Hair Loss: ఒత్తిడి వల్ల జుట్టు రాలుతుందా? దాన్ని అధిగమించేందుకు ఈ మార్గాలు ఉత్తమం
జుట్టు రాలే సమస్యని ఎక్కువ మంది ఎదుర్కొంటున్నారు. దీన్ని పరిష్కరించుకునేందుకు పోషకాహారం చక్కని పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు.
కోవిడ్ ఇన్ఫెక్షన్ తర్వాత జుట్టు రాలడం చాలా మందిలో ఎక్కువగా కనిపించింది. వైరస్ వల్ల ఒత్తిడికి గురై జుట్టు రాలిపోయిందని ఆరోగ్య నిపుణులు చెప్పుకొచ్చారు. వైద్య రంగంలోని తాజా పరిశోధనల ప్రకారం కోవిడ్ తర్వాత చాలా వరకు జుట్టు రాలడం టెలోజెన్ ఎఫ్లూవీయం అనే కండిషన్ నుంచి వచ్చింది. ఒత్తిడి వల్ల జుట్టు రాలిపోయే రివర్సిబూల్ కండిషన్. పరిశోధన ప్రకారం కోవిడ్ వల్ల వచ్చిన ఒత్తిడి శరీరానికి తీవ్ర నష్టం చేకూరుస్తాయని తెలిపారు. గ్రోత్ రెస్ట్ సైకిల్ కి అంతరాయం కలిగిస్తాయి. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కోవిడ్ సోకిన కొన్ని నెలల తర్వాత తీవ్రమైన జుట్టు రాలిపోయే సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇది ఎలాంటి మందులు లేకుండా దానంతట అదే ఆగిపోతుంది.
జుట్టు సమస్యలు ఒత్తిడితో ముడిపడి ఉన్నాయని ఎలా తెలుసుకోవాలో నిపుణులు కొన్ని సూచనలు చేశారు. శారీరంలో ఒత్తిడి కనిపించేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. ఒత్తిడి వల్ల తరచుగా వెంట్రుకలు పలుచబడటం, నెరిసిపోవడం జరుగుతుంది. అధిక ఒత్తిడి సమస్యగా మారితే జుట్టు విరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాల్యూమ్ తక్కువగా ఉంది గరుకుగా పొడిగా కనిపిస్తుంది. ఇక మీకు చుండ్రు సమస్య ఉంటే ఒత్తిడి దాన్ని పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. ఒత్తిడి విషయానికొస్తే నేరుగా టెలోజెన్ ఎఫ్లూవియం, ట్రైకోటిల్లోమానియా, అలోపేసియా అరేటా వంటి అనారోగ్యాల ద్వారా జుట్టు పల్చబడటానికి దారితీస్తుంది.
సప్లిమెంట్లు తీసుకోవచ్చా?
జుట్టు రాలడానికి చికిత్స చేయడానికి చాలా మంది సప్లిమెంట్ల వైపు మొగ్గు చూపఋ. కానీ ఈ పరిస్థితిని అధిగమించేందుకు సప్లిమెంట్లు నిజంగా పని చేస్తాయా లేదా అనే అనుమానం వస్తుంది. అయితే ఒత్తిడి వల్ల జుట్టు రాలడం మరింత ఎక్కువగా ఉంటుంది. ఎంత ఎక్కువ ఒత్తిడికి గురైతే అంత ఎక్కువగా జుట్టు రాలిపోతుంది. దీని నుంచి బయట పడేందుకు విటమిన్లు/ సప్లిమెంట్లు సహాయపడతాయి. ప్రోటీన్, విటమిన్లు, జింక్, ఇతర మంచి మినరల్స్ తో కూడిన సమతుల్య ఆహారానికి ప్రత్యామ్నాయంగా ఇవి సహాయపడతాయి. తగినంత నీరు తాగడం, బాగా నిద్రపోవడం కూడా పాటించడం చాలా అవసరం. ఇవి మీ జుట్టుని రక్షించి ఆరోగ్యంగా ఉంచుతాయి.
జుట్టుకి చికిత్స చేయడానికి సరైన మార్గం ఏంటి?
జుట్టుకి మేలు చేసే నూనెలు, హెయిర్ స్పాస్ తో జుట్టు రాలడాన్ని నియంత్రించుకోవచ్చని అనుకుంటారు. కానీ వీటికంటే చేయాలసిన ముఖ్యమైన పనులు ఉన్నాయి. తడిగా ఉన్నప్పుడు జుట్టు దువ్వకూడదు. తరచూ పొడిగాను ఉంచుకోకూడదు. తేలికపాటి షాంపూ ఉపయోగించుకోవాలి. జుట్టు రాలడం మరింత ఎక్కువగా ఉంటే వైద్యులని సంప్రదించి తగిన సూచనలు పాటించడం మంచిది. వారానికి ఒకసారి ఆయిల్ మసాజ్ చేయడం వల్ల హెయిర్ ఫోలికల్స్ హైడ్రేట్ అవుతాయి. అయితే ఒకటి కంటే ఎక్కువగా రాత్రి నూనెలో ఉంచుకోవద్దు. నూనె రాసుకున్న తర్వాత నేరుగా బ్రష్ చేయడం మానుకోవాలి.
వారానికి ఒకసారి కంటే ఎక్కువ నూనె రాయకూడదు. జుట్టు ఎప్పుడు ఫ్రీగా ఉంచకూడదు. అలాగే బ్యాండ్ తో గట్టిగా కట్టుకోకూడదు. ఇవి రెండూ జుట్టు రాలదాన్ని మరింత పెంచుతాయి. ఒత్తిడి వల్ల జుట్టు రాలడాన్ని ఆపడానికి ఉన్న ఏకైక మార్గం ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం. యోగా, ధ్యానం వంటివి చేయాలి. ప్రోటీన్లు, మినరల్స్ తో కూడిన పోషకమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఇది జుట్టుని మాత్రమే కాదు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: రోజుకో ఐదు వాల్‌నట్స్‌తో మీ అందం రెట్టింపు