Miss World 2025 Events : మిస్ వరల్డ్ 2025 పోటీలకు సిద్ధమైన హైదరాబాద్.. ఈవెంట్ డేట్స్, పూర్తి డిటైల్స్ ఇవే
Miss World 2025 : ప్రపంచ సుందరి పోటీలను హైదాబాద్‌లో నిర్వహించనున్నారు. అయితే దానికి సంబంధించిన తేదీలు, పూర్తి డిటైల్స్, ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు ఏంటో చూసేద్దాం.

72nd Miss World Events in Telangana : ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ సిద్ధమవుతుంది. ఈ గ్లోబల్ ఈవెంట్‌ను సక్సెస్ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ భారీ ఎత్తులో ఏర్పాట్లు కూడా చేస్తుంది. మరి ఈ గ్లోబల్ ఈవెంట్ ఎప్పుడు ప్రారంభమవుతుంది. ఎన్నిదేశాలు ఈ పోటీపడనున్నాయి? ఈవెంట్‌కి సంబంధించిన వివరాలు ఏంటో.. మిస్ వరల్డ్ 2025 పోటీలకు సంబంధించిన పూర్తి డిటైల్స్ ఇప్పుడు చూసేద్దాం.
హైదరాబాద్ 72వ మిస్ వరల్డ్ పోటీలకు సిద్ధమైపోయింది. గతేడాది మిస్ వరల్డ్ పోటీలకు న్యూఢిల్లీ, ముంబై వేదికవగా.. 2025 పోటీలకు గానూ తెలంగాణ సిద్ధమవుతుంది. మే 31వ తేదీన హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ ఫైనల్ ఈవెంట్ జరగనున్నట్లు ఫిబ్రవరిలోనే ఆర్గనైజర్స్ అనౌన్స్ చేశారు. హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు జరగడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకు జరిగిన 71 మిస్ వరల్డ్ పోటీలకు ఇండియా రెండుసార్లు ఆతిథ్యమివ్వగా (1996, 2024).. ఇప్పుడు జరిగే హైదరాబాద్ ఈవెంట్(2025)తో మూడోసారి ఆతిథ్యమివ్వనుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భాగ్యనగరం సిద్ధమవుతోంది.
140 దేశాలు.. 3 వేల మంది భామలు..
తెలంగాణ జరూర్ ఆనా అనే ట్యాగ్‌లైన్‌తో.. సంప్రదాయాలను, ఆధునికతలను ఏకం చేస్తూ.. రాష్ట్రప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అయితే తెలంగాణలో జరుగుతున్న ఈ మిస్ వరల్డ్ ఈవెంట్లో మొత్తం 140 దేశాలు పోటీపడనుండగా.. 3వేల మంది భామలు కంటెస్టెంట్లో పాల్గొననున్నారు. మిస్ వరల్డ్ 2025 పోటీలు మే 7వ తేదీ నుంచి మే 31వ తేదీవరకు జరగనున్నాయి. పోటీల్లో భాగంగా ఫ్యాషన్ రౌండ్స్, సాంస్కృతిక ప్రదర్శనలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read : మిస్ వరల్డ్ విన్నర్‌కు ఎన్నో ఉచితమైన సేవలు.. కిరీటం ధర లక్ష డాలర్లుకు పైమాటే కానీ
చేనేత థీమ్‌లో భామలు..
తెలంగాణను రిప్రజెంట్ చేస్తూ.. ఈసారి మిస్ వరల్డ్ పోటీల్లో చేనేత వస్త్రాలను హైలెట్ చేయనున్నట్లు తెలుస్తుంది. పోచంపల్లి, ఇక్కట్, చేనేత వస్త్రాలను ఫ్యాషన్ ప్రపంచానికి మరింత చేరువ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పోటీల్లో భాగంగా నిర్వహించే ఫ్యాషన్ రౌండ్, సాంస్కృతిక ప్రదర్శనల్లో చేనేత వస్త్రాలు ప్రదర్శించనున్నారు. ఈ థీమ్ ద్వారా నేతన్నలకు మరింత డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నారు.
వెన్యూ ఇదే..
హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో మిస్ వరల్డ్ ప్రధాన వేడుకలు జరగనున్నాయి. అయితే తెలంగాణాలోని వివిధ ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ పోటీల వల్ల టూరిజం కూడా పెరుగుతుందని.. ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణకు మంచి గుర్తింపు వస్తుందని భావిస్తున్నారు.
Also Read : మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్‌గా గెలిచిన ఇండియన్ బ్యూటీలు వీళ్లే






















