Gateway To Hell: నరక ద్వారం.. 50 ఏళ్లుగా ఇక్కడి భూమి మండుతూనే ఉంది.. చిన్న తప్పు ఎంత పనిచేసింది!
నరకానికి దారిగా చిలిచే.. ఈ Gateway To Hell గత 50 ఏళ్లుగా మండుతూనే ఉంది. భవిష్యత్తులో ఇది కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే..
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 50 ఏళ్ల నుంచి ఇక్కడ ఏర్పడిన బిలం మండుతూనే ఉంది. అప్పట్లో చేసిన చిన్న తప్పిదం వల్ల ఏళ్ల తరబడి అక్కడి వాతావరణ పరిస్థితులు ప్రమాదకరంగా మారుతూ వస్తున్నాయి. ఆ మంటల వల్ల పర్యవరణానికి మాత్రమే కాదు.. స్థానిక ప్రజలు కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరి, ఆ మంటకు కారణం ఏమిటీ? అది ఎందుకు ఏర్పడిందో తెలియాలంటే.. 1971లో ఏం జరిగిందో తెలుసుకోవాలి.
తుర్క్మెనిస్తాన్(Turkmenistan) ఓ భారీ అగ్నిబిలం ఉంది. దీన్ని అంతా నరక ద్వారం(Gateway To Hell) అంటారు. అయితే, అగ్నిపర్వతాలకు, ఈ బిలానికి చాలా వ్యత్యాసం ఉంది. అగ్నిపర్వాతాల్లో లావా ద్రవం నిత్యం మండుతూ ఉంటుంది. అవి ఎప్పుడు పేలుతాయో చెప్పడం కష్టం. అయితే, ఈ బిలం అలాంటిది కాదు. ఇది మానవ తప్పిదం వల్ల ఏర్పడిన ఓ భయానక ఘటన.
ఈ నరక ద్వారం గురించి తెలుసుకొనే ముందు మనం 1995, జనవరి 8న తూర్పు గోదావరి జిల్లా పాశర్లపూడి గ్రామంలో చోటుచేసుకున్న ఘటన గురించి తెలుసుకోవాలి. చమురు అన్వేషణలో భాగంగా ONGC డ్రిల్లింగ్ పనులు జరుపుతుండగా గ్యాస్ లీకైంది. ఆ వెంటనే నిప్పు అంటుకుంది. సుమారు 65 రోజులపాటు అది మండుతూనే ఉంది. ఎట్టకేలకు నిపుణులు రంగంలోకి దిగి ఆ మంటలను అదుపులోకి తెచ్చారు. దాదాపు అలాంటి ఘటనే అష్గాబాత్‌కు 260 కిమీల దూరంలో చోటుచేసుకుంది.
1971లో సోవియెట్ జియోలజిస్టులు చమురు కోసం అక్కడ డ్రిల్లింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా వారు అక్కడ భారీ గ్యాస్ లీకైంది. ఆ వెంటనే అక్కడ పెద్ద రంధ్రం ఏర్పడి భారీ బిలంగా ఏర్పడింది. దాని నుంచి వెలువడుతున్న గ్యాస్ పక్క గ్రామాలకు వ్యాపిస్తుందనే భయంతో జియోలజిస్టులు.. గ్యాస్‌ను మండించారు. కొద్ది రోజుల తర్వాత ఆ గ్యాస్ మొత్తం ఆరిపోతుందని భావించారు. అయితే, 50 ఏళ్లు గడిచినా.. ఆ గ్యాస్ ఇంకా మండుతూనే ఉంది.
‘దర్వాజా క్రేటర్’ అని పిలిచే ఈ ప్రాంతం క్రమేనా పర్యాటక స్థలిగా మారింది. చాలామంది ఇక్కడికి వచ్చి ఫొటోలు దిగుతుంటారు. అయితే.. భవిష్యత్తులో మీరు ఈ నరక ద్వారాన్ని చూసే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే.. తుర్క్మెనిస్తాన్ ప్రభుత్వం ఈ బిలాన్ని మూసివేయాలనే నిర్ణయానికి వచ్చింది. నిత్యం గ్యాస్ మండటం వల్ల పర్యవరణానికి, ప్రజలకు హాని జరుగుతోందని.. ఈ బిలాన్ని మూసివేయడానికి ఉన్న మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. అయితే, 2010లోనే ఇక్కడి మంటలు ఆర్పడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ సాధ్యం కాలేదు. మరి ఈ సారైనా సక్సెస్ సాధిస్తారో లేదో చూడాలి.
Turkmenistan plans to close its 'Gateway to Hell'. || VIDEOhttps://t.co/FjBUrxAfwZ#Turkmenistan #Gatewaytohell pic.twitter.com/F3DNHsNX76
— Achat (@AchatAchat) January 9, 2022
Also Read: ఈ గ్రామంలో మహిళలు 5 రోజులు నగ్నంగా ఉంటారు.. వారిని చూసి నవ్వితే..
Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి