![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
Mushrooms: మహిళలూ పుట్టగొడుగులు తింటున్నారా? అయితే మీకు ఇది శుభవార్తే
పుట్టగొడుగులు తినేందుకు ఎక్కువ మంది ఇష్టపడరు. కానీ వాటిని తింటే మీకే మంచిది.
![Mushrooms: మహిళలూ పుట్టగొడుగులు తింటున్నారా? అయితే మీకు ఇది శుభవార్తే Mushrooms protect women from Breast cancer Mushrooms: మహిళలూ పుట్టగొడుగులు తింటున్నారా? అయితే మీకు ఇది శుభవార్తే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/17/0a5af1844e4ab20bd72cf2c8ba309053_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
పుట్టగొడుగులు అనగానే దాన్ని సాధారణ ఆహారంగా చూడరు ఎంతో మంది. కానీ మిగతా కూరగాయలు, పండ్లు తిన్నట్టే వీటికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. నిజం చెప్పాలంటే వంకాయలు, దొండకాయలు, బెండకాయల లాంటి మీరు రోజూ తినే కూరగాయల కన్నా కూడా పుట్టగొడుగులే చాలా మేలు చేస్తాయి. కొత్తగా చేసిన పరిశోధనలో రోజూ రెండు మూడు పుట్టగొడులు తిన్నా చాలు వారిలో క్యాన్సర్ వచ్చే ముప్పు 45 శాతం వరకు తగ్గిపోతుందట. వీటిల్లో ఉండే ఎర్గోథియోనీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ కణాలు శరీరంలో పెరగకుండా అడ్డుకుంటుంది. ముఖ్యంగా మహిళలు పుట్టగొడుగులు తినడం చాలా అవసరం. వీరిలో వచ్చే రొమ్ము క్యాన్సర్ ను అడ్డుకునే శక్తి, సత్తా పుట్టగొడుగులకే ఉన్నాయి. కాబట్టి వారానికి కనీసం రెండు సార్లయినా తింటే చాలా మంచిది. ఓరోజు కూరగా, వేపుడుగా, బిర్యానీగా... ఇలా వండుకుని తినేయాలి. వీటి రుచి కూడా బావుంటుంది కాబట్టి తినడానికి ఇబ్బంది కూడా ఉండదు. పిల్లలు, మగవారికి కూడా పుట్టగొడుగులు కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి రక్ష కల్పిస్తాయి. అంతే కాదు శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలను అందిస్తాయి.
అందమైన శిలీంధ్రాలు
పుట్టగొడుగులు పండ్లు కావు, కూరగాయలు కావు. ఇవి శిలీంధ్రాల జాతికి చెందినవి. ఆ జాతిలో అందమైనవి, ఉపయోగకరమైనవి ఇవే. పోషకాహారలోపముతో బాధపడుతున్నవారికి వీటితో వండిన ఆహారాన్ని పెడితే కొన్ని రోజుల్లోనే ఆ లోపం పోతుంది. వీటిని చాలా మంది మాంసాహారంగా భావిస్తారు. తినడం మానేస్తారు. చెట్టు దుంగలపై, చెక్కలపై ఎదిగే పుట్టగొడుగులను శాకాశారులు కూడా తినవచ్చు.
గుండెకు మంచిది
వీటిలో ఫైబర్, పొటాషియం అధికంగా ఉంటాయి. పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. అందుకే అధిక రక్తపోటు కలవారు వీటిని తింటే మంచిది. రక్తపోటు అదుపులో ఉంటే గుండెకు కూడా మేలే. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలును తగ్గిస్తాయి. వీటిలో ఉండే బీటా గ్లూకాన్స్ కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతుంది.
మధుమేహులకు...
డయాబెటిస్ ఉన్న వారు ఎలాంటి సందేహం లేకుండా వీటిని తినవచ్చు. ఎందుకంటే వీటిలో హైపోగ్లైసెమిక్ లక్షణాలు తక్కువ. కాబట్టి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అమాంతం పెరగవు. పైగా పెరిగే గ్లూకోజ్ ను తగ్గిస్తుంది కూడా. కాబట్టి వారానికి కనీసం రెండుసార్లు మధుమేహం ఉన్నవారు తింటే మంచిది. పుట్టగొడుగుల్లో ఆయిస్టర్ మష్రూమ్, బటన్ మష్రూమ్ లు చాలా మంచివని చెబుతారు. వీటిలో ఇనుము కూడా అధికంగా ఉంటుంది. మహిళలు వీటిని తింటే రక్తహీనత సమస్య కూడా పోతుంది.
Also read: శరీర దుర్వాసన ఎక్కువైందా? మీరు తినే ఈ ఆహారమే కారణం
Also read: డయాబెటిస్ రీడింగులు ఎంత మోతాదు దాటితే మందులు వేసుకోవడం ప్రారంభించాలి?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)