అన్వేషించండి

Healthy Heart: మీ గుండె కోసం వీటిలో ఒక్కటైనా రోజూ తినండి

గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. దాని కోసం ఏం తినాలో చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు.

గుండె గట్టిగా పనిచేసినంత కాలం దాన్ని పట్టించుకోం. ఏదో ఒక్కసారి గుండెలో కలుక్కుమంటే, చిన్నగా నొప్పి వస్తే కలవరపడిపోతాం. గుండె నీరసిస్తే శరీరం మొత్తం మూలన పడిపోతుంది. గుండెకు ఏదో అయ్యే వరకు వేచి ఉండకుండా ముందు నుంచే దానికి మేలు చేసే ఏదో ఒక ఆహారాన్ని తినడం ఉత్తమం. కింద చెప్పిన ఆహారాలలో ఏదో ఒకటి కచ్చితంగా మీరు తినే ఆహారంలో రోజూ ఉండేట్టు చూసుకోండి. ఓరోజు ఒకటి తింటే, మరుసటి రోజు మరొక ఆహారపదార్థాన్ని తినేలా ప్లాన్ చేసుకోండి.

పెరుగు 
గుండె జబ్బులున్న వాళ్లకి పాలకన్నా పెరుగు చాలా మేలు చేస్తుంది. అయితే ఆ పెరుగును వెన్న తీసిన పాలతో చేసినదై ఉండాలి. వెన్న తీయకపోతే కొవ్వుశాతం అధికంగా ఉండి కొలెస్ట్రాల్ పేరుకుపోయే అవకాశం ఉంది. పెరుగులో పొటాషియం, మెగ్నిషియం, క్యాల్షియం వంటివి ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. భోజనం తినేప్పుడు చివరలో పెరుగును, మజ్జిగను తినడం ముఖ్యం. 

చిక్కుళ్లు
చిక్కుడ జాతి కూరగాయలను రెండు రోజులకోసారైనా కచ్చితంగా తినాలి. వీటిలో రెండు రకాల పీచు పదార్థాలు ఉంటాయి. ఈ పీచు రక్తంలో కొలెస్ట్రాల్ పెరగకుండా అడ్డుకుంటుంది. చిక్కుళ్లు తినడం వల్ల పీచు పొట్టలో చేరి నిండిన భావన కలుగుతుంది. కాబట్టి బరువు కూడా పెరగరు. కొలెస్ట్రాల్ చేరకపోవడం, బరువు పెరగకపోవడం రెండూ గుండెకు మేలు చేసేవే. 

చేపలు 
చేపలు గుండెకు మేలు చేసే ఆహారం. రక్తపోటు తగ్గటానికి, శరీరంలో వాపు తగ్గటానికి, రక్తనాళాల్లో రక్త సరఫరా సరిగా జరగడానికి, గుండె చక్కగా కొట్టుకోవడానికి ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అవసరం. ఇవి చేపల్లో అధికంగా ఉంటాయి. గుండెకు ఆరోగ్యాన్నందించే మెగ్నిషియం, పొటాషియం ఇందులో ఉంటాయి. 

పాలకూర
గుండె కోసం పాలకూరను ప్రతి రెండు రోజులకోసారి తినడం చాలా అవసరం. రక్త పోటు తగ్గడానికి పాలకూరలోని పోషకాలు సహకరిస్తాయి.దీని వల్ల గుండె మీద ఒత్తిడి తగ్గుతుంది. పాలకూరలో పీచు అధికంగా ఉంటుంది. అలాగే ఫోలేట్ అధికంగా లభిస్తుంది. ఇవి రక్తం గడ్డలు కట్టకుండా కాపాడుతాయి. కాబట్టి గుండెకు అంతా మంచే జరుగుతుంది. 

వాల్‌నట్స్
మెదడు ఆకారంలో ఉండే వాల్ నట్స్ మెదడుకే కాదు, గుండెకు బలాన్నిస్తాయి. రోజుకు గుప్పెకు వాల్ నట్స్ తినేవారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి కనుక ఎలాంటి గుండె సంబంధిత సమస్యలు రావు. రక్తంలో కొలెస్ట్రాల్ చేరనివ్వదు, అంతే రక్తంలో ఎలాంటి అడ్డంకులు ఏర్పడవు. ఫలితంగా గుండె పోటు వంటివి కలగవు. 

Also read: భవిష్యత్తంతా బంగాళాదుంప పాలదే, చెబుతున్న ఫుడ్ ట్రెండ్స్ రిపోర్టు

Also read: వింత వ్యాధితో బాధపడుతున్న యాంకర్ సుమ, ఇది వారసత్వంగా వస్తుందట!

టాప్ హెడ్ లైన్స్

Leg Day Soreness : జిమ్‌లో లెగ్ డే తర్వాత కాళ్లు విపరీతంగా నొప్పిగా ఉన్నాయా? పెయిన్ తగ్గించుకోవడం ఎలా.. మరుసటి రోజు జిమ్‌కు వెళ్లాలా?
జిమ్‌లో లెగ్ డే తర్వాత కాళ్లు విపరీతంగా నొప్పిగా ఉన్నాయా? పెయిన్ తగ్గించుకోవడం ఎలా.. మరుసటి రోజు జిమ్‌కు వెళ్లాలా?
Soaked Chia Seeds : చియా సీడ్స్ నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే కలిగే లాభాలు ఇవే.. ఫుడ్ కంట్రోల్ నుంచి గట్ హెల్త్ వరకు 
చియా సీడ్స్ నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే కలిగే లాభాలు ఇవే.. ఫుడ్ కంట్రోల్ నుంచి గట్ హెల్త్ వరకు 
10K Step Count : రోజూ 10,000 అడుగులు నడవకపోతే ఆరోగ్యానికి మంచిది కాదా? ఎవరు ఎంత నడిస్తే మంచిది? 5 ఏళ్ల నుంచి 60 ఏళ్లు
రోజూ 10,000 అడుగులు నడవకపోతే ఆరోగ్యానికి మంచిది కాదా? ఎవరు ఎంత నడిస్తే మంచిది? 5 ఏళ్ల నుంచి 60 ఏళ్లు
Makhana Benefits : రోజూ మఖానా తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే.. డైట్‌లో ఇలా చేర్చుకోండి
రోజూ మఖానా తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే.. డైట్‌లో ఇలా చేర్చుకోండి

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sonia Gandhi Tragedy Story: బిడ్డను నదిలో పారేయాలని చెబితే గుండె బద్దలైంది.. సోనియా గాంధీ ఆత్మకథలో విషాదం
బిడ్డను నదిలో పారేయాలని చెబితే గుండె బద్దలైంది.. సోనియా గాంధీ ఆత్మకథలో విషాదం
MPP ZP Schedule: ఏపీలో ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్ల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల
ఏపీలో ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్ల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల
PRC ఆలస్యం..ఉద్యోగుల్లో అసంతృప్తి.. కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి!
PRC ఆలస్యం..ఉద్యోగుల్లో అసంతృప్తి.. కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి!
This Week OTT Web Series : ఈ వారం ఓటీటీ వెబ్ సిరీస్‌లు - తెలుగులో ఇది డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ వెబ్ సిరీస్‌లు - తెలుగులో ఇది డోంట్ మిస్
Pawan Anna Konidela Divorce : పవన్ కల్యాణ్ అన్నా కొణిదెల డివోర్స్ - ఆమె బ్యాగ్రౌండ్, ఆస్తుల విలువ ఎంతంటే?
పవన్ కల్యాణ్ అన్నా కొణిదెల డివోర్స్ - ఆమె బ్యాగ్రౌండ్, ఆస్తుల విలువ ఎంతంటే?
Mahesh Kumar Goud: భారత్ సమ్మిట్‌కు హాజరుకావాలని రాహుల్ గాంధీకి టీపీసీసీ చీఫ్ ఆహ్వానం.. ఓబీసీలకు ప్రాధాన్యంపై చర్చ
భారత్ సమ్మిట్‌కు హాజరుకావాలని రాహుల్ గాంధీకి టీపీసీసీ చీఫ్ ఆహ్వానం.. ఓబీసీలకు ప్రాధాన్యంపై చర్చ
Cashews For Health : జీడిపప్పు ఎవరు తింటే మంచిది? ఎవరు తినకపోవడమే మంచిది?
జీడిపప్పు ఎవరు తింటే మంచిది? ఎవరు తినకపోవడమే మంచిది?
Gill, Iyer Swap: వర్షార్పణమైన హామిల్టన్ వన్డే.. గిల్, రాహుల్ టెస్ట్ టీమ్‌లోకి వెళ్లడంతో నాలుగో వన్డే నుంచి శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు
వర్షార్పణమైన హామిల్టన్ వన్డే.. గిల్, రాహుల్ టెస్ట్ టీమ్‌లోకి వెళ్లడంతో నాలుగో వన్డే నుంచి శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు
Embed widget