By: Haritha | Updated at : 03 Dec 2022 06:02 PM (IST)
(Image credit: Youtube)
చలికాలం వచ్చిందంటే చాలు సీతాఫలాలను కుప్పలుగా పోసి రోడ్డు మీద అమ్ముతారు. సీజనల్‌గా పండే పండ్లను కచ్చితంగా తినాలని చెబుతారు. బాగా పండిన సీతాఫలాలు తియ్యగా మళ్లీ మళ్లీ తినాలనిపించేలా ఉంటాయి. అయితే చాలా గిరిజన ప్రాంతాల్లో ఈ సీతాఫలాలను కాల్చుకుని తింటారు. ఇలా తినడం మెట్రో నగరాల్లో ఉన్నవారికి వింతగా ఉండొచ్చు కానీ పూర్వకాలం నుంచి గ్రామాల్లో ఇలా సీతాఫలాలను కాల్చుకుని తినే అలవాటు ఉంది. ఇలా కాల్చుకుని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
డయాబెటిస్ వారికి...
మధుమేహంతో బాధపడేవారికి కాల్చిన సీతాఫలాలు చాలా మేలు చేస్తాయి. పై భాగం కాలిపోయినప్పటికీ లోపల మాత్రం తెల్లటి పదార్థం చక్కగా ఉంటుంది. అది మరింత తీయగా అవుతుంది. సీతాఫలం నేరుగా కాకుండా ఇలా కాల్చుకుని తిని తింటే డయాబెటిక్ రోగులకు చాలా మంచిది. ఇలా తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చలికాలంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అలాంటప్పుడు ఇలా సీతాఫలాన్ని కాల్చుకుని తినడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. దీనిలో మన శరీరానికి అవసరం అయ్యే పోషకాలు ఎన్నో ఉన్నాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో చేరే ఫ్రీరాడికల్స్‌తో పోరాడతాయి.
యాంటీ క్యాన్సర్ లక్షణాలు సీతాఫలంలో ఉంటాయి. ఈ పండును కాల్చడం వల్ల లోపల ఉండే గుజ్జులో ఈ లక్షణాలు మరింత మెరుగవుతాయి. మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారు ఇలా కాల్చిన సీతాఫలం తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. సుఖ విరేచనం అవుతుంది. ఒళ్లు నొప్పులు తగ్గుతాయి. కంటి చూపును మెరుగుపరచడంలో ఇది ముందుంటుంది. బరువు పెరగాలని కోరుకునే వారు ఈ కాల్చిన సీతాఫలంలోప తేనె కలుపుకుని తింటే ఫలితం ఉంటుంది. సీతాఫలాన్ని ఎలా కాల్చిలి అనే సందేహం వస్తుందా? గ్యాస్ స్టవ్ మీద కాల్చడం కాదు, బొగ్గులు తెచ్చి వాటిపై కాల్చడం లేదా, చిన్న కట్టెల కుప్ప వేసి మంట పెట్టి అందులో సీతఫలాలు వేసి కాల్చాలి.
Also read: శీతాకాలంలో పిల్లలకు చెవి ఇన్ఫెక్షన్లు - నొప్పి అని చెబితే నిర్లక్ష్యం వద్దు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Weight Loss: కండల కోసం ప్రొటీన్ షేక్‌లకు బదులు ఈ పానీయం తాగండి
Kitchen Tips: పిండి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా నిల్వ చేయండి
Milk Coffee: మిల్క్ కాఫీ మంచిదే, కానీ ఈ సమస్యలున్న వాళ్ళు మాత్రం తాగకూడదండోయ్
Cholesterol: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే మీ గోళ్ళు చెప్పేస్తాయ్
World Cancer Day 2023: క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే మూడు రకాల ఆహార పదార్థాలు ఇవే, తినడం మానేస్తే మీకే మంచిది
BRS Nanded Meeting : నాందేడ్‌లో బీఆర్ఎస్ బహిరంగసభకు ఏర్పాట్లు పూర్తి - భారీగా మహారాష్ట్ర నేతల చేరికలు !
Rushikonda Green Carpet : పచ్చగా మారిపోయిన రుషికొండ - ఈ మ్యాజిక్ ఎలా జరిగిందో తెలుసా ?
Hyderabad News : కేసీఆర్ మనవడు రితేశ్ రావు మిస్సింగ్, అర్ధరాత్రి పోలీసులే తీసుకెళ్లారని రమ్య రావు ఆరోపణ!
IND vs AUS: వీళ్లని లైట్ తీసుకుంటే టీమిండియాకు కష్టమే - ఆరుగురు డేంజరస్ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్!