Mutton Dosa: టేస్టీ మటన్ దోశ, చేయడం చాలా సింపుల్
మటన్ ప్రియులకు ఇదో కొత్త రెసిపీ. టేస్టీగా మటన్ దోశ వేసుకోవచ్చు.
మటన్ అంటే నాన్ వెజ్ ప్రియులెందరికీలో ఇష్టం. ఎప్పుడూ కూర, వేపుడు, బిర్యానీయేనా... అప్పుడప్పుడు ఇలా దోశె చేసుకుని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారో మళ్లీ మళ్లీ చేసుకుని తినాలనిపిస్తుంది.
కావాల్సిన పదార్థాలు
మటన్ కీమా - పావు కిలో
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
గుడ్లు - నాలుగు
పసుపు - ఒక స్పూను
మిరియాల పొడి - ఒక స్పూను
నూనె - సరిపడినంత
దోశె పిండి - అరకిలో
మసాలా పొడి - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
ఉల్లిపాయ - ఒకటి
తయారీ ఇలా
1. ఉల్లిపాయను సన్నగా తరగాలి.
2. కళాయిలో నూనె వేసి ఉల్లిపాయలు వేయించాలి.
3. అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి వేయించాలి.
4. ఇప్పుడు మటన్ వేసి ఉడికించాలి.
5. ఉప్పు వేసి కలపాలి.
6. మటన్ బాగా వేయించే దాకా ఉడికించాలి.
7. మసాలా పొడి కూడా వేయించాలి.
8. ఇప్పుడు గుడ్లు కొట్టి గిన్నెలో వేయాలి.
9. ఇప్పుడు పెనం వేడెక్కాక దోశె పిండితో దోశె వేయాలి.
10. ఆ దోశె పైన గిలక్కొట్టిన గుడ్లు సొనను వేయాలి.
11. పైన మటన్ కీమా వేపుడును వేసి దోశె అంతా పరచాలి.
12. దోశె కాలాక మటన్ దోశెను మధ్యకి మడతబెట్టాలి.
13. దీనికి ఎలాంటి చట్నీ అవసరం లేదు. అలాగే తినేసినా టేస్టీగా ఉంటుంది.
మటన్ ప్రయోజనాలు...
మటన్ తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పిల్లలు, మహిళలు దీన్ని తినడం చాలా అవసరం. అధికంగా రక్తహీనతతో బాధపడేది వారే కాబట్టి, వారానికి కనీసం రెండు సార్లయినా తింటే మంచిది. రక్తం కొరతను తీరుస్తుంది. బరువు తగ్గాలనుకునేవారికి కూడా మటన్ తినడం వల్ల ప్రయోజనం కలుగుతుంది. మటన్ తినడం వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. దీనివల్ల మీరు మధ్యమధ్యలో చిరుతిండి తినడం తగ్గిస్తారు. తద్వారా బరువు తగ్గొచ్చు. గుండె జబ్బుతో బాధపడేవారికి మటన్ ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మంచి కొవ్వులు అందుతాయి. అయితే అధికంగా తింటే మాత్రం శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. మటన్ తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. మెదడుకు కూడా మటన్ మేలు చేస్తుంది.
మటన్లో బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. బి1, బి2, బి3, బి9, బి12, విటమిన్ ఇ, కె లభిస్తాయి. అలాగే ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఒమెగా 6 ఫ్యాటీ ఆమ్లాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. బి12 వల్ల ఎర్ర రక్త కణాలు తయారవుతాయి. అందుకే మటన్ కచ్చితంగా తినాలి. గర్భిణులకు మటన్ తినడం చాలా ముఖ్యం. పుట్టబోయే బిడ్డలకు న్యూరో సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. ఇందులో కాల్షియం లభిస్తుంది. ఇందులో పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీ సంబంధ వ్యాధులు రాకుండా చూసుకుంటుంది.
Also read: ఆస్తమా ఉన్న వాళ్లు రాత్రి పూట పెరుగు తినవచ్చా? ఆయుర్వేదం ఏం చెబుతోంది?
Also read: మీరు ఎంత తిన్నా బరువు పెరగని ఆహారాలు ఇవన్నీ,భయపడకుండా నచ్చినంత తినండి
Also read: యుక్త వయసును వృథా చేస్తే అంధకారమే, ఇలాంటి పనులు చేస్తే త్వరగా ముసలివాళ్లయిపోతారు