Viral food: పానీపూరీ ఐస్‌క్రీమ్ రోల్ విత్ చట్నీ... వెగటు పుట్టిస్తున్న కాంబినేషన్, వైరలవుతున్న వీడియో
కొన్ని కాంబినేషన్ ఫుడ్ చూస్తుంటే వెగటు పుడుతుంది. అలా వింతగా ఉన్నవే వైరల్‌గా మారతాయి.
![Viral food: పానీపూరీ ఐస్‌క్రీమ్ రోల్ విత్ చట్నీ... వెగటు పుట్టిస్తున్న కాంబినేషన్, వైరలవుతున్న వీడియో Panipuri Ice Cream Roll with Chutney ... Hot Combination, Viral Video Viral food: పానీపూరీ ఐస్‌క్రీమ్ రోల్ విత్ చట్నీ... వెగటు పుట్టిస్తున్న కాంబినేషన్, వైరలవుతున్న వీడియో](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/31/28b644557309ad75f119de6253d3c276_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మ్యాగీ మిల్క్ షేక్, ఒరియో బిస్కెట్‌తో పకోడీ, గుడ్డుతో పాప్ కార్న్... ఇలా ఎన్నో వెరైటీ వంటలు గతేడాది అరాచకం సృష్టించాయి. కొత్త ఏడాది వచ్చాక ఇంకా ఈ అరాచకాలు మొదలవ్వలేదేంటా అనుకుంటున్నారా? ఇదిగో అప్పుడే ఈ వెగటు పుట్టించే వంటకం వైరల్ అయిపోతోంది. పానీపూరీ అభిమానులు ఈ వంటకాన్ని చూసి ఎలా ఫీలవుతారో మరి.
అసలే దేశవ్యాప్తంగా పానీపూరీకి వీరాభిమానులున్నారు. రోజుకోసారైనా దాన్ని తినకపోతే ఏదో వెలితిలా ఫీలయిపోతుంటారు. ఇక ఐస్ క్రీమ్ కూడా అందరి హాట్ ఫేవరేట్. వేసవి వస్తే వాటి అమ్మకాలు మామూలుగా ఉండవు. ఈ రెండూ కలిపి ఓ కొత్త వంటకాన్ని సృష్టిస్తే ఎలా ఉంటుంది? అదే జరిగిందిప్పుడు. పానీపూరీని గరిటెతో పచ్చడిలా చేసి ఐస్ క్రీమ్ వేసి దాన్ని రోల్స్‌లా చేసి అమ్ముతున్నారు. ఇంకా అరాచకమైన విషయం ఏంటంటే ఈ రోల్స్ పై చట్నీ వేసి సర్వ్ చేస్తున్నారు. ఈ వెరైటీ వంటకం ఎవరు, ఎక్కడ సిద్ధం చేశారో తెలియదు కానీ ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అవుతోంది. ‘ద గ్రేట్ ఇండియన్ ఫుడీ’ అనే బ్లాగర్ ఈ వీడియోను పోస్టు చేశాడు. ఆ అరాచకాన్ని మీరు చూసి ఆనందించండి.
View this post on Instagram
Also read: పొట్లకాయ, గుడ్డు కలిపి వండితే విషపూరితం అవుతుందా? ఇందులో నిజమెంత?
Also read: బాహుబలిని మించేలా ఐరన్ మ్యాన్ థాలి... తింటే రూ.8.50 లక్షలు మీ సొంతం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)