అన్వేషించండి

Keema Muttis: మటన్‌తో కీమా ముట్టీలు, చల్లని సాయంత్రం వేడిగా తింటే ఆ మజాయే వేరు

మటన్‌తో చేసే స్నాక్ ఐటెమ్ కీమా ముట్టీలు. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.

మటన్ కూర, వేపుడు, బిర్యానీ... ఇవేగా ఎక్కువగా మటన్ తో వండుకునే వంటలు. ఇక కీమా బిర్యానీ చాలా మంది చేసుకుంటారు. మటన్ తో టేస్టీ స్నాక్స్ కూడా చేసుకోవచ్చు. కీమా ముట్టీలు నాన్ వెజ్ ప్రియులకు చాలా నచ్చే స్నాక్స్. కరకరలాడుతూ తినే కొద్దీ ఇంకా తినాలపిస్తుంది. వీటివి చేసుకోవడం కూడా చాలా సులువు. సమయం కాస్త ఎక్కువ పడుతుంది కానీ ప్రాసెస్ మాత్రం ఈజీ. కీమా ఉడకబెట్టడానికే సమయం పడుతుంది. కీమా ఉడికిపోతే మిగతాదంతా పకోడీలు వేసినంత ఈజీగా వీటిని వేసేయచ్చు. 

కావాల్సిన పదార్థాలు
శెనగపప్పు - ఒక కప్పు
మటన్ కీమా - అరకిలో
ఉల్లిపాయ - ఒకటి
కొత్తిమీర - ఒక కట్ట
పచ్చి మిర్చి - నాలుగు 
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - డీప్ ఫ్రైకు తగినంత 

తయారీ ఇలా
1. శెనగపప్పును ముందే నానబెట్టుకోవాలి. ముందు రోజు రాత్రి నానబెట్టుకుంటే ఉదయానికి బాగా నానుతాయి. 
2. కీమాను నీళ్లు పోసి కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. కాస్త పసుపు, ఉప్పు కూడా వేసుకోవాలి. 
3. శెనగపప్పును మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆ రుబ్బులో కీమాను కూడా బాగా కలుపుకోవాలి. 
4. కొంతమంది శెనగపప్పు, కీమా కలిపి గ్రైండ్ చేసుకుంటారు. అలాగే అయితే ఆ రెండు బాగా కలుస్తాయని వారి ఉద్దేశం.మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. 
5. ఆ మిశ్రమంలో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు అన్నీ వేసి కలపాలి. 
6. ఒక పావుగంట సేపు ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. 
7. ఇప్పుడు కళాయిలో డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేసి వేడెక్క దాకా వెయిట్ చేయాలి. 
8. నూనె వేడెక్కాక కీమా మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చుట్టుకుని అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. 
9. బ్రౌన్ రంగులోకి వచ్చే వరకు వేయించి తీసి సర్వ్ చేసుకోవాలి. ఇవి పుదీనా చట్నీతో తింటే అదిరిపోతాయి. స్పైసీ కావాలనుకునేవారు మరికొన్ని పచ్చిమిర్చిలను కలుపుకోవచ్చు. 

మటన్ కూరలు తిని బోర్ కొట్టినవారు కీమా ముట్టీలను ఆస్వాదించవచ్చు. మధుమేహులు అధికంగా మటన్ ను తినకూడదు కానీ, మిగతావారంతా తినవచ్చు. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. బి విటమిన్లు, విటమిన్ ఇ, కె, అమినో యాసిడ్స్, కాల్షియం, జింక్, కాపర్, సెలీనియం, పొటాషియం, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో పుష్కలంగా లభిస్తాయి. ఎర్ర రక్తకణాలు ఏర్పడటానికి, దెబ్బతిన్న కణాలు సరిచేయడానికి మటన్లోని పోషకాలు అవసరం. ముఖ్యం గర్భిణులు కచ్చితంగా మటన్ తినాలి. దీనివల్ల పుట్టే బిడ్డలకు న్యూరస్ ట్యూబ్ వంటి సమస్యలు రావు. 

Also read: మీ గుండె కోసం వీటిలో ఒక్కటైనా రోజూ తినండి

Also read: భవిష్యత్తంతా బంగాళాదుంప పాలదే, చెబుతున్న ఫుడ్ ట్రెండ్స్ రిపోర్టు

టాప్ హెడ్ లైన్స్

Shaving Tips for Men : మగవారు షేవింగ్ చేసుకునేటప్పుడు చేయకూడని తప్పులు ఇవే.. మంట, దురద రాకుండా ఇవి ఫాలో అవ్వండి
మగవారు షేవింగ్ చేసుకునేటప్పుడు చేయకూడని తప్పులు ఇవే.. మంట, దురద రాకుండా ఇవి ఫాలో అవ్వండి
Morning Habits : ఉదయాన్నే అలసటగా ఉంటుందా? కాఫీ, టీ లేకుండా మిమ్మల్ని ఎనర్జీటిక్​గా మార్చే 5 సింపుల్ అలవాట్లు ఇవే
ఉదయాన్నే అలసటగా ఉంటుందా? కాఫీ, టీ లేకుండా మిమ్మల్ని ఎనర్జీటిక్​గా మార్చే 5 సింపుల్ అలవాట్లు ఇవే
Darker Mehndi Colour : మెహందీ డిజైన్స్ ఎర్రగా పండాలా? అయితే ఫాలో అవ్వాల్సిన సింపుల్ చిట్కాలు, చేయకూడని తప్పులు ఇవే
మెహందీ డిజైన్స్ ఎర్రగా పండాలా? అయితే ఫాలో అవ్వాల్సిన సింపుల్ చిట్కాలు, చేయకూడని తప్పులు ఇవే
Diwali Reddit Story : ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Elections 2026: ఏపీ పుర ఫలితాల్లో టీడీపీ-జనసేన ఐక్యత సూపర్ - బీజేపీకి ఓట్ ట్రాన్స్‌ఫర్‌లోనే సమస్యలు - ఎలా అధిగమిస్తారు?
ఏపీ పుర ఫలితాల్లో టీడీపీ-జనసేన ఐక్యత సూపర్ - బీజేపీకి ఓట్ ట్రాన్స్‌ఫర్‌లోనే సమస్యలు - ఎలా అధిగమిస్తారు?
Virat Kohli  Storm: అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
Ongole Mayor Result: కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
RTC Conductor Dies: ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
Diwali Reddit Story : ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
Medical College Ragging: కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
Embed widget