(Source: Poll of Polls)
Gen Z Money Saving Tips : ఖర్చులు, సేవింగ్స్ విషయంలో Gen Zల రూటే సపరేటు.. మిలియనిల్స్ కూడా ఫాలో అవ్వాల్సిందే..
Money Saving Tips : అసలు లైఫ్ అంటే Gen Z వాళ్లది అనుకోని మిలియనిల్స్ ఉండరేమో. వాళ్లు ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారనేది పక్కన పెడితే.. వాళ్లు సేవింగ్స్ విషయం గురించి తెలిస్తే నిజంగా షాక్ అవ్వాలి.
New Study on Gen Z Savings : అటు టెక్నాలజీని.. ఇటు తమ టాలెంట్ని నిరూపించుకోవడంలో ఏ మాత్రం ఇబ్బంది పడకుండా.. ఇతరులు ఏమనుకుంటారోనని ఆలోచించుకుంటూ ఉండిపోకుండా.. ముందుకు వెళ్లి తమ ప్రతిభను చూపిస్తున్న జెనరేషన్ ఏదైనా ఉందా అంటే అది కచ్చితంగా Gen Zనే. అంతకు ముందు ఉన్న మిలియనిల్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎదుటివారు ఏమనుకుంటారో.. ఇలా చెప్తే నన్ను వాళ్లు అపార్థం చేసుకుంటారోననే ఆలోచనలతోనే వారి సగం జీవితం పూర్తి అయిపోయింది. కానీ ఇప్పుడొస్తున్న Gen Z కిడ్స్ అలా కాదు.
లైఫ్ని చిల్ అవుతూనే..
తమ టాలెంట్ను నిరూపించుకోవడానికి ఏది అడ్డుకాదనే స్వభావం వారిది. లివ్ ఇన్ ద మూమెంట్ అంటూనే.. సేవ్ ఫర్ ఫ్యూచర్ అనే సిద్ధాంతంతో ముందుకు వెళ్తున్నారు. సాధారణంగా Gen Zలు వివిధ ప్రాంతాలు తిరుగుతూ.. ఎక్స్ప్లోర్ చేస్తూ.. నచ్చిన డ్రెస్లు వేసుకుంటూ.. నచ్చిన ఫుడ్స్ తింటూ లైఫ్ని చిల్ అవుతున్నారు. ఇది బయటకు కనిపించే ట్రెండ్ అయినా.. ఖర్చులు, సేవింగ్స్ విషయంలో వారు తీసుకునే నిర్ణయాలు చూస్తే కచ్చితంగా అందరూ షాక్ అవుతారు.
షాకింగ్ సేవింగ్స్..
Gen Zలు పైకి తెగ ఖర్చు పెట్టేస్తారు.. సేవింగ్స్ గురించి ఆలోచించరు అనేలా కనిపిస్తున్నా.. వారు అత్యధికంగా తమ ఆదాయాల నుంచి 40శాతం డబ్బును పొదుపు చేస్తున్నారని తాజా నివేదిక వెల్లడించింది. కళాశాలల నుంచే తమ ఖర్చులు, తమ కాలేజ్ఫీజులు తామే కట్టుకోవాలనే ఆలోచనలో Gen Zలు ఉన్నట్లు తేలింది. వారు ఎంజాయ్ చేస్తూ కూడా 40 శాతం డబ్బులను పొదుపు చేస్తున్నారనే విషయం అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. మిలియనిల్స్ కంటే.. Gen Zలు తెలివిగా డబ్బును ఆదా చేస్తూ ఆశ్చర్యం కలిగిస్తున్నారని కొత్త పరిశోధన తేల్చింది.
నెలకు 40 శాతం దాస్తున్నారట..
క్లియో అనే ఏఐ ఫైనాన్స్ యాప్ 16 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసుగల Gen Zలను డబ్బు పట్ల వారి వైఖరి గురించి పోల్ చేసింది. దాదాపు మూడొంతుల మంది కొంత నగదును రెగ్యూలర్గా ఆదా చేస్తున్నట్లు ఈ సర్వేలో తేలింది. జనాధరణ పొందిన ఆన్లైన్ ట్రెండ్లు ఆర్థిక పారదర్శకతను పెంచుకుంటూ.. రోజూవారి ఖర్చులలో కాంప్రిమైజ్ కాకుండా సేవింగ్స్ చేస్తున్నారట. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 40 శాతం మంది కనీసం నెలకు ఓసారైనా డబ్బును పొదుపు చేస్తున్నట్లు తెలిపారు. దీనిలో సగం మంది ఇల్లు లేదా కారు లేదా ఇతర దేశాలకు వెళ్లేందుకు ఆదా చేస్తున్నట్లు తేలింది.
ఆర్థికంగా మెలకువలు నేర్పిన కరోనా
గడిచిన రెండు సంవత్సరాలలో కరోనా సమయంలో తమ ఖర్చులు, పొదుపు అలవాట్లను మార్చుకోవాల్సి వచ్చిందని తెలిపారు. కిరాణా సామాగ్రి ధరలు పెరుగుతున్నందున ఆహారంపై కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. ఫిట్నెస్, ఫ్యాషన్, ప్రయాణాలకు ఖర్చు చేయడంతో పాటు.. ఆర్థికంగా కూడా డబ్బులు వెనకేసుకుంటున్నారు. కరోనా సమయం Gen Zలలో ఆర్థికంగా మెరుగు సాధించేందుకు కలిసి వచ్చిందని చెప్తున్నారు. ముందు తరం వారు కూడా ఈ ఆర్థిక లెక్కలు Gen Zల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read : కొవిడ్ పరిస్థితి మళ్లీ రానుందా? జపాన్‌లో జెట్ స్పీడ్లో విస్తరిస్తున్న కొత్త వైరస్.. ఇండియాకు వస్తే?