Vitamin D Deficiency: ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా? జాగ్రత్త.. ‘విటమిన్-D’ లోపం నరకం చూపిస్తుంది!
అసలే చలికాలం.. సూర్యరశ్మి కూడా అంతంత మాత్రం.. ఈ సమయంలో ‘విటమిన్-డి’ లభించడం చాలా కష్టం. కాబట్టి.. ‘విటమిన్-డి’ ఎక్కువగా ఉండే ఈ ఆహారాలను ఎక్కువగా తీసుకుని అప్రమత్తంగా ఉండండి.
శరీరానికి అన్నిరకాల విటమిన్లు అందితేనే ఆరోగ్యంగా ఉండగలం. ఏ విటమిన్ తగ్గినా.. అనారోగ్యాలు దాడి చేసేందుకు సిద్ధమవుతాయి. ముఖ్యంగా శరీరానికి అత్యంత ముఖ్యమైన ‘విటమిన్-D’ లోపిస్తే.. నరకం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కింది లక్షణాలు మీలో కనిపిస్తున్నట్లయితే.. తప్పకుండా జాగ్రత్తపడండి. వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
విటమిన్-D అనేది కొవ్వులో కరిగే ముఖ్యమైన విటమిన్. ఇది ఆహారం ద్వారా లభిస్తుంది. లేదా శరీరంలోనే ఉత్పత్తి అవుతుంది. విటమిన్-D లోపం.. శరీర కండరాల పనితీరును ప్రభావితం చేస్తుంది. కండరాల నొప్పి, నీరసం, ఎముక సాంద్రత, పిల్లల్లో రికెట్స్ సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు సహకరించే విటమిన్-D అధిక మొత్తంలో శరీరానికి అందడం చాలా ముఖ్యం. ఎపిడెమియోలాజికల్ అధ్యయనాల్లో విటమిన్-D అధిక స్థాయిలో ఉండే వ్యక్తులు ఎంతో ఆరోగ్యంతో.. చురుగ్గా ఉన్నట్లు తేలింది.
☀ విటమిన్-D ఎముకల జీవక్రియకు అవసరమైన హార్మోన్ ఉత్పత్తికి, కండరాలు ఆరోగ్యంగా ఉండేందుకు చాలా అవసరం.
☀ చలికాలం వల్ల ఎండ తీవ్రత తక్కువగా ఉంటుంది. కాబట్టి.. ఈ సీజన్‌లో ‘విటమిన్-D’ సమస్యలు ఏర్పడతాయి.
☀ విటమిన్-Dను ఆహారం, సప్లిమెంట్ల నుంచి కూడా పొందవచ్చు.
☀ విటమిన్-D రోగనిరోధక వ్యవస్థను పటిష్టంగా ఉంచుతుంది.
☀ ఈ విటమిన్ శరీర కణజాలాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
☀ చర్మానికి సూర్యరశ్మి తగిలినప్పుడు ‘సన్‌షైన్ విటమిన్’ ఉత్పత్తి అవుతుంది. ఇది ఆరోగ్యాన్ని అందిస్తుంది.
☀ శీతాకాలంలో శరీరానికి విటమిన్ D లభించాలంటే కనీసం 10-30 నిమిషాలు సూర్యరశ్మి తగలాలి.
విటమిన్-D లోపిస్తే ఏమవుతుంది?:
☀ ఆహారం సక్రమంగా తీసుకోకపోవడం లేదా శరీరానికి UV కాంతి (సూర్యరశ్మి) తగినంతగా అందకపోవడం వల్ల ఈ లోపం ఏర్పడుతుంది.
☀ విటమిన్-D అనేది కొవ్వులో కరిగే హార్మోన్. ఇది లోపిస్తే.. పేగు, జీర్ణ సంబంధిత సమస్యలు ఏర్పడతాయి.
☀ D Vitamin లోపం వల్ల పిల్లల్లో ‘రికెట్స్’ ఏర్పడుతుంది. దీనివల్ల ఎముకల వృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది.
☀ విటమిన్-డి వల్ల పెద్దవారిలో ‘ఆస్టియోమలాసియా’ ఏర్పడుతుంది.
☀ కాలేయం, మూత్రపిండ వ్యాధులు, సిస్టిక్ ఫైబ్రోసిస్, ఊబకాయం ఉన్నవారు లేదా గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేయించుకున్న వ్యక్తులు ఎక్కువగా డి-విటమిన్ లోపాన్ని ఎదుర్కొంటారు.
☀ శరీరంలో చిన్న అసౌకర్యం ఉన్నా.. విస్మరించకూడదు. ఎందుకంటే.. అది మరింత సంక్లిష్టంగా మారుతుంది.
☀☀ విటమిన్-డి లోపం ఎదుర్కొనేవారికి కండరాలు నొప్పి ఎక్కువగా ఉంటుంది. కొందరికి ఎముకలు నొప్పి పెడతాయి. అలసట, కండరాల తిమ్మిరి వంటి లక్షణాలు ఉంటే.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
ఈ ఆహారాల్లో ‘విటమిన్-డి’ పుష్కలం:
⦿ పుట్టగొడుగుల్లో ‘విటమిన్-డి’ ఎక్కువగా ఉంటుంది.
⦿ గుడ్లను ఆహారంగా తీసుకుంటే ‘విటమిన్-D’ లభిస్తుంది.
⦿ పాలు, సోయా పాలు లేదా నారింజ రసంలో సైతం విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి.
⦿ ట్యూనా, సాల్మన్ చేపలు వంటి సముద్రపు ఆహారంలో కూడా విటమిన్-డి సమృద్ధిగా ఉంటుంది.
⦿ జున్ను, పాలు, టోఫు, పెరుగు, గుడ్లు వంటి పాల ఉత్పత్తులు ‘విటమిన్-డి’కి మంచి వనరులు.
⦿ చలికాలంలో వీలైనంత ఎక్కువ సేపు ఎండలో ఉన్నట్లయితే శరీరానికి కావలసినంత Vitamin D లభిస్తుంది.
గమనిక: ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే అందించాం. మీలో ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సొంత వైద్యం ఎప్పటికీ మంచిది కాదు. ఇందులోని డైట్ తదితర అంశాలను పాటించే ముందు తప్పకుండా వైద్యుడి సలహా తీసుకోవాలి.
Note: ఇది ‘ఏబీపీ దేశం’ ఒరిజినల్ కంటెంట్. కాపీరైట్స్ కింద చర్యలు తీసుకోబడతాయి.
Also Read: వామ్మో.. కొప్పులో పాము, ఆమె జడను చూసి జడుసుకున్న జనం, వీడియో వైరల్
Also Read: ఇలా హగ్ చేసుకుంటే.. శృంగారానికి ‘సై’ అన్నట్లే.. ఒక్కో కౌగిలింతకు ఒక్కో అర్థం!
Also Read: ఓనరమ్మతో భర్త సయ్యాట.. డోర్ బెల్ కెమేరాకు చిక్కిన శ్రీవారి లీలలు! (వీడియో)
Also Read: బాయ్‌ఫ్రెండ్ ముద్దు పెట్టలేదని పోలీసులకు కాల్ చేసిన ప్రియురాలు, చివరికి..