News
News
X

Egg and Snake Gourd: పొట్లకాయ, గుడ్డు కలిపి వండితే విషపూరితం అవుతుందా? ఇందులో నిజమెంత?

పొట్లకాయ, గుడ్డు కలిపి వండే వారి సంఖ్య చాలా తక్కువ. ఆ రెండూ కలిపి వండితే ప్రమాదమా?

FOLLOW US: 

తినే పదార్థాల విషయంలో ప్రజల్లో చాలా అపోహలు, భయాలు ఉన్నాయి. అందులో ఒకటి పొట్లకాయ, గుడ్డు కలిపి వండకూడదు అని. ఆ రెండూ కలిపి వండితే విషపూరితం అవుతుందని, తినకూడదనే భయాలు ఉన్నాయి. అందుకే చాలా మంది ఆ రెండింటి కాంబినేషన్ కూర తినరు. అంతేకాదు గుడ్డు తిన్న రోజు, పొట్లకాయ తినరు కొంతమంది. ఇందులో నిజమెంత? ఆ రెండు కలిపి తింటే నిజంగానే విషపూరితం అవుతుందా? 

రెండూ మంచివే...
ముందుగా ఈ రెండింటి గురించి విడివిడిగా తెలుసుకుందాం. పొట్లాకాయ పీచు పదార్థం. దీనిలో అధికంగా నీరు ఉంటుంది. విటిమిన్లు  పుష్కలంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల విషపూరిత రసాయనాలు, పదార్థాలను బయటకు పంపి, అవయవాల పనితీరు మెరుగుపడేందుకు ఇది సహాయపడుతుంది. అంతేకాదు పొట్లకాయ తినడం వల్ల మలబద్ధకం వంటి సమస్యలు కూడా రావు. కాలేయానికి పొట్లకాయ కూర చాలా మంచిది. మధుమేహం ఉన్నవారికి పొట్లకాయ మేలు చేస్తుంది. 
 
ఇక గుడ్డు సంగతికొస్తే సంపూర్ణ ఆహారంగా దీన్నే పిలుస్తారు. ఎక్కువ పోషకాలతో తక్కువ ధరకు లభించే ఆహారం ఇది. మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె జబ్బుల రిస్క్‌ను తగ్గిస్తుంది. దీనిలో మనకు అవసరమయ్యే మంచి కొలెస్ట్రాల్ పుష్కలంగా ఉంటుంది. ఒక గుడ్డులో  100 మిల్లీ గ్రాముల కొలైన్ ఉంటుంది. ఇది ఒక అరుదైన పోషకం. మెదడు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కంటిచూపుకు గుడ్డు తినడం చాలా అవసరం. గుడ్డులో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లయిన లూటిన్, జియాక్సాంతిన్ కూడా ఉంటాయి. ఇవన్నీ మన శరీరాన్ని కాపాడుతూ ఉంటాయి. 

ఈ రెండూ కలిపి తింటే విషమా?
పొట్లకాయ, గుడ్డు కలిపి వండితే విషపూరితం అవుతుందని అంటారు, కానీ అలాంటిదేమీ లేదు. ఎలాంటి భయం లేకుండా ఆ కూరను వండుకుని తినొచ్చు. కాకపోతే గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు ఈ కాంబినేషన్‌కు దూరంగా ఉంటే మంచిది. రెండు కాంబినేషన్లు కలిపి వంట చేస్తున్నప్పుడు ఆ రెండూ ఒకే సమయంలో జీర్ణమయ్యేవి అయితే ఎలాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు రావు. అయితే పొట్లకాయలో నీటి శాతం అధికం ఇది త్వరగా అరిగిపోతుంది. కానీ కోడిగుడ్డులో ప్రోటీన్స్, కొవ్వుఆమ్లాలు అధికంగా ఉంటాయి. అందుకే ఇది అరగడానికి కాస్త సమయం పడుతుంది. ఈ రెండు కలిపి వండినప్పు జీర్ణమయ్యే సమయంలో తేడాలొస్తాయి. అలాంటప్పుడు కొందరిలో స్వల్పకాలం పాటూ గ్యాస్ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఇది అందరిలోనూ రావాలని లేదు. ఇంతకుమించి ఈ కూరతో వచ్చే ప్రమాదం ఏమీ లేదు. 

గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.

Also read:  బాహుబలిని మించేలా ఐరన్ మ్యాన్ థాలి... తింటే రూ.8.50 లక్షలు మీ సొంతం

Published at : 31 Jan 2022 12:24 PM (IST) Tags: Bad Combination food Snakegourd Curry Snakegourd and Egg Egg combinations

సంబంధిత కథనాలు

Diabetes: డయాబెటిస్ ఉన్న వారు మద్యం తాగొచ్చా? తాగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

Diabetes: డయాబెటిస్ ఉన్న వారు మద్యం తాగొచ్చా? తాగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

ఫిట్స్ ఎందుకొస్తాయి? రోగి చేతిలో తాళం చేతులు ఎందుకు పెట్టకూడదు? మూర్ఛ వచ్చిన వెంటనే ఏం చేయాలి?

ఫిట్స్ ఎందుకొస్తాయి? రోగి చేతిలో తాళం చేతులు ఎందుకు పెట్టకూడదు? మూర్ఛ వచ్చిన వెంటనే ఏం చేయాలి?

Vitamin K2: విటమిన్ K2 - ఇది లోపిస్తే ఆరోగ్యానికి చేటు, ఈ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోండి

Vitamin K2: విటమిన్ K2 - ఇది లోపిస్తే ఆరోగ్యానికి చేటు, ఈ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోండి

Food: ఈ టేస్టీ ఫుడ్ వద్దు డూడ్, పొట్ట పెంచేస్తాయ్, పరేషాన్ చేసేస్తాయ్!

Food: ఈ టేస్టీ ఫుడ్ వద్దు డూడ్, పొట్ట పెంచేస్తాయ్, పరేషాన్ చేసేస్తాయ్!

Drinking Water: భోజనం మధ్యలో నీరు తాగితే బరువు పెరుగుతారా? ఈ అలవాటు వల్ల ఎన్ని నష్టాలో చూడండి

Drinking Water: భోజనం మధ్యలో నీరు తాగితే బరువు పెరుగుతారా? ఈ అలవాటు వల్ల ఎన్ని నష్టాలో చూడండి

టాప్ స్టోరీస్

Global Healthcare Summit: గ్లోబల్ హెల్త్ స‌మ్మిట్‌‌లో పాల్గొనండి - ఏపీ సీఎం జ‌గ‌న్‌ను ఆహ్వానించిన ఎన్నారై డాక్టర్లు

Global Healthcare Summit: గ్లోబల్ హెల్త్ స‌మ్మిట్‌‌లో పాల్గొనండి - ఏపీ సీఎం జ‌గ‌న్‌ను ఆహ్వానించిన ఎన్నారై డాక్టర్లు

Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు

Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు

ఇప్పుడు కుమారి ఒంటరే - బాయ్‌ఫ్రెండ్‌తో ఆ సినిమా విడుదలకు ముందు...

ఇప్పుడు కుమారి ఒంటరే - బాయ్‌ఫ్రెండ్‌తో ఆ సినిమా విడుదలకు ముందు...

Rain Updates: అల్పపీడనం ఎఫెక్ట్ - తెలంగాణలో మరో 3 గంటల్లో భారీ వర్షాలు, ఏపీలో అక్కడ పిడుగులు పడే ఛాన్స్: IMD

Rain Updates: అల్పపీడనం ఎఫెక్ట్ - తెలంగాణలో మరో 3 గంటల్లో భారీ వర్షాలు, ఏపీలో అక్కడ పిడుగులు పడే ఛాన్స్: IMD