News
News
X

Palak Paneer: పాలక్ పనీర్ కాంబో చాలా ఫేమస్, కానీ ఆ కాంబినేషన్ తినకపోవడమే మంచిది

పాలకూర - పనీర్ కలిపి వండడం చాలా ప్రమాదకరం అని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.

FOLLOW US: 
Share:

ఉత్తరాదిలో పాలక్ పనీర్ కర్రీ చాలా ఫేమస్. రోటీకి జతగా దీన్ని ఇష్టంగా తింటారు. ఆ అలవాటు దక్షిణాది రాష్ట్రాలకు కూడా చేరింది. ఏ రెస్టారెంట్‌కి వెళ్లినా మెనూలో పాలక్ పనీర్  కచ్చితంగా ఉంటుంది. విడివిడిగా చూస్తూ పాలకూర, పనీర్ రెండూ ఆరోగ్యకరమైనవే. కానీ ఆ రెండూ కలిపి తింటే మాత్రం ఆరోగ్యానికి హాని కలుగుతుంది అని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఈ రెండింటినీ కలిసి తినప్పుడు అందులోని పోషకాలను శరీరం శోషించుకోకుండా ఆ రెండూ అడ్డుకుంటాయని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. 

ఎందుకు వద్దు?
ఆహారంలోని పోషకాలు శరీరం సరిగ్గా శోషించుకుంటేనే అవి ఆరోగ్యాన్ని అందిస్తాయి. అయితే కొన్ని రకాల పోషకాలు ఒకేసారి తినకూడదు. అవి ఒకదాని శోషణను మరొకటి అడ్డుకుంటాయి. అలాంటి రెండు ఇనుము, కాల్షియం. కాల్షియం నిండి ఆహారం తినప్పుడు, ఇనుముతో నిండిన ఆహారాన్ని కలిపి తినకూడదు. ఇలా తినడం వల్ల ఇనుమును శరీరం శోషించుకోకుండా కాల్షియం అడ్డుకుంటుంది. పాలకూరలో ఇనుము అధికంగా ఉంటుంది. ఇక పనీర్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఈ రెండూ కలిపి తినడం వల్ల శరీరం ఏ పోషకాన్ని శోషించుకోలేదు. 

పాలకూర తింటే
పాలకూరలో ఇనుము ఎక్కువని చెప్పుకున్నాం కదా, ఈ ఇనుము ఊపిరితిత్తులకు నుంచి ఇతర అవయవాలకు ఆక్సిజన్‌ను రవాణా చేయడానికి అవసరమైన హిమోగ్లోబిన్‌ను తయారు చేయడానికి శరీరానికి సహాయపడుతుంది. ఇనుము లోపిస్తే తీవ్రమైన అలసటతో పాటూ ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.పాలకూరలో క్యాలరీలు, పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. విటమిన్లు అధికంగా ఉంటాయి. పొటాషియం కూడా అధికంగా ఉంటుంది కాబట్టి రక్తపోటును తగ్గిస్తుంది. అలాగే దీన్ని తినడం వల్ల కంటి సంబంధ వ్యాధులు కూడా తగ్గుతాయి. కంటి శుక్లాలు, మచ్చల క్షీణత వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఎముకలను ఆరోగ్యంగా ఉంచే విటమిన్ కె అధింగా ఉంటుంది. పాలకూర తినడం వల్ల చర్మం ఆరోగ్యవంతంగా మారుతుంది. ఇందులో విటమిన్ ఎ ఆరోగ్యకరమైన కణజాలాన్ని అందిస్తుంది.  రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అలాగే హిమోగ్లోబిన్ తయారు చేయడంలో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. 

పనీర్ వల్ల...
పాల ఉత్పత్తి అయిన పనీర్‌లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇందులో విటమిన్ డి కూడా ఉంటుంది. పనీర్ తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ దూరమవుతుంది. అలాగే గుండె జబ్బులు తగ్గుతాయి. మధుమేహులకు ఇది ఎంతో మేలు చేస్తుంది. రక్తంలోని షుగర్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. 

Also read: కాల్చిన సీతాఫలాలను ఎప్పుడైనా తిన్నారా? రుచికి రుచి, ఎన్నో పోషకాలు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 04 Dec 2022 08:52 AM (IST) Tags: Paneer Benefits Palak paneer combo Dont eat Palak Paneer Palak benefits

సంబంధిత కథనాలు

Blood Circulation: శరీరంలో రక్త సరఫరా సరిగా జరగకపోతే కనిపించే లక్షణాలు ఇవే - జాగ్రత్త

Blood Circulation: శరీరంలో రక్త సరఫరా సరిగా జరగకపోతే కనిపించే లక్షణాలు ఇవే - జాగ్రత్త

Heart Attack: రక్తనాళాల్లో కొవ్వు చేరకూడదనుకుంటే సజ్జలను మెనూలో చేర్చుకోండి

Heart Attack: రక్తనాళాల్లో కొవ్వు చేరకూడదనుకుంటే సజ్జలను మెనూలో చేర్చుకోండి

ఈ ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే ఛాతీలోని కఫం, దగ్గు త్వరగా తగ్గిపోతాయి

ఈ ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే ఛాతీలోని కఫం, దగ్గు త్వరగా తగ్గిపోతాయి

పెద్ద పెద్ద వైద్యులు చేయలేని చికిత్స స్నేహం చేస్తుందట - ఆ వ్యాధికి ఇదే మందు!

పెద్ద పెద్ద వైద్యులు చేయలేని చికిత్స స్నేహం చేస్తుందట - ఆ వ్యాధికి ఇదే మందు!

Weight Loss Tips: ఈజీగా బరువు తగ్గాలా? జస్ట్ ఈ 5 సూత్రాలు పాటిస్తే చాలు

Weight Loss Tips: ఈజీగా బరువు తగ్గాలా? జస్ట్ ఈ 5 సూత్రాలు పాటిస్తే చాలు

టాప్ స్టోరీస్

Khammam News: అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి - ఫ్రెండ్స్‌పై అనుమానం!

Khammam News: అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి - ఫ్రెండ్స్‌పై అనుమానం!

YSRCP Politics : జగనన్నకు చెప్పుకుంటే రాత మరిపోతుందా ? కొత్త ప్రోగ్రాంపై వైఎస్ఆర్‌సీపీ ఆశలు నెరవేరుతాయా ?

YSRCP Politics : జగనన్నకు చెప్పుకుంటే రాత మరిపోతుందా ? కొత్త ప్రోగ్రాంపై వైఎస్ఆర్‌సీపీ ఆశలు నెరవేరుతాయా ?

Balakrishna - Shiva Rajkumar : బాలకృష్ణతో సినిమా చేయాలని ఉంది - 'వేద' ప్రీ రిలీజ్‌లో శివ రాజ్ కుమార్

Balakrishna - Shiva Rajkumar : బాలకృష్ణతో సినిమా చేయాలని ఉంది - 'వేద' ప్రీ రిలీజ్‌లో శివ రాజ్ కుమార్

Writer Padmabhushan: మహిళలకు ‘రైటర్ పద్మభూషణ్’ బంపర్ ఆఫర్ - ఈ ఒక్కరోజే ఛాన్స్!

Writer Padmabhushan: మహిళలకు ‘రైటర్ పద్మభూషణ్’ బంపర్ ఆఫర్ - ఈ ఒక్కరోజే ఛాన్స్!