Miss World Competition Qualities : మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనాలంటే కావాల్సిన అర్హతలివే.. వయసు, హైట్ ఎంత ఉండాలంటే
Miss World 2025 : ప్రపంచ సుందరి పోటీలకు అమ్మాయిల్లో కచ్చితంగా ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ఫిజికల్‌గా ఎలా ఉంటే పోటీలకు అర్హత సాధిస్తారో ఇప్పుడు చూసేద్దాం.

Miss World Competition in Telangana : అందాల పోటీల్లో పాల్గొనేందుకు అమ్మాయిలకు కొన్ని అర్హతలు ఉండాలి. ముఖ్యంగా ప్రపంచ సుందరి కావాలంటే ఆమె కొన్ని విషయాల్లో కచ్చితంగా క్వాలిఫై అవ్వాలట. అప్పుడే వారిని పోటీల్లోకి అనుమతిస్తారు. ఆమె బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఫిజికల్ లుక్ వరకు కొన్ని అర్హతలు ఉంటేనే పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం లభిస్తుందట. ఇంతకీ ఓ అమ్మాయి మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనాలంటే ఉండాల్సిన అర్హతలు ఏంటి? చదువు నుంచి ఎత్తు వరకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో చూసేద్దాం.
మిస్ వరల్డ్ పోటీలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఎన్నో దేశాలకు చెందిన మోడల్స్ ఈ పోటీల్లో పాల్గొంటారు. ఈ పోటీలు అందం గురించే అనే అపోహ అందరిలోనూ ఉంటుంది. ప్రధానంగా అందమే అయినా కూడా పోటీదారుల్లోని ప్రతిభతో పాటు పలు అంశాలపై దృష్టి పెడతారు. అందుకే మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనడానికి ఉండాల్సిన అర్హతలు ఇవేనంటూ కొన్ని అంశాలను తెరపైకి తెచ్చారు. అవేంటంటే..
మిస్ వరల్డ్ పోటీలకు ఉండాల్సిన అర్హతలివే..
ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనే అమ్మాయిల వయసు 17 నుంచి 27 సంవత్సరాల మధ్యనే ఉండాలి. అమెరికాలో 18 నుంచి 26 సంవత్సరాల వారు మాత్రమే పోటీల్లో పాల్గొనే అవకాశం ఇస్తారు. పోటీదారులకు పెళ్లి అవ్వకూడదు. పిల్లలు ఉండకూడదు. క్రిమినల్ రికార్డ్ ఉండకూడదు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనడానికి చట్టబద్ధంగా మహిళగా గుర్తింపు ఉండాలి. ట్రాన్స్‌జెండర్ మహిళలు కూడా పోటీల్లో పాల్గొనవచ్చు. ఈ అంశంలో దేశం నుంచి దేశానికి వివిధ మార్పులు ఉంటాయి. కాబట్టి ఏ దేశం నుంచి పోటీ చేసే వారు అక్కడి నియమాలకు అనుగుణంగా పాల్గొనవచ్చు.
సిటిజన్ షిప్
మీరు ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్న దేశం నుంచి పౌరసత్వం కలిగి ఉండాలి. మీరు అక్కడే పుట్టకపోయినా.. పౌరసత్వానికి సంబంధించిన లీగర్ డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి. ఆ దేశంలో సొంత ఇల్లు ఉంటే దాని ద్వారా కూడా పౌరసత్వం పొందవచ్చు.
ఎ్తతు, బరువు ఎంత ఉండాలంటే..
మిస్ వరల్డ్ పోటీల్లో కేవలం సౌందర్యాన్నే కాదు.. తెలివితేటలు, తేజస్సు, కమ్యూనికేషన్, నైపుణ్యాలు, దయ వంటి ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. సమాజంపై వారికున్న సానుకూల ప్రభావాన్ని అంచనా వేసే విధంగా ప్రశ్నలుంటాయి. కాబట్టి నిర్థిష్టమైన ఎత్తు, బరువు ఉండాలని రూల్స్ ఏవి లేవు. కానీ శరీరాకృతి, ఫిట్‌నెస్‌పై కూడా దృష్టి సారిస్తారు. కాబట్టి పోటీదారులు హెల్తీగా, ఫిట్‌గా ఉండాలి. స్కిన్ కేర్, హెయిర్ కేర్, ఫిట్నెస్, ఫుడ్‌పై పోటీల్లో పాల్గొనేవారు దృష్టిపెట్టాలి. ఇవన్నీ మీరు కాన్ఫిడెంట్‌గా పోటీని ఎదుర్కోవడంలో హెల్ప్ చేస్తాయి.
బ్యూటీ విత్ ఏ పర్పస్..
మిస్ వరల్డ్ ఫైనల్స్‌కు ముందు టాలెంట్ రౌండ్, బ్యూటీ విత్ ఎ పర్పస్ రౌండ్, హెడ్ టు హెడ్ ఛాలెంజ్‌తో సహా అనే ప్రాథమిక పోటీలు ఉంటాయి. వీటి ద్వారా అభ్యర్థులను ఫైనల్ చేస్తారు. కాబట్టి పోటీదారులు తమ వ్యక్తిత్వం, తెలివితేటలు వంటి అంశాలపై జడ్జ్‌లు ఫోకస్ చేస్తారు. హై స్కూల్ స్టడీ ఉంటే సరిపోతుంది. కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. ఇంగ్లీష్ కచ్చితంగా వచ్చి ఉండాలి. బ్యూటీ విత్ ఏ పర్పస్ అనేందుకు సామాజిక అంశాల్లో కూడా వారు పాల్గొంటూ ఉండాలి. ర్యాంప్ వాక్ సెగ్మెంట్స్‌పై అవగాహన ఉండాలి.






















