ప్రేయసి హ్యాండ్ బ్యాగ్‌పై మూత్రం పోసిన ప్రియుడు - ఊహించని తీర్పిచ్చిన కోర్టు
ప్రేమను కాదన్నదనే ఆగ్రహం ఒక్కోసారి ఎన్నో అనర్థాలకు దారితీసిన సందర్భాలున్నాయి. తాజాగా ఓ యువకుడు తన మాజీ ప్రియురాలి మీద ఉన్న కోపంతో చేసిన పని.. పెద్ద తలనొప్పి తెచ్చి పెట్టింది..
ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమలో ఉన్నప్పుడు అబ్బాయిలు అమ్మాయిల కోసం ఏమైనా చేస్తారు. కొండ మీద కోతిని తెచ్చివ్వమన్నా.. ఇచ్చేందుకు ప్రయత్నిస్తారు. ప్రియురాలి సంతోషమే.. తమ సంతోషం అనుకుంటారు అబ్బాయిలు. బర్త్ డేలని.. లవర్స్ డేలని.. ఆ డే.. ఈ డే.. ఏదేదో డే అంటూ మంచి మంచి బహుమతులు కొనిస్తారు. అపురూపంగా చూసుకుంటారు. కానీ.. ఏదైనా తేడా జరిగి బ్రేకప్ అయ్యిందంటే చాలు.. అంతకు ముందున్న ఆప్యాయత అంతా గంగలో కలుస్తుంది. నీ కోసం అది చేశా.. ఇది చేశా అని.. అబ్బాయి అంటే… ఎవరు చేయమన్నారని.. అమ్మాయి అంటుంది. ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ కాస్త ద్వేషంగా మారుతుంది. ఆ కోపం ఎక్కడికో దారితీస్తుంది.
ప్రేమను కాదన్నదనే ఆగ్రహం ఒక్కోసారి ఎన్నో అనర్థాలకు దారితీసిన సందర్భాలున్నాయి. ప్రేమ కోసం అమ్మాయిలను దారుణంగా చంపిన ఘటనలు చాలా చూశాం. అబ్బాయిల మీద అమ్మాయిలు దాడి చేయడాన్నీ విన్నాం.. తాజాగా ఓ యువకుడు తన మాజీ ప్రియురాలి మీద ఉన్న కోపంతో చేసిన పని.. పెద్ద తలనొప్పి తెచ్చి పెట్టింది.
దక్షిణ కొరియాలోని సియోల్ కు చెందిన 31 ఏళ్ల యువకుడు.. ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. తన ప్రేమకు ఆ అమ్మాయి కూడా ఓకే చెప్పింది. కొంత కాలం పాటు వీరిద్దరు కలిసి తిరిగారు. పార్కులు, సినిమాలు అంటూ తెగ ఎంజాయ్ చేశారు. కొంత కాలం తర్వాత వారి మధ్య చిన్ని చిన్న గొడవలు వచ్చాయి. నెమ్మదిగా అవి పెద్దవి అయ్యాయి. ఒకరితో ఒకరు కలిసి ఉండలేం అనుకుని బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య పెద్ద గొడవ అయ్యింది. ఆ కోపంలో యువకుడు ఊగిపోయాడు. వెంటనే ఇంట్లోకి వెళ్లి.. బెడ్ రూంలో ఆ అమ్మాయికి చెందిన ఖరీదైన లూయిస్ విట్టన్ బ్యాగ్ ను బయటకు తీసుకొచ్చాడు. దాన్ని కింద పడేసి కాలితో తొక్కి.. దాని మీద మూత్రం పోశాడు. డిజైనర్ బ్యాగును నశనం చేసి పగ తీర్చుకున్నాడు. వెంటనే ఆమె ఆ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
స్పాట్ కు చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. యువకుడిని ప్రశ్నించారు. మొదట తాను బ్యాగు మీద మూత్రం పోయలేదని చెప్పాడు. చేసిన తప్పును అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో సదరు బ్యాగును పోలీసులు టెస్టు కోసం పంపించారు. ఈ పరీక్షలో అతడు బ్యాగ్ మీద మూత్రం పోసినట్లు తేలింది. మూత్రంలోని డీఎన్ఏ అతడి డీఎన్ఏతో మ్యాచ్ అయ్యింది. పోలీసులు దర్యాప్తు నివేదికను, ల్యాబ్ రిపోర్టును కోర్టు ముందు ఉంచారు. కేసు నిరూపితం కావడంతో సదరు యువకుడికి కోర్టు 1.5 మిలియన్ సౌత్ కొరియన్ వాన్లను(భారత కరెన్సీలో సుమారు రూ. 90 వేల రూపాయలు) ఆమెకు చెల్లించాలని ఆదేశించింది. ఈ ఘటన గత ఏడాది జరగగా.. సుమారు ఏడాది విచారణ తర్వాత కోర్టు తుది తీర్పు వెల్లడించింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: టాయిలెట్‌లో టైంపాస్? గంటలు గంటలు దానిపై కూర్చుంటే చెప్పుకోలేని రోగం వస్తుందట!
Also Read: 30 డేస్ వాటర్ ఛాలెంజ్ - ఈ ట్రెండ్ ఫాలో కావద్దు, ప్రాణాలు పోతాయ్, ఎందుకంటే..