International Yoga Day 2024: మెడ నొప్పిని తగ్గించి.. ఒత్తిడిని దూరం చేసే ఆసనాలు ఇవే
Stretches for Neck Pain : నిద్రలేచిన వెంటనే చాలామందికి మెడపట్టేస్తుంది. దీనివల్ల ఏ పని చేయాలన్నా కష్టంగా ఉంటుంది. అలాంటి వారు కొన్ని ఆసనాలు చేయడం వల్ల దాని నుంచి ఉపశమనం పొందవచ్చు.
Yoga Poses for Neck Pain : అబ్బా మెడ పట్టేసిందంటూ చాలామందికి రోజు ప్రారంభమవుతుంది. నిద్రలో ఒక్కోసారి మెడపట్టేయడం సహజం. కానీ దానివల్ల సరిగ్గా పని చేయలేక, కూర్చోలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీరు కూడా ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటున్నారా? అయితే మీ మెడ నొప్పిని దూరం చేసే కొన్ని ఆసనాలు ఇక్కడున్నాయి. ఇవి మీకు మెడ నొప్పిని దూరం చేయడమే కాకుండా ఒత్తిడి నుంచి విశ్రాంతినిస్తూ.. మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి.
స్ట్రెచ్‌లు..
మెడనొప్పిని తగ్గించుకోవడానికి నెక్ స్ట్రెచ్‌లు చాలా సులభమైన, సమర్థవంతమైన మార్గంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇవి మెడ, భుజాల చుట్టూ ఉన్న ఒత్తిడిని తగ్గించడంలో సహాయం చేస్తాయి. అంతేకాకుండే మెడ నుంచి దాదాపు ఉపశమనం ఇస్తాయి. అయితే ఈ స్ట్రెచ్‌లు చేసేప్పుడు బలవంతంగా కాకుండా కాస్త.. సుకుమారంగా స్ట్రెచ్‌లు చేయాలి. ఎక్కువ బలం ప్రయోగిస్తే నొప్పి ఎక్కువయ్యే ప్రమాదముంది. ఈ వ్యాయామం చేస్తున్నప్పుడు డీప్ బ్రీత్స్ తీసుకుంటే చాలా మంచిది.
రోల్స్..
మెడనొప్పి, అసౌకర్యాన్ని దూరం చేయడంలో నెక్ రోల్స్ మీకు ప్రశాంతతను ఇస్తాయి. ఇవి రక్తప్రసరణను పెంచి.. మెడ కండరాలలో ఒత్తిడిని తగ్గిస్తాయి. తద్వారా మీరు నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. ఈ రోల్స్‌ను కూడా మీరు సున్నితంగా చేయాల్సి ఉంటుంది. దీనిని మీరు ఉదయాన్నే, నిద్రపోయే ముందు కూడా చేయవచ్చు.
మర్జర్యాసనం
మెడ, వెన్నెముక సమస్యలున్న వారు కచ్చితంగా చేయాల్సిన ఆసనాల్లో మర్జర్యాసనం ఒకడి. ఇది మీకు నొప్పి నుంచి చక్కటి ఉపశమనం అందిస్తుంది. ఈ ఆసనం వేస్తున్నప్పుడు మీరు శ్వాస మీద ధ్యాస ఉంచాలి. దీనిని చేయడం వల్ల మీరు వెంటనే నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. వెన్ను సమస్యలున్నవారు కూడా ఆ ఆసనం చేయవచ్చు. వెన్నుముకను బలంగా చేసుకోవాలనుకునేవారు కూడా ఈ ఆసనం రెగ్యూలర్‌గా ప్రాక్టీస్ చేయవచ్చు.
బాలాసనం
ఇది మెడను, వెన్నుముకను సాగదీయడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా మీరు ఒత్తిడిని తగ్గించుకుని విశ్రాంతి పొందేందుకు మంచి ఆసనం. ఇది మెడ, భుజాలలోని నొప్పిని తగ్గించి.. మీకు మంచి విశ్రాంతినిస్తుంది. అంతేకాకుండా మీ సిట్టింగ్ పొజిషన్ని కూడా దీనితో మార్చుకోవచ్చు. ఈ ఆసనంలో కూడా శ్వాస ముఖ్యపాత్ర పోషిస్తుంది.
సర్పాసనం..
సూర్యనమస్కారాల్లో ఇది కూడా ఒకటి. ఇది మెడ సమస్యలను దూరం చేయడంలో, ఒత్తిడి తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. మెడ, భుజాల దగ్గర కండరాలను బలోపేతం చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా మెరుగైన భంగిమను మీకు అందిస్తుంది. మెడనొప్పిని తగ్గించి.. ఛాతీ, ఉదరం దగ్గరి కొవ్వును తగ్గిస్తుంది. మెరుగైన శ్వాస, రక్తప్రసరణ, ఒత్తిడిని తగ్గించుకునేందుకు హెల్ప్ చేస్తుంది.
బ్రిడ్జ్ ఆసనం
దీనినే వంతెన భంగిమ అని కూడా అంటారు. ఈ ఆసనం ఎగువ వీపు, భుజాలను బలపరచడంలో హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా మెడ, భుజాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ ఆసనం చేయడం కూడా చాలా తేలిక. దీనిని చేసిన తర్వాత మీరు కచ్చితంగా మెడ నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు.
మెడ నొప్పిని తగ్గించడంలో ఇవి మంచి ప్రయోజనాలే అందించినా.. మీరు వీటిని యోగా నిపుణుల సమక్షంలో చేస్తే మరిన్ని మంచి ఫలితాలు పొందవచ్చు. లేదంటే మీరు తెలియక చేసే పొరపాట్లు మీ సమస్యను మరింత తీవ్రం చేసే అవకాశముంది. ఇవి చేసినా మీకు ఫలితం లేదంటే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి. వారు మీకు నెక్ బ్యాండ్ వేయడం లేదా ఫిజియో చేయిస్తారు.
Also Read : బాలాసనంతో బోలెడు ప్రయోజనాలు.. ఆ సమస్యలుంటే కచ్చితంగా ట్రై చేయండి