By: Haritha | Updated at : 29 Jun 2022 07:39 PM (IST)
యాంకర్ సుమ
యాంకర్ సుమ గొంతు వినిపించని తెలుగిల్లు ఉండదేమో. టీవీ వేస్తే చాలు గలగలమంటూ ఆమె మాట్లాడుతూ ఏదో ఒక ఛానెల్‌లో కనిపిస్తుంది. ఆమెను చూస్తే చాలా ఆరోగ్యంగా, చురుగ్గా, ఉత్సాహంగా కనిపిస్తుంది. ఏ ఆరోగ్య సమస్యా ఉన్నట్టే అనిపించదు. కానీ సుమ కూడా దీర్ఘకాలంగా ఓ వింత వ్యాధితో ఇబ్బంది పడుతోంది. గత పదిహేనేళ్లుగా తెలుగు బుల్లితెరను ఏలుతున్న ఈ మాటల మహారాణి ఓసారి తనను వేధిస్తున్న వింత సమస్య గురించి పంచుకుంది. తాను ‘కీలాయిడ్ టెండెన్సీ’ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు చెప్పింది. దీని వల్ల తాను చాలా ఏళ్ల నుంచి ఇబ్బంది పడుతూ వస్తున్నానని చెప్పుకొచ్చింది.
ఏంటి ఈ సమస్య?
కీలాయిడ్స్ టెండెన్సీని వైద్య వాడుక భాషలో కీలాయిడ్స్ అనే పిలుచుకుంటారు. ఇది ఒక చర్మ వ్యాధి. చర్మానికి గాయం తగిలినప్పుడు ఆ గాయాన్ని సరిచేయడానికి ఫైబరస్ కణజాలం ఏర్పడుతుంది. అంటే మన చర్మం తనకు తానే చికిత్స చేసుకుంటుందన్న మాట. అయితే కీలాయిడ్స్ సమస్య ఉన్న వారిలో గాయం పక్క కణాలకు కూడా సోకుతూ పెరిగిపోతుంది. కీలాయిడ్స్ అని పిలిచే కణాజాలాన్ని ఏర్పరుస్తుంది. అసలు గాయం కంటే ఈ కీలాయిడ్స్ పెద్దగా అవుతాయి. ఇవి సాధారణంగా ఛాతీ, భుజాలు, చెవులు, చెంపలపై వస్తాయి. ఇవి ఆరోగ్యానికి హానికరం కావు. కానీ చాలా చికాకును కలిగిస్తాయి.
ఎలాంటి సందర్భాల్లో వస్తాయి?
కీలాయిడ్స్ అధికంగా వచ్చే సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఆ సమయాల్లో కలిగిన గాయాల వల్ల కీలాయిడ్స్ పెరుగుతాయి.
1. మొటిమల వల్ల కలిగిన మచ్చలు
2. కాలిన గాయాలు
3. అమ్మవారు మచ్చలు
4. చెవి పోగులు కుట్టించుకున్నప్పుడు
5. చిన్న చిన్న దెబ్బలు
6. సర్జికల్ గాయాలు
7. వ్యాక్సిన్ వేయించుకున్న ప్రాంతాలు
పదిశాతం మంది ప్రజల్లో పైన చెప్పిన సందర్బాల్లో కీలాయిడ్స్ కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రంగు తక్కువుండే వారిలోనే ఈ వింత వ్యాధి వస్తుంది.
వారసత్వంగా వస్తుందా?
కీలాయిడ్స్ కొందరిలో వారసత్వంగా వస్తుంది. తల్లికి ఉంటే బిడ్డకు వచ్చే అవకాశం ఎక్కువ. లేదా తాతల వల్ల వారసత్వం మనవలకు రావచ్చు. ఇవి పదేళ్ల వయసు నుంచి 30 ఏళ్ల వయసు మధ్య బయటపడతాయి. కొన్నిసార్లు కుటుంబంలో ఎవరికీ లేకపోయినా కూడా వచ్చే అవకాశం ఉంది.
చికిత్స ఉందా?
కీలాయిడ్ల పరిమాణాన్ని బట్టి దాని చికిత్స ఆధారపడి ఉంటుంది. మందులో ద్వారా వాటి సైజుని తగ్గిస్తారు. లేజర్ థెరపీ ద్వారా కూడా తొలగిస్తారు. పరిమాణం మరీ పెద్దగా మారితే సర్జికల్ పద్ధతిలో తొలగిస్తారు. తొలగించినా ఇవి పూర్తిగా పోతాయని చెప్పలేం. కొన్ని సందర్భాల్లో మళ్లీ పెరగవచ్చు.
Also read: మిగిలిపోయిన అన్నంతో ఇలా దోశెలు, టేస్టు అదిరిపోతుంది
మన దేశంలో పురాతన గ్రామం ఇది, ఇక్కడ బయట వారు ఏం తాకినా ఫైన్ కట్టాల్సిందే
మీరు తెలివైన వారైతే ఇక్కడున్న ఇద్దరి స్త్రీలలో ఆ చిన్నారి తల్లి ఎవరో కనిపెట్టండి
ఇడ్లీ మిగిలిపోయిందా? అయితే ఇలా చాట్, పకోడా చేసుకోండి
ఇక్కడ కిలో జీడిపప్పు 30 రూపాయలకే దొరుకుతుంది, ఎక్కడో కాదు మన దేశంలోనే
High Cholesterol: కాళ్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే మీకు అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్టే
రాహుల్ కంటే ముందు అనర్హత వేటు పడిన నేతలు వీరే
Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్
Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు రెండో స్వర్ణం!
ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం