. అనేక ఔషధ ప్రయోజనాలు కలిగి ఉంది. అశోక అంటే సంస్కృతంలో శోకం లేదని అర్థం. ఇది భారత ఉపఖండంలోని పశ్చిమ కనుమల మీద పెరుగుతుంది. టానిన్లు, ఫ్లేవనాయిడ్లు, గ్లైకోసైడ్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. మొటిమలు, సోరియాసిస్, చర్మ చికాకు వంటి సమస్యల్ని నివారించడంలో అద్భుతంగా పని చేస్తుంది.

రక్తం నుంచి వ్యర్థాలని తొలగించి మొటిమలు, తార చర్మ సమస్యల్ని నివారిస్తుంది. యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటుంది. కడుపులోని నులు పురుగులు తొలగిస్తుంది.

శతావరి

మిరాకిల్ హెర్బ్ గా శతావరి ప్రసిద్ధి చెందింది. నూరు వేర్లు ఉన్న మొక్క కనుక దీన్ని శతావరి అని పిలుస్తారు. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మానికి హాని కలిగించే వాటిని అడ్డుకుంటాయి. కణజాలాల్ని నిర్మించి రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. పురాతన కాలం నుంచి శతావరిని స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థకి వినియోగిస్తారు. వృద్ధాప్య సంకేతాలని దూరం చేస్తుంది. చర్మాన్ని తేమగా మారుస్తుంది. ప్రత్యేకంగా పొడి చర్మం వారికి ఇది అనేక ప్రయోజనాలు అందిస్తుందని పలు పరిశోధనలు సూచిస్తున్నాయి.

పసుపు

పూర్వం నుంచి పసుపులో వైద్య లక్షణాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇందులోని కర్కుమిన్ అనే బయో యాక్టివ్ సమ్మేళనం ఉంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలు రాకుండా ఎదుర్కొంటాయి. వాటి వల్ల వచ్చే మంటని తగ్గిస్తుంది. చర్మానికి మేలు చేస్తుంది. హైపర్ పిగ్మెంటేషన్ ని నివారించి మచ్చలు, డార్క్ స్పాట్స్ తగ్గిస్తుంది. చర్మానికి సహజమైన మెరుపుని అందిస్తుంది.

యవ్వనంగా మెరిసే చర్మాన్ని పొందాలని అనుకుంటే ఖచ్చితంగా పొట్ట ఆరోగ్యంగా బాగుండెలా చూసుకోవాలి. పేగులో ఆరోగ్యం అసమతుల్యంగా ఉంటే చర్మం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. ఆరోగ్యకరమైన పేగు సహజమైన గ్లోని అందిస్తుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also Read: ఈ స్పెషల్ టీలు తాగారంటే వర్షాకాలంలో రోగాల భయమే అక్కర్లేదు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget