అన్వేషించండి

Street Shopping Tips : బడ్జెట్, టైమ్​ను ఆదా చేసే స్ట్రీట్ షాపింగ్ టిప్స్.. ఫాలో అయిపోండి

Shop Like a Pro : కొందరు షాపింగ్ చాలా బాగా చేస్తారు. తక్కువ బడ్జెట్​లో ఎక్కువ వస్తువులు కొనుకుంటారు. మీలో ఆ కళ లేదా? అయితే మీరు ఈ టిప్స్ ఫాలో అయిపోండి. స్ట్రీట్ షాపింగ్​ని అదరగొట్టేయండి.

Tips for Street Shopping : కేవలం అమ్మాయిలే కాదు.. కొందరు అబ్బాయిలు కూడా షాపింగ్ చాలా బాగా చేస్తారు. మరికొందరికి అసలు షాపింగ్ చేయడమే రాదు. అసలు నిజమైన షాపింగ్ అంటే అది స్ట్రీట్ షాపింగ్​నే. గ్రాండ్ మాల్స్​కు వెళ్లి నచ్చింది కొనుక్కుని.. ఇంటి తెచ్చేసుకోవడం కూడా ఓ షాపింగేనా? అధిక ధరలతో డ్రెస్​లు కొనేసి.. ఇంటికొచ్చాక అయ్యే ఇది అంతగా బాలేదు అని బాధ పడేవారు చాలామందే ఉంటారు. దానిలో మీరు కూడా ఉన్నారా?

మీరు స్ట్రీట్ షాపింగ్​లో తక్కువ ధరకు అందమైన డ్రెస్​ కొనుక్కుంటే దానికొచ్చే కిక్ ఎంతో వేరుగా ఉంటుంది. కానీ ఏం లాభం మాకు స్ట్రీట్ షాపింగ్ రాదే అనుకుంటున్నారా? అస్సలు వర్రీ కాకండి. మీరు స్ట్రీట్ షాపింగ్​ని ప్రోగా ఎలా చేయాలో.. ఏ టిప్స్​ ట్రై చేస్తే మీ షాపింగ్ పద్ధతి మార్చుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టిప్స్ మీ డబ్బును, సమయాన్ని ఆదా చేయడమే కాకుండా.. ఫ్యాషన్​ మిమ్మల్ని ప్రో చేస్తుంది. 

చిల్లర క్యారీ చేయండి..

ఇది డిజిటల్ కాలమే అయినా.. మీరు షాపింగ్​కి వెళ్లేప్పుడు మాత్రం కచ్చితంగా లిక్విడ్ క్యాష్​ను, కుదిరితే చిల్లరను క్యారీ చేయండి. కార్డు పేమెంట్స్ చేయడం పెద్ద కష్టమేమి కాదు. కానీ మీరు స్ట్రీట్ షాపింగ్ చేస్తున్నప్పుడు ఇది సరైన ఎంపిక కాదు. డబ్బులు తీసుకెళ్లినప్పుడు మీ బడ్జెట్​కి మించి మీరు షాపింగ్ చేయలేరు. డబ్బులు లేవు కాబట్టి ఎక్కువగా బేరం ఆడి.. మంచి ధరలో మీకు కావాల్సిన దానిని కొనుక్కోవచ్చు. 

పెద్ద బ్యాగ్ ఉండాలి..

మీరు స్ట్రీట్ షాపింగ్​కు వెళ్లినప్పుడు ఎక్కువ వస్తువులు కొనే అవకాశముంటుంది. అక్కడి వాళ్లు ఇచ్చే కవర్స్​ అన్నింటిని హ్యాండిల్ చేయడం కష్టం కాబట్టి మీరు పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ తీసుకెళ్లండి. ఇది మీరు ఇబ్బంది పడకుండా ఎక్కువ సమయం షాపింగ్​ మీద ఇంట్రెస్ట్ ఉండేలా చేస్తుంది. 

బేరం లేకుంటే ఎలా?

స్ట్రీట్​ షాపింగ్​ని బేరం లేకుండా చేస్తే అసలు మీరు షాపింగ్​కు వెళ్లి వేస్ట్ అని అర్థం. మీకు నచ్చిన వస్తువును అధికమొత్తంలో కంటే.. కాస్త డిస్కౌంట్​తో కొనుక్కుంటే అది మీకు మరింత సంతోషాన్ని ఇస్తుంది. కాస్త బేరం ఆడితే తప్పేమి లేదు. చిన్నగా బేరం ఆడటం ప్రారంభిస్తే తర్వాత మీరే ప్రో అయిపోతారు. అమ్మేవారు ఎలాగో వారి ధరకంటే కాస్త ఎక్కువగానే చెప్తారు. కాబట్టి బేరం ఆడటంలో ఎలాంటి తప్పు లేదు. వారి ఆదాయం వారు చూసుకుంటే మన బడ్జెట్ మనం చూసుకోవాలి కదా. 

కొనేముందు బాగా అబ్జర్వ్ చేయండి

మీరు ఎన్ని షాపింగ్ చేశారనేది మ్యాటర్ కాదు. ప్రొడెక్ట్ ఎంత బాగా పర్​ఫెక్ట్​గా ఉందనేది మ్యాటర్. మీరు ఎంత బేరం ఆడి కొన్నా.. ఆడకుండా కొన్నా మీరు కొన్న ఉత్పత్తి ఎంత క్యాలిటీగా ఉందో ముందే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు కొనేసిన తర్వాత రిటర్న్ తీసుకెళ్లినా కొన్ని షాప్​లలో తీసుకోరు. పైగా తక్కువగా ధరకు వస్తువు మీకు దక్కుతున్నప్పుడు మరింత జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. 

సౌకర్యవంతమైన ఔట్​ఫిట్​..

మీరు వేసుకునే ఔట్​ఫిట్ సౌకర్యవంతంగా ఉండాలి. ఇది మీరు ఎక్కువసేపు షాపింగ్ చేయడానికి సహాయం చేస్తుంది. అసౌకర్యంగా ఉండే దుస్తులు ధరిస్తే మీరు ఎక్కువసేపు షాపింగ్ మీద దృష్టి పెట్టలేరు. అది మీ మూడ్​ని డిస్టర్బ్ చేసి షాపింగ్​ మీద నుంచి మీ దృష్టిని మరలిస్తుంది. మీరు త్వరగా వెళ్లాలనే కంగారు ఏది పడితే అది.. ఎంత పడితే అంతకు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

ఉదయాన్నే వెళ్లకండి..

షాప్స్ ఓపెన్ చేసిన వెంటనే వెళ్తే మీకు డిస్కౌంట్ చాలా తక్కువగా ఉంటుంది. ఉదయాన్నే దుకాణదారులు ధరలు తగ్గించేందుకు అస్సలు ఇష్టపడరు. కాబట్టి మీరు మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో వెళ్తే ఎక్కువ షాపింగ్​ను తక్కువ ధరలో చేసే వీలుంటుంది. 

వాటి జోలికి వెళ్లొద్దు

కొన్నిసార్లు అవసరం లేకపోయినా కొన్ని వస్తువులు కొనేసి వాటిని వేటికి ఉపయోగించలేక తీరిగ్గా బాధపడుతూ ఉంటారు. మీరు అలాంటి వ్యక్తి అయితే అవసరం లేని వాటి జోలికి వెళ్లకుండా కంట్రోల్​లో ఉండండి. ఇది మీరు ఏమి కొనాలనుకున్నారో.. మీకు ఏది అవసరమో వాటినే కొనుక్కుని రిటర్న్ అయిపోండి. 

ఈ సింపుల్ టిప్స్​ను షాపింగ్​కి వెళ్లినప్పుడు మీరు ఫాలో అయిపోండి. ఇది మీ డబ్బులను, సమయాన్ని ఆదా చేసి.. మంచి వస్తువును కొనగోలు చేయడంలో బాగా హెల్ప్ చేస్తాయి. 

Also Read : సంక్రాంతికి ఈ డ్రెస్​లు సెలక్ట్ చేసుకుంటే పండుగంతా మీ దగ్గరే ఉంటుంది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandra Babu : పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
Tiger Attack News: కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
Maoists News: మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
New Year 2025: ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma test Retirement | బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వైఫల్యంతో రోహిత్ మనస్తాపం | ABP DesamGautam Gambhir Coaching Controversy | గంభీర్ కోచింగ్ పై బీసీసీఐ అసంతృప్తి | ABP DesamSS Rajamouli Mahesh babu Film Launch | మహేశ్ సినిమాకు పూజ..పనులు మొదలుపెట్టిన జక్కన్న | ABP Desamతప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandra Babu : పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
Tiger Attack News: కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
Maoists News: మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
New Year 2025: ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
Sports Calender 2025 Update: చాంపియన్స్ ట్రోఫీ నుంచి ప్రపంచకప్ వరకు.. ఈ ఏడాది జరిగే ప్రముఖ స్పోర్ట్స్ ఈవెంట్ల వివరాలు
చాంపియన్స్ ట్రోఫీ నుంచి ప్రపంచకప్ వరకు.. ఈ ఏడాది జరిగే ప్రముఖ స్పోర్ట్స్ ఈవెంట్ల వివరాలు
New Year 2025: క్రేజీ అప్డేట్స్, కిర్రాక్ పోస్టర్స్‌... టాలీవుడ్‌లో న్యూ ఇయర్ స్పెషల్స్ ఏమిటో తెల్సా?
క్రేజీ అప్డేట్స్, కిర్రాక్ పోస్టర్స్‌... టాలీవుడ్‌లో న్యూ ఇయర్ స్పెషల్స్ ఏమిటో తెల్సా?
US Terror Attack: న్యూ ఇయర్ వేడుకల్లో ఉగ్రదాడి- జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు -  12 మంది మృతి
న్యూ ఇయర్ వేడుకల్లో ఉగ్రదాడి- జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు - 12 మంది మృతి
Perni Nani Wife Jayasudha : రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని భార్యను ప్రశ్నించిన పోలీసులు- రెండున్నర గంటలపాటు విచారణ
రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని భార్యను ప్రశ్నించిన పోలీసులు- రెండున్నర గంటలపాటు విచారణ
Embed widget