అన్వేషించండి

Scrolling Social Media for Hours : గంటల తరబడి సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నారా? ఈ అలవాటు ఎంత ప్రమాదమో తెలుసా?

Spending Hours on Reels and Shorts : సోషల్ మీడియాను ఎక్కువగా చూస్తున్నారా? అయితే ఇది మీ శారీరక, మానసిక పరిస్థితిపై తీవ్రమైన డ్యామేజ్ చూపిస్తుందని అన్నారు నిపుణులు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సోషల్ మీడియా వాడకం డోపమైన్ విడుదలను ప్రేరేపిస్తుంది, వ్యసనానికి దారితీస్తుంది.
  • ఒత్తిడి, ఒంటరితనం, నిద్రలేమి, ఏకాగ్రత లోపం సమస్యలు పెరుగుతాయి.
  • ఇతరులతో పోల్చుకోవడం ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది, శారీరక సమస్యలకు దారితీస్తుంది.
  • టైమ్ లిమిట్, డిజిటల్ డిటాక్స్, ప్రత్యామ్నాయ అలవాట్లతో నియంత్రించవచ్చు.

Hidden Dangers of Doomscrolling Risks : ఈరోజుల్లో సోషల్ మీడియా చాలా మందికి రోజువారీ జీవితంలో భాగంగా మారిపోయింది. ఉదయం నిద్రలేవగానే ఫోన్ చూడటం మొదలుకొని.. రాత్రి పడుకునే వరకు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్, షార్ట్ వీడియోలు చూస్తూ గంటల కొద్ది సమయాన్ని గడిపేస్తుంటారు. చాలామంది దీన్ని టైంపాస్‌గా భావించినా.. నిపుణుల ప్రకారం ఇది కొన్ని మానసిక, శారీరక సమస్యలకు సంకేతం కావొచ్చు.

డోపమైన్ 

సోషల్ మీడియాలో ప్రతి నోటిఫికేషన్, లైక్, వీడియో, కొత్త పోస్టు అనేది మెదడులో డోపమైన్ అనే ఫీల్ గుడ్ కెమికల్ విడుదల అయ్యేలా చేస్తుంది. దీంతో మళ్లీ మళ్లీ ఫోన్ చూడాలనే కోరిక పెరుగుతుంది. ఇదే క్రమంగా అలవాటుగా మారి.. డూమ్ స్క్రోలింగ్‌ చేస్తారు. ఇది కంట్రోల్ చేయలేని పరిస్థితికి దారితీస్తుంది.

ఒత్తిడి, ఒంటరితనం

చాలామంది స్ట్రెస్, ఆందోళన, ఒంటరితనం, బోర్ ఫీలింగ్ నుంచి బయటపడేందుకు సోషల్ మీడియాను ఆశ్రయిస్తారు. కానీ తాత్కాలికంగా రిలాక్స్ అయినట్లు అనిపించినా.. ఎక్కువసేపు స్క్రోల్ చేయడం వల్ల మానసిక అలసట మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

నిద్రపై ఎఫెక్ట్

రాత్రి పడుకునే ముందు గంటల తరబడి ఫోన్ వాడటం వల్ల నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. మొబైల్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ మెదడును యాక్టివ్‌గా ఉంచి నిద్ర హార్మోన్ అయిన మెలటోనిన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. దీంతో ఆలస్యంగా నిద్రపోవడం, మధ్యలో మేల్కొనడం వంటి సమస్యలు రావచ్చు.

ఏకాగ్రత లోపం

చిన్న చిన్న వీడియోలు, వేగంగా మారే కంటెంట్‌ను నిరంతరం చూడడం వల్ల మెదడు ఎక్కువసేపు ఒక పనిపై ఫోకస్ చేయడం కష్టమవుతుంది. చదువు, పని, రోజువారీ పనుల్లో ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంటుంది.

కాన్ఫిడెన్స్ తగ్గుతుంది..

సోషల్ మీడియాలో ఇతరుల జీవితాలను చూసి తమ జీవితంతో పోల్చుకునే అలవాటు చాలా మందిలో పెరుగుతోంది. దీంతో ఆత్మవిశ్వాసం తగ్గడం, అసంతృప్తి, ఆందోళన వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా యువతపై దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.

శారీరక సమస్యలు 

గంటల తరబడి ఒకే పొజిషన్‌లో కూర్చొని ఫోన్ చూడడం వల్ల మెడ నొప్పి, కంటి అలసట, తలనొప్పి, చేతి నొప్పులు, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. శారీరక శ్రమ తగ్గిపోవడం వల్ల బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది.

ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే..

సోషల్ మీడియా వల్ల పని, చదువు, నిద్ర, ఫ్యామిలీ రిలేషన్స్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడు ఈ వ్యసనాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. ఫోన్ లేకుండా ఉండలేకపోవడం, పదే పదే నోటిఫికేషన్స్ చెక్ చేయడం, స్క్రీన్ టైమ్ తగ్గించలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త అవసరం.

ఎలా కంట్రోల్ చేయాలి?

రోజుకు ఎంతసేపు సోషల్ మీడియా వాడాలో టైమ్ లిమిట్ పెట్టుకోవాలి. పడుకునే ముందు కనీసం ఒక గంట ఫోన్ దూరంగా పెట్టాలి. అవసరం లేని నోటిఫికేషన్స్ ఆఫ్ చేయాలి. వ్యాయామం, పుస్తకాలు చదవడం, కుటుంబంతో సమయం గడపడం వంటి అలవాట్లు పెంచుకోవాలి. అవసరమైతే డిజిటల్ డిటాక్స్ ప్రయత్నించాలి. 

సోషల్ మీడియా పూర్తిగా చెడు కాదు. కానీ నియంత్రణ లేకుండా వాడితే అది మానసిక ఆరోగ్యం, నిద్ర, ఏకాగ్రత, వ్యక్తిగత జీవితంపై నెగిటివ్​గా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్ కోసం దీనిని క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bugs in Rice : బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
Room Fresheners : రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
Calcium-Rich Foods : కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Advertisement

వీడియోలు

Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Embed widget