Coconut Water: వేసవితాపాన్ని తట్టుకోవాలంటే రోజుకో కొబ్బరి బోండాం తాగాల్సిందే
వేసవిలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన పానీయాలలో కొబ్బరి నీళ్ళు చాలా ముఖ్యమైనవి. ఇవి ఆరోగ్యానికి మాత్రమే కాదు అందాన్ని ఇస్తాయి.
భానుడు ఉగ్రరూపం దాల్చేశాడు. పొద్దున పది గంటలకే బయటకి వెళ్తే మొహం మాడిపోతుంది. కొన్ని ప్రదేశాల్లో రికార్డు స్థాయిలో ఎండలు నమోదవుతున్నాయి. ఎండ వేడి కారణంగా డీహైడ్రేషన్ కి ఎక్కువగా గురవుతారు. వేడి అలసటను నివారించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. వదులుగా ఉండే దుస్తులు వేసుకోవడం, మొహం, చేతులు కప్పి ఉండేలా స్కార్ఫ్ కప్పుకోవడం తప్పనిసరిగా చేయాలి. హైడ్రేట్ గా ఉండటం కోసం నీళ్ళు పుష్కలంగా తాగాలి. శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాలు ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. వేసవి తాపాన్ని తట్టుకోవడం కోసం ఉపయోగపడే అత్యుత్తమ పానీయం కొబ్బరి నీళ్ళు. వీటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఎలక్ట్రోలైట్స్: కొబ్బరి నీళ్ళలో పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్ల అద్భుతమైన మూలం. ఈ ఖనిజాలు శరీరంలో ద్రవ సమతుల్యత కాపాడటానికి సహాయపడతాయి. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి.
హైడ్రేషన్: తియ్యగా ఉండే ఈ నీళ్ళు తాగితే నిర్జలీకరణ బారిన తక్కువ పడతారు. చెమట కారణంగా కోల్పోయిన ద్రవాలని తిరిగి నింపడంలో సహాయపడుతుంది. చక్కెర లేదా అధిక కేలరీల పానీయాలకు ఇది అద్భుతమైన ప్రత్యామ్నాయం.
శీతలీకరణ: కొబ్బరి నీళ్ళలో సహజంగా శీతలీకరణ లక్షణాలు ఉన్నాయి ఇవి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడతాయి. వేడి ఒత్తిడిని తగ్గిస్తాయి.
పోషకాలు: కొబ్బరి నీళ్ళలో కాల్షియం, ఐరన్, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. హీట్ వేవ్ సమయంలో ఇది చాలా ముఖ్యమైనది. వేడి ఒత్తిడి కారణంగా శరీరం అనారోగ్యం, ఇన్ఫెక్షన్ కు ఎక్కువ అవకాశం ఉంటుంది.
కేలరీలు తక్కువ: ఇందులో కేలరీలు చాలా తక్కువ. డీహైడ్రేషన్ కి దోహదపడే చక్కెర లేదా అధిక కేలరీల పానీయాలకు బదులు దీన్ని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
లేత కొబ్బరిని స్మూతీస్ కలపడం లేదా మోజీటోస్ వంటి కాక టెయిల్ లో కలుపుకుని తీసుకోవచ్చు. లేత కొబ్బరి కాస్త తియ్యగా, కాస్త వగరుగా ఉంటుంది.
బరువు తగ్గిస్తుంది: కొబ్బరి నీళ్ళలో కేవలం 48 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇందులో కొవ్వు శాతం సున్నా. జీర్ణక్రియ, జీవక్రియని పెంచడంలో సహాయపడే బయో యాక్టివ్ ఎంజైమ్ లను కలిగి ఉంటుంది. రోజుకి 3-4 సార్లు కొబ్బరి నీటిని తాగొచ్చు. ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి.
డిటాక్స్ డ్రింక్: శరీరాన్ని శుద్ధి చేయడంలో కొబ్బరి నీళ్ళు సహాయపడతాయి. శరీరంలోని టాక్సిన్స్ ని బయటకి పంపించి రిఫ్రెష్ గా చేస్తుంది.
జీర్ణక్రియకి సహాయపడుతుంది: ఇందులోని బయో యాక్టివ్ సమ్మేళనాలు, ఫైబర్ అధికంగా ఉంటాయి. జీర్ణక్రియకి సహాయపడతాయి. యాసిడ్ రిఫ్లక్స్ అవకాశాలను తగ్గిస్తుంది. ఒక గ్లాసు కొబ్బరి నీరు తాగితే ఉబ్బరం, ఎసిడిటీ సమస్యను దూరం చేస్తుంది.
చర్మం కోసం: యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. పొడి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. నేరుగా దీన్ని ముఖానికి కూడా అప్లై చేసుకోవచ్చు. మేకప్, మురికి, అదనపు నూనెని తొలగిస్తుంది.
మొటిమలు తొలగిస్తుంది: కొబ్బరి నీళ్ళలో 94 శాతం నీరు ఉంటుంది. చర్మం పొడిబారినట్లయితే కొబ్బరి నీళ్ళు తాగొచ్చు. ఎర్రటి మచ్చలు, ఇతర చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. మొటిమల చర్మం అయితే వాటిని తగ్గించేస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Red: ఒత్తిడి వల్ల జుట్టు రాలుతుందా? దాన్ని అధిగమించేందుకు ఈ మార్గాలు ఉత్తమం