అన్వేషించండి

Weekend Sleep: ఎక్కువ కాలం బతకాలంటే వీకెండ్‌లో హాయిగా బజ్జోండి - గుండె జబ్బులు కూడా రావట!

వీకెండ్ లో చక్కగా నిద్రపోవడం వల్ల గుండె జబ్బుల ముప్పు గణనీయంగా తగ్గినట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. బరువు అదుపులో ఉండటంతో పాటు దీర్ఘాయుష్ణును అందిస్తున్నాట్లు తేలింది.

Sleep In Weekend Help’s Live Longer:  బిజీ లైఫ్ లో జనాలు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. సరైన తిండి, నిద్రలేకుండా గడుపుతున్నారు. ఫలితంగా విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనై రకరకాల వ్యాధులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో బీజింగ్ పరిశోధకులు కీలక విషయాన్ని వెల్లడించారు. వీకెండ్ లో చక్కగా నిద్రపోవడం వల్ల గుండె జబ్బుల ముప్పు తగ్గడంతో పాటు ఆయుష్షు పెరుగుతుందని తెలిపారు. నాణ్యమైన నిద్ర ఫిట్ నెస్ ను పెంచడంతో పాటు బరువును అదుపు చేస్తున్నట్లు వివరించారు.  

వీకెండ్ లో చక్కటి నిద్రతో దీర్ఘాయుష్షు

సెప్టెంబరు 1న యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ కాంగ్రెస్ 2024లో సమర్పించబోయే కొత్త పరిశోధన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. వీకెండ్ లో నిద్రపోయే వ్యక్తులతో పోల్చితే, నిద్ర సరిగా పోని వ్యక్తులతో 20 శాతం గుండె జబ్బులు ముప్పు అధికంగా ఉన్నట్లు తేలింది. బీజింగ్‌లోని నేషనల్ సెంటర్ ఫర్ కార్డియోవాస్కులర్ డిసీజ్ శాస్త్రవేత్తల బృందం.. సుమారు 90 వేల మందికి పైగా యుకె వాసుల నుంచి సుమారు 14 ఏండ్ల పాటు తీసుకున్న డేటా ప్రకారం ఈ వివరాలు వెల్లడించింది.  “నిద్ర విషయంలో మేం చేసిన పరిశోధనలో కీలక విషయాలు తెలిశాయి. నిద్రలేమితో బాధపడుతున్న వారితో పోల్చితే, వీకెండ్ లో చక్కగా నిద్రపోయే వారిలో గుండె జబ్బుల ముప్పు గణనీయంగా తగ్గినట్లు తేలింది” అని  అధ్యయనంలో పాల్గొన్న జెయెన్ లియు వెల్లడించారు. చక్కటి నిద్ర గుండెకు మేలు చేయడంతో పాటు ఆయు ప్రమాణం పెరుగుతున్నట్లు వెల్లడించిందన్నారు. నాణ్యమైన నిద్ర చక్కటి ఫిట్ నెస్ అందిస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు. 

వీకెండ్ లో ఎందుకు నిద్రపోవాలంటే?

సరిగా నిద్రపోకపోవడం వల్ల రోగనిరోధక శక్తి బలహీనం కావడంతో పాటు అకాల మరణం సంభవించే అవకాశం ఉంటుంది. తాజా అధ్యయనంలో సుమారు 22 శాతం మంది వ్యక్తులు 7 గంటల కంటే నిద్రపోవడం వల్ల చనిపోయినట్లు తేలింది. 6 గంటల కంటే తక్కువ నిద్రపోయే వాళ్లు త్వరగా చనిపోతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. చక్కగా నిద్రపోని వారిలో మానసిక వైకల్యం ఏర్పడుతున్నట్లు తేలింది. తగినంత నిద్రపోవడం వల్ల ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది.  

తగిన మోతాదులో నిద్రపోకపోతే.. ఇలా చేయండి!

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే చక్కటి నిద్ర అవసరం. అయితే, రోజూ 7 నుంచి 9 గంటలు నిద్రపోకపోవడం కుదరకపోతే కచ్చితంగా రోజూ ఒకే సమయంలో నిద్రపోయేలా చూసుకోవాలంటున్నారు పరిశోధకులు. అంటే ప్రతి రోజు ఫలానా సమయం నుంచి ఫలానా సమయం వరకు నిద్రపోయేలా షెడ్యూల్ చేసుకోవాలి. వీకెండ్ లో ఎక్కువ గంటలు నిద్రపోయేలా ప్రయత్నించాలి. ఫలితంగా ఆయు ప్రమాణాన్ని పెంచుకునే అవకాశం ఉన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది.

Read Also: గంట నిద్ర తక్కువైతే నాలుగు రోజులు ఎఫెక్ట్ ఉంటుందట.. మీరెన్ని గంటలు పడుకుంటున్నారు?

Read Also: ఏ వయసు వారు ఎన్ని గంటలు నిద్రపోవాలో తెలుసా? నిద్ర అవసరాన్ని తేల్చి చెప్పిన తాజా అధ్యయనం

టాప్ హెడ్ లైన్స్

Diwali Cleaning Tips : దీపావళి హోమ్ క్లీనింగ్ చెక్ లిస్ట్.. ఈజీగా, ఎఫెక్టివ్​గా శుభ్రం చేయాలనుకుంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి
దీపావళి హోమ్ క్లీనింగ్ చెక్ లిస్ట్.. ఈజీగా, ఎఫెక్టివ్​గా శుభ్రం చేయాలనుకుంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి
Henna or Hair Colour : తెల్ల జుట్టును కవర్ చేయడానికి హెన్నా బెటరా? లేదా కలర్ వేసుకోవాలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలివే  
తెల్ల జుట్టును కవర్ చేయడానికి హెన్నా బెటరా? లేదా కలర్ వేసుకోవాలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలివే  
Virat Kohli Birthday : 38 ఏళ్ల విరాట్ కోహ్లీ ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం ఏంటి? డైట్, వర్కౌట్ రహస్యాలు ఇవే
38 ఏళ్ల విరాట్ కోహ్లీ ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం ఏంటి? డైట్, వర్కౌట్ రహస్యాలు ఇవే
Hiccups : ఎక్కిళ్లు రావడానికి కారణాలు ఏంటి? వాటిని తగ్గించుకునేందుకు ఏమి ఫాలో అవ్వాలో తెలుసా?
ఎక్కిళ్లు రావడానికి కారణాలు ఏంటి? వాటిని తగ్గించుకునేందుకు ఏమి ఫాలో అవ్వాలో తెలుసా?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Friday OTT Streamings : శుక్రవారం ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్ - దుల్కర్ 'ఐయామ్ గేమ్' To తమన్నా 'ది వాన్'... ఇవి డోంట్ మిస్
శుక్రవారం ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్ - దుల్కర్ 'ఐయామ్ గేమ్' To తమన్నా 'ది వాన్'... ఇవి డోంట్ మిస్
Tips To Soft Hair : జుట్టు పొడిగా, నిర్జీవంగా కనిపిస్తోందా? మృదువుగా, మెరిసేలా చేసే ఇంటి చిట్కాలు ఇవే
జుట్టు పొడిగా, నిర్జీవంగా కనిపిస్తోందా? మృదువుగా, మెరిసేలా చేసే ఇంటి చిట్కాలు ఇవే
AP MPTC ZPTC Elections: ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ - 65% పైగా ఓటింగ్ అంచనా - పలుచోట్ల ఘర్షణలు!
ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ - 65% పైగా ఓటింగ్ అంచనా - పలుచోట్ల ఘర్షణలు!
Ramayana Mistakes: మూడు తప్పులు... రామాయణాన్ని మార్చేశారా? సినిమాలో ఏముంది?
మూడు తప్పులు... రామాయణాన్ని మార్చేశారా? సినిమాలో ఏముంది?
Stock Market Rally: మార్కెట్లలో సునామీ ర్యాలీ - 2000 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. అసలైన కారణాలివే!
మార్కెట్లలో సునామీ ర్యాలీ - 2000 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. అసలైన కారణాలివే!
Dark Underarms : అండర్ ఆర్మ్స్ నల్లగా మారాయా? చంకల్లో నలుపుదనాన్ని తగ్గించుకోవడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి
అండర్ ఆర్మ్స్ నల్లగా మారాయా? చంకల్లో నలుపుదనాన్ని తగ్గించుకోవడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి
IND VS SL Vizag ODI :  ఢిల్లీ నుంచి వైజాగ్‌కు మారిన వన్డే మ్యాచ్.. భారత్ - లంక తొలి వన్డే వేదికపై బీసీసీఐ సంచలన నిర్ణయం, కార‌ణమిదే..!!
ఢిల్లీ నుంచి వైజాగ్‌కు మారిన వన్డే మ్యాచ్.. భారత్ - లంక తొలి వన్డే వేదికపై బీసీసీఐ సంచలన నిర్ణయం, కార‌ణమిదే..!!
Raptadu Student Gopika Health Update: మృత్యుంజయురాలు గోపిక - బెంగళూరు ఆస్పత్రిలో వేగంగా కోలుకుంటున్న చిన్నారి.. లోకేశ్ తాజా అప్‌డేట్!
మృత్యుంజయురాలు గోపిక - బెంగళూరు ఆస్పత్రిలో వేగంగా కోలుకుంటున్న చిన్నారి.. లోకేశ్ తాజా అప్‌డేట్!
Embed widget