By: ABP Desam | Updated at : 30 Sep 2021 10:53 AM (IST)
(Photo credit: UN.Org)
ఏంటీ దినోత్సవం?
ఎర్త్ డే, సైన్స్ డే, ఫాదర్స్ డే, మదర్స్ డే.... ఇలా ఎన్నో ప్రత్యేక రోజులు. ఇంజినీర్స్ డే, డాక్టర్స్ డే.. వృత్తుల ప్రాముఖ్యతను చాటి చెప్పేందుకు కూడా స్పెషల్ గా కొన్ని రోజులను కేటాయించారు. ఆధునిక కాలంలో సమాచార మార్పిడి ఎక్కువైంది. ఒక భాషలోని భావాలు మరో భాష మాట్లాడే ప్రజలకు అర్థమవ్వాలంటే కచ్చితంగా అనువాదం అవసరం. అలా గత పదేళ్ల లో అనువాదకు అవసరం ప్రపంచదేశాలకు ఎక్కువైంది. దీంతో ఎన్నో అనువాద సంస్థలు సేవలు ప్రారంభించాయి. వాటిలో ఎంతో మంది అనువాదకులు భాషకు,భాషకు మధ్య వారధిలా పనిచేస్తున్నారు. వారందరి సేవలను గుర్తిస్తూ ‘అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని ప్రతిపాదించారు. ఈ దినాన్ని బైబిల్ అనువాదకుడు సెయింట్ జెరోమ్ కు అంకితమిచ్చారు.
ఎవరు నిర్ణయించారు?
ప్రపంచదేశాల మధ్య వారధిలా పనిచేసే అనువాద ప్రక్రియకు ఏడాదిలో ఓ రోజును కేటాయించాలని ‘ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ట్రాన్స్ లేటర్’ అనే సంస్థ 1953లో ప్రతిపాదించింది. కానీ ఆ విషయాన్ని చాలా ఏళ్ల పాటూ ఎవరూ పట్టించుకోలేదు. గత కొన్నేళ్లు లోకలైజేషన్ భారీగా పెరిగింది. గూగుల్ వంటి సంస్థలు కూడా స్థానిక భాషల్లో తమ సేవలు మొదలుపెట్టారు. ప్రపంచంలో అనువాదకుల సంఖ్య భారీగా పెరుగుతూ వస్తోంది. దీంతో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో అనువాద దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు.
ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు?
తొలిసారి అనువాద దినోత్సవాన్ని 2017, సెప్టెంబర్ 30 నిర్వహించారు. తొలుత కేవలం అజర్ బైజాన్, బంగ్లాదేశ్, బెలారస్, కోస్టారికా, క్యూబా, టర్కీ... ఇలా కొన్ని చిన్నదేశాలు మాత్రమే డ్రాఫ్ట్ రిజల్యూషన్ పై సంతకాలు చేశాయి. 2018 నుంచి అమెరికా ట్రాన్స్ లేటర్స్ అసోసియేషన్ కూడా సెపెంటర్ 30న అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని నిర్వహించుకోవడం ప్రారంభించింది. అంతేకాదు సమాచార వ్యాప్తికి, అనువాదకుల పాత్ర గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సామాజిక మాధ్యమాల్లో పలు కార్యక్రమాలు కూడా చేపట్టింది.
ఎవరీ సెయింట్ జెరోమ్?
ప్రపంచ అనువాదకుల పితామహుడిగా పిలుస్తారు సెయింట్ జెరోమ్ ని. ఈయన ఇటలీకి చెందిన ప్రీస్ట్. గ్రీకు భాషలో ఉన్న బైబిల్ ను లాటిన్ భాషలోకి అనువాదం చేశారు. ఈయన సెప్టెంబర్ 30, క్రీస్తు పూర్వం 420లో బెత్లెహామ్ నగరానికి సమీపంలో మరణించారు. ఆయన జన్మించిన తేదీ ఎవరికీ తెలియదు. అందుకే ఆయన చనిపోయిన రోజునే, అతని గౌరవార్థం అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని ప్రకటించారు.
Also read: మహానటి అందం వెనుక రహస్యాలివే... మీరూ ఫాలో అయిపోండి
Also read: కుంభకర్ణుడి విలేజ్.. రోజుల పాటూ నిద్రపోయే గ్రామస్థులు, కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు
Also read: సర్జరీ సమయంలో ఏడవకండి... దానికి కూడా బిల్లేస్తారు, ఆ దేశంలో ఇదో కొత్త పద్ధతి
Soya Beans: సోయాబీన్స్‌తో చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చా? ఏ విధంగా తీసుకోవాలి?
AP News : సైకిల్ పై దేశవ్యాప్తంగా యాత్ర - రూ. 10 లక్షల సాయం ప్రకటించిన సీఎం జగన్ !
Weight Gain: బరువు పెరగాలా? అయితే ఈ ఆహారాలు మీ డైట్లో చేర్చుకోండి
బ్రెయిన్ స్ట్రోక్ భయం వెంటాడుతోందా? మీ మొబైల్‌తో ఆ ముప్పును ముందే కనిపెట్టేయొచ్చు!
HeadPhones: హెడ్ ఫోన్స్ అధికంగా వాడుతున్నారా? అయితే మెదడు, గుండెకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు
Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!
Love Marriage : సరిహద్దులు లేని ప్రేమ - ఆదిలాబాద్ అబ్బాయితో మయన్మార్ అమ్మాయికి పెళ్లి
Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!
Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసిన మాజీ భారత ఆటగాళ్లు వీరే - లిస్ట్‌లో ఐదుగురు!