అన్వేషించండి

Blood Pressure : బీపీ, గుండెపోటును తగ్గించే ఆహారం ఇదే.. కచ్చితంగా డైట్​లో చేర్చుకోవాలంటోన్న నిపుణులు

Heart Attacks : రక్తపోటు, గుండెపోటును తగ్గించే ఫుడ్స్ డైట్​లో తీసుకోవాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఓ ఫుడ్ రక్తపోటును, గుండెపోటును కంట్రోల్ చేస్తుందని చెప్తున్నారు. అదేంటంటే..

Best Food for Heart Health and BP :రక్తపోటుతో ఇబ్బంది పడేవారికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తాయి. బీపీ పెరగడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యల ప్రమాదం పెరుగుతుంది. అందుకే రక్తపోటును కంట్రోల్ చేసే.. మందులు తీసుకోవడంతో పాటు.. ఆరోగ్యానికి మేలు చేసే ఫుడ్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. కొన్నిరకాల ఫుడ్స్ రక్తపోటును నియంత్రించడమే కాకుండా.. గుండె సమస్యలను దూరం చేయడంలో హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా రక్తపోటును నియంత్రించడానికి, గుండె సమస్యలను దూరం చేయడానికి పాలకూరను డైట్​లో చేర్చుకోవాలంటున్నారు డాక్టర్ బిమల్ ఛాజేడ్. ఇది ఎలా బీపీని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుందో.. హార్ట్ సమస్యలు రాకుండా చూస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

అధిక రక్తపోటును ఎలా తగ్గిస్తుందంటే.. 

పాలకూరలో పొటాషియం, మెగ్నీషియం, నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ మూలకాలు శరీరంలో సోడియం స్థాయిని సమతుల్యం చేయడానికి హెల్ప్ చేస్తాయి. దీనివల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా పాలకూరలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా కలిగి ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది.

గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించే

అధిక రక్తపోటు గుండెపోటుకు ప్రధాన కారణం అవుతుంది. పాలకూరలో ఉండే నైట్రేట్లు రక్త నాళాలను సడలిస్తాయి. రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. ఇది గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

పాలకూరను ఆహారంలో ఎలా చేర్చుకోవాలంటే.. 

సలాడ్ రూపంలో పాలకూరను తీసుకోవచ్చు. కాబట్టి ఆకులను కడిగి నేరుగా సలాడ్లలో ఉపయోగించవచ్చు. సూప్ తయారు చేసుకోవచ్చు. పాలకూర సూప్ అధిక బీపీ ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పరగడుపున పాలకూరను జ్యూస్ చేసుకుని తాగవచ్చు. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. బంగాళాదుంప-పాలకూర లేదా పప్పు-పాలకూర వంటి వంటకాలు రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచివి.

పాలకూర తినడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు

పాలకూర కేవలం రక్తపోటును, గుండె సమస్యలను దూరం చేయడమే కాదు.. రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా హెల్ప్ చేస్తుంది. బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఎముకలు, కళ్లకు మేలు చేస్తుంది. 

అధిక రక్తపోటును నియంత్రించడానికి మందులతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం చాలా ముఖ్యం. కాబట్టి పాలకూర వంటి సులభంగా లభించే కూరగాయలను తీసుకోవాలి. ఇవి రక్తపోటును సమతుల్యం చేయడమే కాకుండా గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Korean Beauty Secrets : కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
Curry Leaves and Hair Oil : జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
Best Foods for Dinner : రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Ajay Devgn: బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
Embed widget