Festival Season: పండగల్లో ప్రత్యేకంగా కనిపించాలని ఆశ పడుతున్నారా? కరీనా కపూర్ స్టైల్ ఫాలో అవుతారా
కరీనా ధరించే దుస్తులు, నగలు అన్నీ ప్రత్యేకమే. ఆమె స్టయిల్ బాలీవుడ్ లో ప్రత్యేకం. ఆమె నగల్లో చాలా ప్రత్యేకమయినవి ఆమె ధరించే ఇయర్ రింగ్స్. ఒకసారి వాటి మీద ఒక లుక్ వేధ్దాం.

Kareena Kapoors vanity case for this festive season | పండగకు ప్రత్యేకంగా కనిపించాలని అందరూ అనుకుంటారు. ఇలా ప్రత్యేకంగా కనిపించేందుకు ప్రత్యేక అలంకరణ కూడా అవసరమవుతుంది. అలంకరణలో నగలది ప్రత్యేక స్థానం. ముఖంలో ప్రస్ఫుటంగా కనిపించే ఇయర్ రింగ్స్ ది మరింత ప్రత్యేకత. ఇయర్ రింగ్స్ తోనే అలంకారం పూర్తవుతుంది. స్టయిలింగ్ స్టేట్మెంట్ లో ప్రత్యేక స్థానం కలిగిన కరీనా కపూర్ స్టయిల్ ఇయర్ రింగ్స్ ను చూద్దాం. మీకూ నచ్చుతాయేమో ఒక లుక్ వెయ్యండి.
బాలీవుడ్ స్టయిల్ ఐకాన్స్ లో కరీనా కపూర్ ఒకరు. ఆమె కనిపించిన ప్రతిసారీ స్పెషల్ స్టైల్ స్టేట్మెంట్స్ సెట్ చేస్తూనే ఉంటుంది. ఆమె స్టయిల్, ఫ్యాషన్ ఆమెలోని కాన్ఫిడెన్స్ ను ప్రతిబింబిస్తుంది. అందుకే ఆమె ఫ్యాషన్ ఐకాన్ గా నిలుస్తుంది.
ఆమె ప్రత్యేకతను నిలిపే ఆమె ఆహార్యంలో ఆమె ఇయర్ రింగ్స్ కి స్థానం చాలా ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు. ఆమె ప్రతి డ్రెస్ ఆమె ధరించే ఇయర్ రింగ్స్ తో చాలా స్టయిలిష్ గా మారిపోతాయి. ఈ పండుగ సీజన్ లో స్టయిలిష్ గా కనిపించాలని ఆశ పడే వారికి ఆమె ధరించే ఇయర్ రింగ్స్ డిజైన్స్ స్ఫూర్తినిస్తాయి.
ట్రెండ్ ఫాలో చేసే వారికి కరీనా అటైర్ కచ్చితంగా ఇన్స్ప్ ప్రియేషన్. మీ దగ్గరున్న దుస్తులకు కరీనా ఇయర్ రింగ్స్ ని పెయిర్ చేసి మీ లుక్ ని మరింత ఎలిగెంట్ గా మార్చుకోవచ్చు. మరి అవి ఎలా ఉంటాయో చూద్దాం.
గోల్డెన్ చాంద్ బాలి
కరీనా కపూర్ ధరించే పెద్ద సైజు బంగారు చాంద్ బాలీలు ప్రత్యేక పండుగ సందర్భాల్లో ఎవరి రూపానికైనా ప్రత్యేకతను ఇవ్వగలవు. చాంద్ బాలి మోడ్రన్ గానూ, గ్రేస్ ఫుల్ గానూ కనిపిస్తాయి.
షాండిలియర్ చెవి పోగులు
వెంటి షాండిలియర్ ఇయర్ రింగ్స్ లగ్జరీగానూ, గ్లామరస్ గానూ ఉంటాయి. ఫంక్షన్ కి లేదా పండగల కోసం ధరించే దుస్తులను బట్టి మరింత శోభగా ఉంటాయి. కరీనా ధరించే డ్రాప్ హ్యాంగింగ్స్ చూసే వారిని మంత్రముగ్ధులను చేస్తాయి. ఆమె ముఖం మరింత అందంగా మెరిసేందుకు కారణమవుతాయి.
డాంజ్లర్ చెవి పోగులు
డాంజ్లర్ ఇయర్ రింగ్స్ ధరించిన వారి ప్రతి చిన్న కదలికలోను వాటి మెరుపు ప్రత్యేకతను చూపుతాయి. మెరుస్తూ ఊగే ఈ ఇయర్ రింగ్స్ ముఖాన్ని మరింత చక్కదనంగా కనిపించేలా చేస్తాయి.
రాళ్లు పొదిగిన ఇయర్ రింగ్స్
పెద్దరాయి పొదిగి ఉన్న డ్రాప్ ఇయర్ రింగ్స్ మిమ్మల్ని షో స్టాపర్ గా నిలుపుతాయి. ఇది మీ లుక్ రిచ్ గా కనిపించేలా చేస్తుంది. గొప్ప గ్లామర్ తో మీరు సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలుస్తారు.
డైమండ్ డాంజ్లర్స్
డైమండ్ డాంజ్లర్ చెవి రింగులు లగ్జరీ లుక్ ను ఇస్తాయి. చాలా మోడ్రన్ గా కనిపిస్తాయి. వాటి మెరుపు, సున్నితమైన ఆకర్శణ గ్లామరస్ గా ఉంటాయి. మీమ్మల్ని స్టార్ లా కనిపించేలా చేస్తాయి. పండుగ వేడుకల్లో మీ రూపం ఈ ఇయర్ రింగ్స్ తో సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

