అన్వేషించండి

Type 2 Diabetes: మధుమేహులకి గుడ్ న్యూస్ - ఈ ప్రోటీన్ సప్లిమెంట్‌తో అదుపులోకి షుగర్ లెవల్స్

డయాబెటిస్ వల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి ఇది గుడ్ న్యూసే..

క్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండేలా చూసుకోవడం అంటే అది చాలా కష్టమైన పనే అని చెప్పాలి. ఒక్కసారి మధుమేహం వచ్చిందని తెలిసిన తర్వాత నోటికి తాళం వేసుకోవాల్సిందే. నచ్చిన ఆహారం వదులుకుంటూ నచ్చకపోయినా కొన్ని ఆహారాలు షుగర్ లేవల్స్ సక్రమంగా పడేలా చేసుకోవాలి. అందుకే మధుమేహులు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చక్కెర స్థాయి పెరిగితే గుండె సమస్యలు, దృషి లోపం, మూత్రపిండాల వ్యాధులు మొదలైన దీర్ఘకాలిక అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. అందుకే మధుమేహులు సరైన డైట్ పాటించకపోతే పరిస్థితి క్రిటికల్ గా మారుతుంది.

భోజనానికి ముందు తక్కువ మొత్తంలో పాలవిరుగుడు ప్రోటీన్ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రించడంలో గణనీయంగా మార్పులు చోటు చేసుకున్నట్టు ఇటీవల ఒక అధ్యయనం వెల్లడించింది. యూకేలోని న్యూకాజీల్ యూనివర్సిటీకి చెందిన ఒక బృందం ఈ అధ్యయనం చేసింది. ఇందులో టైప్ 2 డయాబెటిస్ ఉన్న వ్యక్తులకి భోజనానికి ముందు వెయ్ ప్రోటీన్ (whey protein) పౌడర్ తక్కువ మొత్తంలో ఇచ్చారు. వారం రోజుల పాటు ఈ ప్రోటీన్ పౌడర్ తాగిన తర్వాత వారిని పరీక్షించారు. మిగతా కొద్ది మందికి ఈ పౌడర్ ఇవ్వకుండా వారి చక్కెర స్థాయిలని పరిశీలిచారు. ఈ ప్రోటీన్ సప్లిమెంట్ తీసుకున్న తర్వాత గ్లూకోజ్ స్థాయిలు మెరుగ్గా నియంత్రణలోకి వచ్చినట్టు పర్యవేక్షణ బృందం వెల్లడించింది.

ఈ ప్రోటీన రెండు విధాలుగా పని చేసినట్టు అధ్యయనంలో పాల్గొన్న నిపుణులు వెల్లడించారు. మొదటిది జీర్ణ వ్యవస్థ ద్వారా ఆహారం ఎంత త్వరగా వెళ్తుంది అనేది, రెండోది రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా ఏ విధంగా ప్రభావం చూపించింది అనేది పరీక్షించారు. మధుమేహంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారి కోసం ఇటువంటి ఆహార పదార్థాల ఔషధాలు పరిశీలించడం ఎంతో అవసరం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వెయ్ ప్రోటీన్ అంటే ఏంటి?

మాయో క్లినిక్ ప్రకారం పాల ఉత్పత్తులలో కనిపించే ప్రాథమిక ప్రోటీన్లలో ఒకటి ఈ వెయ్ ప్రోటీన్. ఇది శరీరంలో ప్రోటీన్లు చేసే విధులని నిర్వహించడానికి అవసరమైన అమైనో ఆమ్లాలను గణనీయమైన మొత్తంలో అందిస్తుంది. ఇది సాధారణంగా పొడి రూపంలో ఉంటుంది. యాపిల్ సాస్, నీళ్ళు లేదా స్ముతిలో కూడా జోడించుకుని తినొచ్చు. ఇవి ఎక్కుగా అథ్లెట్ తీసుకుంటూ ఉంటారు. వారి పని తీరు మెరుగుపడేందుకు చక్కగా సహాయపడుతుంది. పోషకాహార లోపలు లేదా సమస్యల్ని పరిష్కరించడానికి దీని తీసుకుంటారు.

డయాబెటిస్ నియంత్రణకి ఎలా ఉపయోగపడుతుంది?

ఈ ప్రోటీన్ గ్యాస్ట్రిక్ ఖాళీని నింపి ఇన్ క్రెటిన్ హార్మోన్ స్రావాన్ని ప్రేరేపించి పేగుల పనితీరు మెరుగయ్యేలా చేస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. అమైనో ఆమ్లాలకు గొప్ప మూలం ఇది. పోస్ట్‌ప్రాండియల్ గ్లైసెమియా తగ్గింపుకు దోహదం చేస్తుంది. ఇది తీసుకోవడం వల్ల ఆకలి అణచివేయబడుతుంది. దీని వల్ల బరువు కూడా అదుపులో ఉంటుంది. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: టీ, కాఫీలు కాదు - ఉదయాన్నే ఈ పానీయాలు తాగితే బోలెడంత ఆరోగ్యం!

Also Read: భోజనం తర్వాత ఈ పనులు అస్సలు చేయకూడదు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Aus VS Ind Series: ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Aus VS Ind Series: ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
UPSC Civils Interview: సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ షెడ్యూలు విడుదల - తేదీలు, సమయం ఇవే
సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ షెడ్యూలు విడుదల - తేదీలు, సమయం ఇవే
Bajaj Chetak 35: కొత్త బజాజ్ చేతక్ 35 సిరీస్ వచ్చేసింది - ధర ఎంతంటే?
కొత్త బజాజ్ చేతక్ 35 సిరీస్ వచ్చేసింది - ధర ఎంతంటే?
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Smartphones Under Rs 15000: రూ.15 వేలలోపు బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే - లిస్ట్‌లో ఏమేం ఉన్నాయి?
రూ.15 వేలలోపు బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే - లిస్ట్‌లో ఏమేం ఉన్నాయి?
Embed widget