Dementia: ఈ బ్లడ్ గ్రూపు వారికి మతిమరుపు వచ్చే అవకాశం చాలా ఎక్కువ... నిర్ధారించిన అధ్యయనం
చిత్తవైకల్యం దీనినే డిమెన్షియా అని కూడా అంటారు. మతిమరుపు కూడా ఈ వ్యాధి కోవలేక వస్తుంది.
మతి భ్రమించడం, చిత్త వైకల్యం, మతిమరుపు... ఇలాంటి మానసిక సమస్యలు తీవ్రంగా ఉన్న వారు తమ పనులు కూడా తాము సరిగా చేసుకోలేరు. పక్కన ఒకరి సాయం తప్పదు. దీన్నే ఆంగ్లంలో డిమెన్షియా అంటారు. అల్జీమర్స్ కూడా డిమెన్షియా వ్యాధి కిందకే వస్తుంది. ఈ వ్యాధి వయసు మీరుతున్న కొద్దీ దాడి చేస్తుంది. అయితే అందరిలో ఇది రావాలని లేదు. కొందరికీ మాత్రమే అరవై ఏళ్లు దాటాకా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఓ తాజా అధ్యయనం ఒక బ్లడ్ గ్రూపు వారికి డిమెన్షియా వచ్చే అవకాశం ఎక్కువని తేల్చింది.
తినే ఆహారం, వారసత్వంగా వచ్చే జన్యువులు డిమెన్షియా, అల్జీమర్స్ వంటి వ్యాధులు రావడానికి కారణాలుగా మొన్నటి వరకు భావించారు. అయితే ఇప్పుడు మాత్రం బ్లడ్ గ్రూపు కూడా ఈ రోగాలు వచ్చే అవకాశాన్ని రెట్టింపు చేయగలదని ఓ శాస్త్రీయ పరిశోధన వెల్లడించింది. న్యూరాలజీ జర్నల్ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం AB బ్లడ్ గ్రూప్ వారికి ఈ మానసిక రోగాలు వచ్చే అవాకాశాలు 82 శాతం ఎక్కువ. దీనికి కారణాలను కూడా అధ్యయనం వెల్లడించింది.
1. శరీరంలో అధిక కొలెస్ట్రాల్
2. డయాబెటిస్
3. హైబీపీ
AB బ్లడ్ గ్రూప్ డిమెన్షియాను ఎలా పెంచుతుంది?
ఒక బ్లడ్ గ్రూప్ వల్ల అల్జీమర్స్, డిమెన్షియా వంటి రోగాలు వస్తాయా? అనే సందేహం రావచ్చు. కానీ కొన్ని స్వాభావిక ప్రోటీన్లు ఉన్నాయి. అవే ఇలాంటి రోగాలకు కారణం అవుతాయి. వీటివల్లే AB రకం ఉన్న వ్యక్తులు చిత్తవైకల్యం ప్రమాదానికి కారణమయ్యే అవకాశాలు ఎక్కువ.
కేవలం డిమెన్షియా, అల్జీమర్స్ మాత్రమ కాదు AB బ్లడ్ గ్రూపు ఉన్నవారికి పాంక్రియాటిక్ క్యాన్సర్, పొట్ట క్యాన్సర్, కోవిడ్ 19 వంటివి తీవ్రంగా కలిగే అవకాశం ఉంది.
Note: ఇది ABP Desam ఒరిజనల్ కంటెంట్. copy కొడితే చర్యలు తీసుకుంటాం.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Read also: 2022లో ‘సెక్స్ కాఫీ’దే హవా? మూడ్‌ను రొమాంటిక్‌గా మార్చే ఈ కాఫీ కథేంటీ?
Read also: పొట్ట దగ్గరి కొవ్వు తగ్గాలా? రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని తినండి
Read also: ఈ ఏడాది మనదేశంలో ఎక్కువ మంది వెతికిన టాప్ 10 రెసిపీలు ఇవే
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి