Sleep Guidelines by Age : ఏ వయసు వారు ఎన్ని గంటలు నిద్రపోవాలో తెలుసా? నిద్ర అవసరాన్ని తేల్చి చెప్పిన తాజా అధ్యయనం
Sleep duration by age : వయసుకు తగ్గట్లు మనజీవన శైలి ఉండాలి అంటారు. అలాగే వయసుకు తగ్గట్లు పడుకోవాలని చెప్తోంది తాజా అధ్యయనం. లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవు అంటుంది.
Sleep needs by age group : వయసుకు తగ్గట్లు బిహేవ్ చేయని పెద్దలు చెప్తారు. కానీ వయసుకు తగ్గట్లు నిద్ర ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. లేదంటే ఆరోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. శారీరకంగా, మానసికంగా హెల్తీగా ఉండాలంటే.. తగినంత నిద్రపోవాలని చెప్తున్నారు. చాలామందిలో నిద్ర సమస్యలున్నాయని.. వివిధ కారణాలతో నిద్రకు దూరమవుతున్నారని.. దానిని కంట్రోల్ చేస్తే సరైన నిద్ర, ఆరోగ్యం మీ సొంతమవుతుందంటున్నారు. ఈ నేపథ్యంలోనే నిద్రపై ఓ అధ్యయనం చేశారు.
పెద్దలు రాత్రి నిద్ర 7 నుంచి 9 గంటలు ఉండాలని తాజా అధ్యయనం తెలిపింది. వయసు ఆధారంగా ఎంత సమయం పడుకోవాలో వివరించింది. లేదంటే నిద్ర నాణ్యత తగ్గిపోతుందని.. గర్భిణీలు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్తున్నారు. సరైన నిద్ర లేకుంటే త్వరగా ముసలివారైపోతారని తాజా అధ్యయనంలో తేలిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరి ఇంతకీ అధ్యయనం ప్రకారం ఏ వయసువారు ఎంతసేపు నిద్రపోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పిల్లలు ఎన్ని గంటలు నిద్రపోతే మంచిది?
నవజాత శిశువులు అంటే 0-3 నెలలు ఉన్నవారు 14 నుంచి 17 గంటలు పడుకోవాలట. శిశువులు అంటే 4 నుంచి 12 నెలలు ఉన్నవారికి 12 నుంచి 16 గంటల నిద్ర ఉండాలట. 1 నుంచి 2 సంవత్సరాలు ఉన్నవారికి 11 నుంచి 14 గంటల నిద్ర మంచిది. 3 నుంచి 5 సంవత్సరాల మధ్యవారికి 10 నుంచి 13 గంటల నిద్ర ఉండాలి. ఇది వారి ఎదుగుదలకు మంచి చేస్తుంది. 6 నుంచి 12 సంవత్సరాల వారికి 9 నుంచి 12 గంటల నిద్ర ఉండాలని శాస్త్రవేత్తలు సిఫార్సు చేస్తున్నారు.
పెద్దలకు నిద్ర ఎంత ఉండాలంటే
టీనేజర్స్ 13 నుంచి 17 సంవత్సరాల మధ్య ఉన్నవారికి 8 నుంచి 10 గంటల నిద్ర కచ్చితంగా ఉండాలి. 18 నుంచి 60 సంవత్సరాల వారికి.. కనీసం 7 గంటల నిద్ర ఉండాలి. తక్కువ కాకుండా ఉంటే ఇంకా మంచిది. 60 దాటిన వారికి 7 నుంచి 9 గంటల నిద్ర ఉండాలని ఫ్లిండర్స్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తెలిపారు. వయసును బట్టి నిద్ర అవసరాలు ఉంటాయని.. వాటిని అందరూ ఫాలో అవ్వాలని తెలిపారు.
సరైన నిద్ర లేకుంటే.. ఆరోగ్య సమస్యలు ఎక్కువైతాయి.
దాదాపు సగం పైగా ఆరోగ్య సమస్యలు నిద్ర ద్వారానే తగ్గుతాయని ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చాయి. షుగర్, బీపీ, గుండె వంటే దీర్ఘకాలిక సమస్యలను కూడా నిద్ర కంట్రోల్లో ఉంచుతుంది. అంతేకాకుండా ప్రెగ్నెన్సీ సమయంలో జరిగే హార్మోన్ల మార్పులను నిద్ర సమానం చేస్తుంది. శారీరక అసౌకర్యాన్ని తగ్గించడంలో నిద్ర హెల్ప్ చేస్తుంది. వృద్ధాప్య సంకేతాలను దూరం చేస్తుంది. అంతేకాకుండా వయసైపోయినా ఆరోగ్యంగా ఉంచడంలో మెరుగైన నిద్ర ముఖ్యపాత్ర పోషిస్తుంది. తాజా అధ్యయన సిఫార్సులతో మీ నిద్రను ప్లాన్ చేసుకోవాలంటున్నారు నిపుణులు.
Also Read : బీపీ ఉన్నవారు ఈ ఫుడ్స్ తీసుకుంటే చాలా మంచిది.. ఆ ఫుడ్స్ జోలికి మాత్రం అస్సలు పోకూడదు