Japan Disease Outbreak : కొవిడ్ పరిస్థితి మళ్లీ రానుందా? జపాన్‌లో జెట్ స్పీడ్‌లో విస్తరిస్తున్న కొత్త వైరస్.. ఇండియాకు వస్తే?
Streptococcus Pyogenes Bacteria : చైనాలో ఎవరో గబ్బిలం సూప్ తాగితే వచ్చిన పరిస్థితి మళ్లీ వచ్చేలా ఉంది. కానీ ఇప్పుడు ఉపద్రవం జపాన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే నిజమైతే..
Japan Flesh Eating Bacteria : ప్రపంచ వ్యాప్తంగా ప్రజల జీవితాలను స్తంభింపజేసి.. కోట్లమంది ప్రాణాలను బలిగొంది కరోనా. ఇప్పుడు అలాంటి పరిస్థితే వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అప్పుడు చైనా నుంచి ఈ వైరస్ వస్తే ఇప్పుడు జపాన్ నుంచి ముప్పు వచ్చే ప్రమాదం ఉందని చెప్తున్నారు. జపాన్‌లో తాజాగా అరుదైన, ప్రమాదకరమైన బ్యాక్టీరియా సంక్రమణ వ్యాప్తి ఉద్భవించింది. ఆ వైరస్ ఏంటి? దానిని ఎలా అరికట్టాలి అనే దాని కోసం శాస్త్రవేత్తలు తలలు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో వైరస్‌ను కట్టడి చేయడానికి కొవిడ్ సమయంలో పాటించిన రూల్స్‌ని జపాన్‌లో జారీ చేశారు. ఇంతకీ ఆ వైరస్ ఎలా వచ్చింది? నిజంగానే ఇది ప్రమాదకరమైనదా? దీని లక్షణాలు ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్ ఇది..
ప్రస్తుతం వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ ఇన్ఫెక్షన్ను అర్థం చేసుకోవడానికి వైద్యులు, ఆరోగ్య నిపుణులు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఈ వైరస్‌కు డెడ్లీ ఫ్లెష్ ఈటింగ్ బ్యాక్టీరియా అనే మిస్టరీ ఇన్ఫెక్షన్ జపాన్‌లో వ్యాప్తి చెందుతుంది. ప్రతి సంవత్సరం సగటును 100 నుంచి 200 కేసులు నమోదు కాగా.. గత సంవత్సరం 941 కేసులు నమోదైనట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ పేర్కొంది. ఇది ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్ అని.. అది ఎందుకు పెరుగుతుందోననే దానిపై అక్కడి ప్రభుత్వం ఆందోళన చెందుతుంది.
అప్పట్లో తక్కువగానే ఉన్నా..
స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ స్ట్రెప్ ఎ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది స్ట్రెప్ థ్రోట్తో సంబంధం కలిగి ఉంటుందని నివేదించారు. 1992నుంచి ప్రతి సంవత్సరం కొన్ని కేసులు నమోదయ్యేవని.. కానీ తాజాగా వీటి సంఖ్య పెరుగుతుందని గుర్తించారు. ఈ వైరస్ అన్ని వయసుల వారిపై ఎఫెక్ట్ చూపిస్తుందని తెలిపారు. స్ట్రెప్ ఏ ఉన్న చాలా మందికి లక్షణాలు ఉండవట. లేదంటే గొంతు నొప్పి ఉండొచ్చని తెలిపారు. కానీ ఇది SSTSగా అభివృద్ధి చెంది.. మల్టీపుల్ ఆర్గాన్స్‌ను నాశనం చేస్తుందని తెలిపారు. కొందరిలో ఇది మరణానికి కూడా కారణమవుతుందని తెలిపారు.
వైరస్ వ్యాప్తి ఇలా ఉంటుంది..
గొంతులో లేదా చర్మంపై కనిపించే ఒక రకమైన తేలికపాటి ఇబ్బంది నుంచి.. ప్రాణాంతకమైన అనారోగ్యానికి ఈ వైరస్ కారణమవుతుందని జపాన్ ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. ముద్దు పెట్టుకోవడం, చేతుల ద్వారా, దగ్గరి పరిచయం ఉన్న వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. కాబట్టి మీ చేతులను ఎల్లప్పుడూ శుభ్రంగా కడుక్కోవాలి. దగ్గు లేదా జలుబు ఉన్నప్పుడు చేతులను రెగ్యూలర్‌గా వాష్ చేయాలి. గొంతు నొప్పి, జ్వరం, చర్మ వ్యాధులను యాంటీబయాటిక్స్‌తో కంట్రోల్ చేయవచ్చు కానీ.. ఈ బ్యాక్టీరియా ఊపిరితిత్తులు, రక్తం, కండరాల్లో ప్రవేశిస్తే.. చికిత్స కష్టం అవుతుంది. పైగా ఈ వైరస్ మీ రోగనిరోధకశక్తిని బాగా ప్రభావితం చేస్తుంది.
వైరస్ ప్రభావం వారిపై ఎక్కువ
వ్యాధి ఉన్నవారితో సన్నిహిత సంబంధం ఉన్నా.. 65 ఏళ్లు పైబడిన వారికి ఈ వైరస్ త్వరగా వ్యాప్తి చెందే అవకాశముంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు, గుండె జబ్బులు, క్యాన్సర్, చికెన్ పాక్స్, హెచ్ఐవీ సమస్యలున్నవారిపై ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి ఈ వైరస్ పట్ల అందరూ అవగాహన కలిగి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
Also Read : అబార్షన్ చేయించుకోవడమంటే మానవ హక్కులను ఉల్లంఘించడమే.. గర్భస్థ శిశువులను చంపే హక్కు ఎవరికీ లేదు