Booster Dose: కోవిడ్ వ్యాక్సిన్ - బూస్టర్ డోస్‌కు తేడా ఏమిటీ? ఎవరు అర్హులు? ఏది బెస్ట్?
కోవిడ్-19 బూస్టర్ డోస్.. సాధారణ వ్యాక్సిన్లకు తేడా ఏమిటీ? బూస్టర్ డోస్ తీసుకోడానికి మీరు అర్హులేనా? ఇది ఎలా పనిచేస్తుంది?
కోవిడ్-19 (Covid-19) మరోసారి తన ఉనికి చాటుతున్న సంగతి తెలిసిందే. అయితే, దేశంలో చాలామంది ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ రెండు డోసులను తీసుకోవడం వల్ల వైరస్ సోకినా.. త్వరగా కోలుకుంటున్నారు. అయితే, కొందరు వ్యాక్సిన్లు తీసుకుని దాదాపు కొన్ని నెలలు గడుస్తున్నాయి. అలాంటివారు తప్పకుండా మూడో డోసు తీసుకుని.. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బూస్టర్ డోస్‌లను అందుబాటులోకి తెచ్చింది. మరి, ఇప్పటివరకు మీరు తీసుకున్న కోవిడ్ వ్యాక్సిన్ డోసులకు, బూస్టర్ డోస్‌కు తేడా ఏమిటీ? ఎవరు అర్హులు? రెండిట్లో ఏది బాగా పనిచేస్తుంది?
బూస్టర్ షాట్‌లు, మూడవ కోవిడ్ డోస్‌లు ఒకేలా ఉండవు. సాధారణ కోవిడ్ వ్యాక్సిన్‌లను మనం ఒకటి లేదా రెండు నెలల వ్యవధిలో తీసుకోవచ్చు. అయితే, బూస్టర్ షాట్స్ తీసుకోడానికి మాత్రం కనీసం 6 నుంచి 9 నెలలు గ్యాప్ ఉండాలి. అంటే.. మీరు రెండో డోసు వేయించుకుని ఆరు నెలలు గడిస్తేనే బూస్టర్ డోస్ తీసుకోవాలి. ప్రభుత్వం నిబంధన ప్రకారం.. కోవిడ్-19 రెండో డోసు తీసుకుని 9 నెలలు పూర్తి కావాలి. అప్పుడే మీరు అధికారికంగా బూస్టర్ డోస్‌ను తీసుకోడానికి అర్హులు. థర్డ్ డోస్ తీసుకోడానికి కనీసం నెలా, రెండు నెలలు గడిస్తే చాలు.
తేడా ఏమిటీ?: బూస్టర్ డోస్ కూడా వ్యాక్సినే. రెండూ శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచడానికే పనిచేస్తాయి. కానీ, మోతాదు, సామర్థ్యంలో మాత్రం తేడా ఉంటుంది. వ్యాక్సిన్ అంటే రోగాలను అడ్డుకొనేందుకు తీసుకొనే ముందస్తు ఔషదం. కానీ, ఇప్పుడు మీరు తీసుకుంటున్న వ్యాక్సిన్.. కేవలం రోగ నిరోధక శక్తిని మాత్రమే బలోపేతం చేస్తుంది. ఇది ఒక్కొక్కరిలో ఒక్కోలా పనిచేస్తుంది. వ్యాక్సిన్ తీసుకున్నా.. వైరస్ రాదనే గ్యారంటీ లేదు. ఇది బూస్టర్ డోస్‌కు కూడా వర్తిస్తుంది. అయితే, బూస్టర్ డోస్.. రెండు సాధారణ వ్యాక్సిన్లతో సమానం. వైరస్‌తో ఎక్కువ ముప్పు ఉన్నవారికి బూస్టర్ డోసులు వేస్తున్నారు. ముఖ్యంగా వైద్యులు, ఫ్రంట్‌లైన్ వర్కర్స్, 65 ఏళ్లు పైబడినవారికి ఇది అవసరం. వయస్సు పెరిగే కొద్ది శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అలాంటివారికి బూస్టర్ డోస్ అవసరం అవుతోంది. అంటే.. అతి తక్కువ రోగ నిరోధక శక్తి కలిగిన వ్యక్తులకు బూస్టర్ డోస్ ఇవ్వడం మంచిది. ఆరోగ్యంగా ఉండి, రోగ నిరోధక శక్తి సమస్యలు లేనివారు సాధారణ కోవిడ్ వ్యాక్సిన్ డోసు తీసుకుంటే సరిపోతుంది. అయితే, ఇప్పుడు బూస్టర్ డోసు తీసుకొనేవారు థర్డ్ డోసు తీసుకోవలసిన అవసరం ఉండదు. పైగా ప్రభుత్వం.. 3వ డోసుకు బదులు అందరికీ బూస్టర్ డోసును అందించే అవకాశాలున్నాయి.
Also Read: కరోనా కాదు, క్లాత్ మాస్కే విలన్.. సర్జికల్, N95 మాస్కులను ఇలా వాడినా ముప్పే!
మూడవ కోవిడ్ డోస్ వ్యాక్సిన్, బూస్టర్ డోస్ వల్ల ఏర్పడే సైడ్ ఎఫెక్ట్స్‌లో కూడా తేడాలు ఉంటాయి. ప్రస్తుతానికి బూస్టర్ డోస్ వైరస్‌ను ఎదుర్కోడానికి బాగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. త్వరలో అందుబాటులోకి రానున్న థర్డ్ డోసు ఎంత బాగా పనిచేస్తుందనేది ఇంకా తెలియాల్సి ఉంది. సాధారణ వ్యాక్సిన్ తీసుకున్న దాదాపు ఆరు నెలల తర్వాత టీకా వల్ల శరీరంలో ఉత్పత్తయ్యే యాంటీబాడీలు క్రమేనా క్షీణిస్తాయి. బూస్టర్ డోస్‌తో అవి మళ్లీ పుంజుకుంటాయి. మూడో డోసు తీసుకోవాలంటే.. రెండో డోసు తీసుకుని కనీసం 21 నుంచి 28 రోజులు లేదా 2 నెలలు గడిస్తే చాలు. మీరు గతేడాది జనవరి నుంచి మార్చి నెలల్లో రెండో డోసు తీసుకున్నట్లయితే బూస్టర్ డోస్‌కు అర్హులు. ఈ వ్యాక్సిన్లు వైరస్‌ను శరీరంలోకి చేరకుండా అడ్డుకోలేవు. మాస్కులు, సానిటైజర్లను వాడటం ద్వారా వైరస్ శరీరంలోకి చేరకుండా మీరే అడ్డుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. వ్యాక్సి్న్లు కూడా వైరస్‌ను పూర్తిగా అడ్డుకోలేకపోవచ్చు. కానీ, ఆసుపత్రిలో చేరే ప్రమాద స్థాయిలను తగ్గిస్తాయి. వైరస్ మీ శరీరాన్ని కబ్జా చేయకుండా అడ్డు గోడలా పనిచేస్తాయి. కాబట్టి.. సాధారణ వ్యాక్సిన్లు, బూస్టర్ డోస్‌లు రెండూ బేస్టే. తప్పకుండా మీరు వ్యాక్సిన్ తీసుకోండి.
గమనిక: కోవిడ్-19 వైరస్, వ్యాక్సిన్లపై అవగాహన కోసం వివిధ అధ్యయనాలు, కథనాలు, వైద్య నిపుణులు తెలిపిన వివరాలను ఇక్కడ యథావిధిగా అందించామని గమనించగలరు.
Also Read: ఓర్నీ.. చేప వీర్యంతో స్పెషల్ కర్రీ.. అంత కరువేంది బ్రో!
Also Read: నరక ద్వారం.. 50 ఏళ్లుగా ఇక్కడి భూమి మండుతూనే ఉంది.. చిన్న తప్పు ఎంత పనిచేసింది!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి