X
Super 12 - Match 22 - 28 Oct 2021, Thu up next
AUS
vs
SL
19:30 IST - Dubai International Cricket Stadium, Dubai
Super 12 - Match 23 - 29 Oct 2021, Fri up next
WI
vs
BAN
15:30 IST - Sharjah Cricket Stadium, Sharjah

SHOCKING: సర్జరీ సమయంలో ఏడవకండి... దానికి కూడా బిల్లేస్తారు, ఆ దేశంలో ఇదో కొత్త పద్ధతి

సర్జరీ అంటే భయంతో ఏడ్చేసేవాళ్లు చాలా మంది ఉంటారు. ఆ ఏడుపుకు కూడా బిల్లేస్తున్నాయిట అమెరికా ఆసుపత్రులు.

FOLLOW US: 

సర్జరీ చిన్నదా, పెద్దదా అనవసరం, కోత అంటేనే భయపడిపోతాం. అది మనిషికి ఉండే సహజనైజం. ఆ భయం వల్ల పుట్టిన మానసిక ఒత్తిడితో కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. కొంతమంది గట్టిగా ఏడ్చేసి బాధను తగ్గించుకుంటారు. సర్జరీకి ముందు దాదాపు అందరికీ దాదాపు ఇదే అనుభవమే కలుగుతుంది. అమెరికాలో కూడా సర్జరీ సమయంలో ఓ అమ్మాయి ఎమోషనల్ అయ్యింది. భయంతో ఏడ్చింది. అలా ఏడ్చినందుకు ఆమెకు ఊహించని షాక్ ఇచ్చారు ఆసుపత్రి వర్గాలు. 

మిడ్గే అనే అమ్మాయి పుట్టుమచ్చలు తొలగించుకోవడానికి ఆసుపత్రికి వెళ్లింది. మైనర్ సర్జరీ ద్వారా వాటిని తొలగించేందుకు సిద్ధమయ్యారు వైద్యులు. ఆ సమయంలో భయంతో మిడ్గే ఏడ్చింది. వైద్యులు ధైర్యం చెప్పి పుట్టుమచ్చలు తొలగించారు. డిశ్చార్జ్ చేసే ముందు బిల్లు పంపించారు. మొత్తం 223 డాలర్ల బిల్లు వేశారు. అందులో 11 డాలర్లు ఆమె ఏడ్చినందుకు బిల్లు వేశారు. అంతేకాదండోయ్ రెండు డాలర్ల డిస్కౌంట్ కూడా ఇచ్చారు.  దానికి ‘బ్రీఫ్ ఎమోషన్’ అన్న పేరుతో బిల్లును వసూలు చేస్తున్నట్టు చూపించారు. అది చూసి మిడ్గే షాకయ్యింది. భయంతో ఏడ్చినా కూడా బిల్లు వేస్తారా అంటూ ఆశ్చర్యపోయింది. ఆమె తొలిసారిగా ఇలాంటి బిల్లును చూసింది. దాన్ని అలా వదిలేసే కన్నా ప్రపంచానికి చెప్పాలనకుంది. తన ట్విట్టర్ ఖాతాలో ఆ బిల్లును పోస్టు చేసింది. 

ఆ బిల్లును చూసి చాలా మంది నెటిజన్లు షాకయ్యారు. నిమిషాల్లో ఆమె పోస్టు వైరల్ అయ్యింది. పదిలక్షలకు పైగా లైకులు వచ్చాయి. ఎనిమిది వేల మంది రీట్వీటులు చేశారు. కొంతమంది ‘అమెరికన్ హెల్త్ కేర్ సిస్టమ్ పరిస్థితి ఇలా ఉంది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెట్టారు. అమెరికాను చూసి మిగతా దేశాలు కూడా బిల్లులు వేయడం ప్రారంభిస్తే అంటూ ఇతర దేశాల నెటిజన్లు సెటైర్లు వేశారు. ఏదేమైనా ఏడ్చారని బిల్లు వేయడం మాత్రం ఇదే తొలిసారేమో.ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Also read: కుంభకర్ణుడి విలేజ్.. రోజుల పాటూ నిద్రపోయే గ్రామస్థులు, కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు

Also read: ఇంట్లో దోమలు ఎక్కువయ్యాయా... వెల్లుల్లితో తరిమికొట్టండి

Also read: గుండె పంపించే వార్నింగ్ సైన్ లను గమనిస్తున్నారా? నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకమే

Tags: American Hospital Crying Surgery Hospital Bill

సంబంధిత కథనాలు

Lightning: పిల్లాడు కాదు పిడుగు.. మెరుపు తాకినా బతికేశాడు, అవే రక్షించాయి!

Lightning: పిల్లాడు కాదు పిడుగు.. మెరుపు తాకినా బతికేశాడు, అవే రక్షించాయి!

Naked Culture: ఇండియాలోని ఈ గ్రామంలో మహిళలు 5 రోజులు నగ్నంగా ఉంటారు.. వారిని చూసి నవ్వితే..

Naked Culture: ఇండియాలోని ఈ గ్రామంలో మహిళలు 5 రోజులు నగ్నంగా ఉంటారు.. వారిని చూసి నవ్వితే..

Lifestyle News: ఈ కండోమ్ కథ విన్నారా? జెండర్‌తో సంబంధం లేదట.. ఎవరికైనా ఓకే!

Lifestyle News: ఈ కండోమ్ కథ విన్నారా? జెండర్‌తో సంబంధం లేదట.. ఎవరికైనా ఓకే!

Penis Plant: ఈ మొక్క పేరు ‘పురుషాంగం’.. పాతికేళ్లకు ఒకసారే పూస్తుందట, ఎక్కడో తెలుసా?

Penis Plant: ఈ మొక్క పేరు ‘పురుషాంగం’.. పాతికేళ్లకు ఒకసారే పూస్తుందట, ఎక్కడో తెలుసా?

Signs of Iron Deficiency: ఈ లక్షణాలు కనిపిస్తే మీకు ఐరన్ లోపం ఉన్నట్టే...

Signs of Iron Deficiency: ఈ లక్షణాలు కనిపిస్తే మీకు ఐరన్ లోపం ఉన్నట్టే...

టాప్ స్టోరీస్

Dinesh Karthik Update: దినేష్ కార్తీక్‌కు కవలలు.. క్రికెటర్ నాటీ రిప్లై.. ఏం పేర్లు పెట్టాడంటే?

Dinesh Karthik Update: దినేష్ కార్తీక్‌కు కవలలు.. క్రికెటర్ నాటీ రిప్లై.. ఏం పేర్లు పెట్టాడంటే?

Redmi Note 11 Series: రూ.14 వేలలోపే 5జీ ఫోన్.. 108 మెగాపిక్సెల్ కెమెరా వంటి సూపర్ ఫీచర్లు!

Redmi Note 11 Series: రూ.14 వేలలోపే 5జీ ఫోన్.. 108 మెగాపిక్సెల్ కెమెరా వంటి సూపర్ ఫీచర్లు!

Breaking News Live Updates: ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ రజనీ కాంత్..!

Breaking News Live Updates: ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ రజనీ కాంత్..!

Azim Premji Update: అజీమ్‌ ప్రేమ్‌జీని మించి ప్రేమించేదెవరు! రోజుకు రూ.27 కోట్లు దానం చేసిన ఆధునిక కర్ణుడు!

Azim Premji Update: అజీమ్‌ ప్రేమ్‌జీని మించి ప్రేమించేదెవరు! రోజుకు రూ.27 కోట్లు దానం చేసిన ఆధునిక కర్ణుడు!