News
News
X

Pakistan Pilot: షిఫ్ట్ దిగిపోయా.. విమానం నడపను.. మధ్యదారిలో షాకిచ్చిన పైలట్, చివరికి..

షిఫ్ట్ పూర్తికాగానే డ్యూటీ దిగిపోవడం సాధారణమే. కానీ, విమానం నడిపే పైలటే అలా చేస్తే? ప్రయాణికుల పరిస్థితి ఏమిటీ?

FOLLOW US: 
 
షిఫ్ట్ పూర్తయిన తర్వాత పనిచేయడం చాలామందికి ఇష్టం ఉండదు. డ్యూటీ పూర్తికాగానే ఇంటికి వెళ్లి రిలాక్స్ కావాలని అనుకుంటారు. చాలా కొద్ది మంది మాత్రమే షిఫ్టులను పట్టించుకోకుండా పని చేసుకుంటూ పోతారు. కానీ, విమానం, రైలు, బస్సు వంటి రవాణా వ్యవస్థల్లో పనిచేసేవారికి ఈ షిఫ్టులు వర్తిస్తాయా? ఒక వేళ వారు నడిపే వాహనాలు వాతావరణం అనుకూలించకో.. సాంకేతిక కారణాలు, ట్రాఫిక్ సమస్యల వల్ల సమయానికి గమ్యానికి చేరుకోకపోతే ఏం చేస్తారు? ప్రయాణికులను మధ్యలో వదిలి వెళ్లిపోలేరు కదా. అలాంటి సమయంలో షిఫ్ట్ గురించి ఆలోచించకుండా పనిచేయాల్సి వస్తుంది. అయితే, పాకిస్థాన్‌లోని ఓ పైలట్ మాత్రం అలా చేయలేదు. తన షిఫ్ట్ అయిపోయిందని, ఇక నడపనంటూ మొండికేశాడు. మధ్యదారిలో ప్రయాణికులను ముప్పుతిప్పలు పెట్టాడు. 

అసలు ఏం జరిగింది?: పాకిస్థాన్‌కు చెందిన PK-9754 విమానం సౌదీ అరేబియాలోని రియాద్ నుంచి ఇస్లామాబాద్‌కు బయల్దేరింది. అయితే, వాతావరణం బాగోలేకపోవడం వల్ల విమానాన్ని అత్యవసరంగా సౌదీ అరేబియాలోని దమ్మమ్‌లో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. కొన్ని గంటల తర్వాత వాతావరణం అనుకూలించడంతో విమానాన్ని ఇస్లామాబాద్‌కు తీసుకెళ్లడానికి అనుమతి లభించింది. అయితే, పైలట్ విమానాన్ని నడిపేందుకు నిరాకరించాడు. తన షిఫ్ట్ అయిపోయిందని, విమానం నడపడం కుదరదని చెప్పేశాడు. దీంతో ప్రయాణికులు షాకయ్యారు. ఇప్పుడు తాము ఇస్లామాబాద్‌కు ఎలా వెళ్లాలని ప్రశ్నించారు. విమానం దిగేందుకు నిరాకరించారు. 

ఈ సమాచారం అందుకున్న పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA) అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. పైలట్‌ను సంప్రదించారు. విమానాశ్రయంలోని PIA అధికారులు వెంటనే ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్ సమీపంలోని హోటళ్లలో వసతి కల్పించారు. జర్నీ సేఫ్‌గా సాగాలంటే పైలట్‌కు విశ్రాంతి అవసరమని, ప్రయాణికులు సహకరించాలని కోరారు. విశ్రాంతి తర్వాత పైలట్ విమానాన్ని నడిపేందుకు అగీకరించాడు. ఎట్టకేలకు అదే రోజు సాయంత్రం రాత్రి 11 గంటలకు విమానం ఇస్లామాబాద్‌కు చేరుకుంది. PIA తమ విమాన సేవలను సౌదీ అరేబియాకు విస్తరించిన రెండో రోజే ఈ ఘటన చోటుచేసుకోవడం విశేషం.  

ఇవి కూడా చదవండి: 

ఓర్నీ.. చేప వీర్యంతో స్పెషల్ కర్రీ.. అంత కరువేంది బ్రో!
ఈ దేశంలో గుడ్లను మూత్రంలో ఉడికించి తింటారు.. ఇందుకో కారణం ఉంది!
సరసాలతో సంపాదన.. అమ్మాయిలతో ‘పులిహోర’ కలపడమే ఇతడి ఉద్యోగం
కోవిడ్ వ్యాక్సిన్‌ - బూస్టర్ డోస్‌‌కు తేడా ఏమిటీ? ఎవరు అర్హులు? ఏది బెస్ట్? 

వ్యాక్సిన్ వద్దంటూ.. చెట్టెక్కి కూర్చున్నాడు, వీడియో వైరల్
‘మాస్క్’ తీసేదేలే.. ‘పుష్ప’ పోస్టర్‌తో కేంద్రం వినూతన ప్రచారం 

Published at : 20 Jan 2022 04:33 PM (IST) Tags: పాకిస్థాన్ Pakistan Pilot Pakistan Pilot Shift PIA Pakistan Flight shift

సంబంధిత కథనాలు

ప్రపంచంలో అత్యంత ఖరీదైన మసాలా ఏది ? 10గ్రాములు కొనాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు !

ప్రపంచంలో అత్యంత ఖరీదైన మసాలా ఏది ? 10గ్రాములు కొనాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు !

Hair transplant Side Effect: జుట్టు కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు, సర్జరీ చేయించుకునే ముందు కాస్త జాగ్రత్త

Hair transplant Side Effect: జుట్టు కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు, సర్జరీ చేయించుకునే ముందు కాస్త జాగ్రత్త

అంత జీతమిచ్చి ఏ పనీ చెప్పడం లేదు, బాగా బోర్ కొడుతోంది - కంపెనీపై ఓ ఉద్యోగి పిటిషన్

అంత జీతమిచ్చి ఏ పనీ చెప్పడం లేదు, బాగా బోర్ కొడుతోంది - కంపెనీపై ఓ ఉద్యోగి పిటిషన్

Pakoda Curry: ఉల్లిపాయ పకోడి కర్రీ రెసిపీ - కొత్తగా ఇలా ట్రై చేయండి

Pakoda Curry: ఉల్లిపాయ పకోడి కర్రీ రెసిపీ - కొత్తగా ఇలా ట్రై చేయండి

ఆ పానీయాలతో క్యాన్సర్ వచ్చే అవకాశం - ఎందుకొస్తుందో వివరించిన అధ్యయనం

ఆ పానీయాలతో క్యాన్సర్ వచ్చే అవకాశం - ఎందుకొస్తుందో వివరించిన అధ్యయనం

టాప్ స్టోరీస్

Bandi Sanjay Padayatra: బైంసా మనదే, పచ్చ జెండాకు ఎగిరే అవకాశమే ఇవ్వం: నిర్మల్ లో బండి సంజయ్

Bandi Sanjay Padayatra: బైంసా మనదే, పచ్చ జెండాకు ఎగిరే అవకాశమే ఇవ్వం: నిర్మల్ లో బండి సంజయ్

మూడు రాజధానులకు మద్దతుగా రాయలసీమ గర్జన - కర్నూలులో భారీ ర్యాలీ

మూడు రాజధానులకు మద్దతుగా రాయలసీమ గర్జన - కర్నూలులో భారీ ర్యాలీ

పాతికేళ్ల కిందటే రాజమండ్రి నుంచి సికింద్రాబాద్ కు వందే భారత్ ఎక్స్ ప్రెస్ !

పాతికేళ్ల కిందటే రాజమండ్రి నుంచి సికింద్రాబాద్ కు వందే భారత్ ఎక్స్ ప్రెస్ !

YS Sharmila: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ గూండాల నుంచి ప్రాణహాని ఉందంటూ షర్మిల సంచలన ఆరోపణలు

YS Sharmila: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ గూండాల నుంచి ప్రాణహాని ఉందంటూ షర్మిల సంచలన ఆరోపణలు