September Motivation : మహిళలూ! సెప్టెంబర్‌లో ఈ వాగ్ధానాలు మీకు మీరు చేసుకోవడం అవసరం!
Life Style: మీ పిల్లలు, మీకుటుంబాన్ని మీరు ప్రేమిస్తూ ఉంటే వారి బాగోగులు చూసుకునేందుకు తప్పకుండా మిమ్మల్ని మీతో మీరు ఈ వాగ్దానం చేసుకోవడం, ఆమాట నిలుపుకోవడం అవసరం.
Telugu News: కుటుంబంలో అందరి బాగోగులు చూసుకునే స్త్రీలు ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం. వారు ఆరోగ్యంగా, చురుకుగా ఉంటేనే ఇంట్లో అన్ని పనులు సజావుగా సాగుతాయి. అందరినీ ఆనందంగా, సౌకర్యంగా ఉంచే మౌన యోధులులుగా ఇల్లాళ్లను అభివర్ణించాలి. మరి మీరు ఇల్లాలయి ఉండి అందరి బాగోగుల్లో, ఇంటి పనుల్లో పడి మీ ఆరోగ్యాన్ని నిర్లక్షచేస్తుంటే ఈ సమాచారం మీకోసమే. మీకు మీ ఆవిడ ఆరోగ్యం పట్ల నిజంగా శ్రద్ధ ఉన్న పురుషులైతే ఈ సమాచారం మీకోసమే.
నీళ్లు తాగడాన్ని వాయిదా వెయ్యొద్దు
ఇంటి పనుల్లో పడి దాహాన్ని పట్టించుకోరు చాలా మంది. కానీ తగినన్ని నీళ్లు శరీరంలో లేకపోతే శరీరం నెమ్మదిగా పనిచేసేందుకు మొరాయించడం మొదలు పెడుతుంది. మీరు కూడా ఇలా నీళ్లు తాగడం మరచిపోయే వారయితే ఫోన్ లో నీటి కోసం ఒక అలారమ్ సెట్ చేసుకోవడం మంచిది. శరీరం డీహైడ్రేట్ అయితే తలనొప్పి రావడం, ఏకాగ్రత లేకపోవడం, బరువు పెరిగిపోవడం, కిడ్నీ సమస్యలకు కారణం కాగలదు. రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీటిని తప్పక తాగాలి. మీకు మీరు ఈరోజున ఈ వాగ్ధానం చేసుకోవాలి.
ఏడాదికోసారి పరీక్షలు
ఇంట్లో పెద్ద వారి నుంచి పిల్లల వరకు అందరి ఆరోగ్య పరిస్థితులను దగ్గరుండి చూసుకునే ఇంటి ఇల్లాలు చాలా సార్లు తనకోసం తాను చేయించుకోవాల్సిన తప్పనిసరి స్క్రీనింగ్ పరీక్షలను నిర్లక్ష్యం చేస్తుంటారు. బీపీ, కొలెస్ట్రాల్, కంటి పరీక్షలు, గ్లూకోజ్ స్థాయిల వంటివి ఆరోగ్యవంతులయినా సరే ఏడాదికి ఒకసారి తప్పక చేయించుకోవాలి. ఇప్పుడున్న ఒత్తిడితో కూడిన జీవితంలో ఇవి అసలు నిర్లక్ష్యం చెయ్యకూడని పరీక్షలు కనుక ఏడాదికోసారి ఇవి తప్పక చేయించుకుంటామని ఒక ప్రామీస్ చేసుకోవాలి.
మానసికంగా, శారీరకంగా చురుగా ఉండాలి
శరీరం చురుకుగా కదలాలంటే తప్పకుండా మానసికంగా చురుకుగా ఉండడం తప్పనిసరి అని గుర్తించాలి. అందుకు అవసరమైన జాగ్రత్తలు తప్పక పాటించాలి. రోజుకు30-40 నిమిషాల వ్యాయామం శరీరాన్ని దృఢంగా ఉంచుతుంది. నచ్చిన ఒక హాబీని తప్పకుండా కొనసాగించడం వల్ల తప్పకుండా మానసికంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. మీకోసం మీరు రోజుకు ఒక గంట నుంచి రెండు గంటల సమయం తీసుకుంటానని ఈరోజే వాగ్ధానం చేసుకోవడం అవసరం.
గైనిక్ ఆరోగ్యం
స్త్రీ శరీరం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. అందుకు కారణం ఆమె ప్రత్యుత్పత్తి వ్యవస్థ. గైనిక్ ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు పరీక్షించి చూసుకోవడం, చిన్న మార్పులను సైతం గుర్తించడం చాలా అవసరం. పాప్ స్మీయర్, బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ వంటివి తప్పక చేయించుకుంటూ ఉండాలి. ఆలస్యంగా గర్భవతులైన వారు మరింత జాగ్రత్తగా ఉండడం అవసరం. కనుక ప్రత్యుత్పత్తి అవయవాల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. మారిన జీవన శైలీ, ఆలస్యంగా అవుతున్న వివాహాల వంటివన్నీ కూడా గైనిక్ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. కనుక మరింత ప్రత్యేక శ్రద్ధ అవసరం.
ఈ ప్రామీసులు మీకు మీరు చేసుకుని వాటిని నిలబెట్టుకుంటే మీ ఆరోగ్యానికి, మీకుటుంబ శ్రేయస్సుకు చాలా మేలు జరుగుతంది. మీ ఆరోగ్యవంతమైన సుదీర్ఘ జీవితానికి దోహదం చేస్తుంది.
Also Read: ఎక్కువ కాలం బతకాలంటే వీకెండ్‌లో హాయిగా బజ్జోండి - గుండె జబ్బులు కూడా రావట!