అన్వేషించండి

Monkeypox: శృంగారంతో మంకీపాక్స్ వ్యాప్తి? వేగంగా వ్యాపిస్తున్న వైరస్, ఎక్కువ ప్రమాదం వీరికే!

యూకేతోపాటు ఐరోపా, అమెరికా తదితర దేశాలకు కలవరపెడుతున్న మరో భయానక వ్యాధి మంకీపాక్స్ ఇప్పుడు త్వరలోనే ఇతర దేశాల్లోకూ వ్యాపించే అవకాశాలు కనిపిస్తు్న్నాయి. కాబట్టి, బీ అలర్ట్!

రోనా వైరస్ ఇంకా ఉనికిలో ఉండగానే.. మరో ప్రమాదకర వ్యాధి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. చాపకింద నీరులా సరిహద్దులు దాటి మరీ ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. ఇది ఎలా వ్యాపిస్తోంది? దీన్ని అడ్డుకోవడం ఎలాగో తెలియక నిపుణులు సైతం జుట్టు పీక్కుంటున్నారు. ఈ తరుణంలో కొన్ని కీలక ఆధారాలు లభించాయి. ఇది ఎక్కువగా అసహజ లైంగిక చర్యలకు పాల్పడేవారిలో ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు తెలుసుకున్నారు. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. మంకీపాక్స్ అనేది ‘జూనోటిక్ వ్యాధి’. అంటే మనిషి నుంచి మనిషికి సులభంగా సంక్రమించే అంటువ్యాధి. ఇప్పటికే యూకేలో ఈ వ్యాధి ఉనికిలో ఉంది. ఇప్పటివరకు ఈ వ్యాధికి గురైన బాధితుల వివరాలను పరిశీలించగా ఓ షాకింగ్ విషయం తెలిసింది. యూకేలో తొమ్మిది కేసులు ఇప్పటివరకు నిర్ధారించారు. వారిలో ఆరుగురు స్వలింగ సంపర్కులుగా గుర్తించింది. మరో ఇద్దరు స్త్రీ, పురుషులతో సంపర్కంలో పాల్గొనే ద్విలింగ సంపర్కులని తెలిసింది. దీంతో యూకేలో.. గే బార్‌లు, పబ్‌లు, స్ట్రీమ్ బాత్ కేంద్రాలను వైద్య అధికారులు పరిశీలిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఆయా కేంద్రాల్లో తిరిగిన వ్యక్తుల జాబితాను తీసుకుని పరిశీలిస్తున్నారు.  

‘మంకీపాక్స్’ అనేది మధ్య, పశ్చిమ ఆఫ్రికాలోని అటవీ ప్రాంతాలలో సాధారణంగా సంభవించే సాధారణ మానవ అంటువ్యాధి. దీన్ని వైద్య పరిభాషలో ‘సిల్వాటిక్ జూనోసిస్’ అని అంటారు. ఇది కూడా కరోనా తరహాలోనే శ్వాస ద్వారా, ఉమ్మి బిందువుల ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. చర్మంపై ఏమైనా గాయాలున్నా, కలుషిత ఆహారాన్ని తిన్న.. ముట్టుకున్నా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. మంకీపాక్స్ పొదిగే కాలం సాధారణంగా 6 నుంచి 13 రోజుల వరకు ఉంటుంది. కానీ, ప్రస్తుత బాధితుల్లో 5 నుంచి 21 రోజుల వరకు ఉంటుంది.

మంకీపాక్స్ వైరస్ రెండు రకాలు: ఒకటి వెస్ట్ ఆఫ్రికన్ క్లాడ్, రెండోది కాంగో బేసిన్ (సెంట్రల్ ఆఫ్రికన్) క్లాడ్. వెస్ట్ ఆఫ్రికన్ క్లాడ్‌లో కేసు-మరణాల నిష్పత్తి దాదాపు 1 శాతం ఉంది. కానీ, కాంగో బేసిన్ క్లాడ్‌లో మాత్రం మరణాలు 10 శాతం వరకు ఉండవచ్చనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యాధి యూకేతోపాటు ఐరోపా దేశాల్లో కూడా వ్యాపించింది. యూకేలోని కొన్ని లైంగిక ఆరోగ్య కేంద్రాల్లో నలుగురు వ్యక్తుల శరీరంపై పెద్ద పెద్ద దద్దుర్లను గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. వారికి మంకీపాక్స్ ఉన్నట్లు నిర్ధరించారు. వారిలో వెస్ట్ ఆఫ్రికన్ క్లాడ్‌ లక్షణాలు ఉన్నట్లు తెలిపారు. 

ప్రస్తుతమైతే ఈ వ్యాధి లైంగికంగా, అసహజ సెక్సులో పాల్గొనేవారిలోనే ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు భావిస్తున్నారు. ఐరోపా దేశాల్లో కూడా స్వలింగ సంపర్కులు ఎక్కువగా కాబట్టి.. అక్కడ కూడా మంకీపాక్స్ వ్యాప్తి తీవ్రం కావచ్చని, వెంటనే ప్రజలను అప్రమత్తం చేయాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ అయ్యాయి. స్పెయిన్‌లో ఏడుగురు స్వలింగ సంపర్కులు, ద్విలింగ సంపర్కుల్లో మంకీపాక్స్‌ను గుర్తించారు. పోర్చుగల్‌లో కూడా ఎక్కుమంది యువకులు మంకీపాక్స్‌తో బాధపడుతున్నట్లు తెలిసింది. చిత్రం ఏమిటంటే.. వీరిలో ఎవరికీ ఒకరితో ఒకరికి పరిచయం లేదు. దీంతో మంకీపాక్స్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో మంకీపాక్స్ చాలా విస్తృతంగా వ్యాపించవచ్చనే భయాలు నెలకొన్నాయి. 

Also Read: అమ్మవారులా కనిపించే మంకీపాక్స్, ప్రధాన లక్షణాలు ఇవే!

ప్రస్తుతం మంకీపాక్స్ ఉత్తర అమెరికాలో సైతం ఉనికిలో ఉంది. బ్రిటన్, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, యుఎస్, స్వీడన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, ఆస్ట్రేలియాలో మంకీపాక్స్ వ్యాపిస్తోంది. బాధితుల్లో ఎవరూ ఆఫ్రికా వెళ్లలేదు. కానీ, వారికి ఎలా ఈ వ్యాధి వ్యాపించిందనేది మిస్టరీగా మారింది. అయితే, ఇప్పుడు ఆయా దేశాల్లో వ్యాపిస్తున్న మంకీపాక్స్ వైరస్.. గతంలో వైరాలజిస్టులు కనుగొన్న రకం కాదని, ఇది కొత్తరకం వైరస్ కావచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహా బోర్డు సభ్యుడు, వైరాలజిస్ట్ ఓయేవాలే టోమోరీ ఓ వార్త సంస్థకు తెలిపారు.

Also read: ఐస్‌క్రీము తలనొప్పి గురించి తెలుసా? ఎంతో మందికి ఉన్న సమస్యా ఇది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
AP and Telangana Weather Update: ఏపీని షేక్ చేస్తున్న అల్పపీడనం- తెలంగాణను వణికిస్తున్న శీతల గాలులు- తాజా వెదర్ అప్‌డేట్ ఇదే
ఏపీని షేక్ చేస్తున్న అల్పపీడనం- తెలంగాణను వణికిస్తున్న శీతల గాలులు- తాజా వెదర్ అప్‌డేట్ ఇదే
Fact Check: రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
Kota Coaching Centres: దివాలా తీసిన
దివాలా తీసిన "కోట ఐఐటీ కోచింగ్" ఫ్యాక్టరీ - కామధేనువును చేజేతులా చంపేసుకున్నారు !
Viral news: జీతం 13 వేలు కానీ గర్ల్ ప్రెండ్‌కు 4 బెడ్ రూం ఇల్లు, బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్‌గా ఇచ్చాడు - ఫస్ట్ లక్కీ భాస్కర్ , తర్వాత జైలు భాస్కర్ !
జీతం 13 వేలు కానీ గర్ల్ ప్రెండ్‌కు 4 బెడ్ రూం ఇల్లు, బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్‌గా ఇచ్చాడు - ఫస్ట్ లక్కీ భాస్కర్ , తర్వాత జైలు భాస్కర్ !
Embed widget