అన్వేషించండి

Relationship With Car: అరె, కారుతో సెక్స్ ఏంట్రా? అదే అతడి ప్రియురాలట!

ఎవరూ దొరకనట్లు.. అతడు కారుతో ప్రేమలో పడ్డాడు. అక్కడితో ఆగకుండా.. అతడు దానితో లైంగికంగానూ కలుస్తున్నాడు.

వారిద్దరు కలిసి ఎన్నో విహార యాత్రలు చేశారు. ఎక్కడెక్కడో తిరిగారు. రాత్రి, పగలు తేడా లేకుండా కలిసి ఉన్నారు. ఒక్కోసారి సెక్స్ కూడా చేసుకొనేవారు. ఆహా, ఎంత చక్కటి జంట.. మనకు కూడా అలాంటి లైఫ్ ఉంటే ఎంత బాగుంటుందని అనుకుంటున్నారా? ఒక్క క్షణం, మీరు అంత లోతుగా ఆలోచించడానికి ముందు.. మీరు జీర్ణం చేసుకోలేని ఒక వాస్తవాన్ని తెలుసుకోవాలి. అతడి పార్టనర్ ఎవరో తెలుసుకోడానికి ‘టైటిల్’ మరోసారి చదవండి. ఇప్పుడు మీకు అతడి పార్టనర్ ఎవరో అర్థమైపోయే ఉంటుంది. ఔనండి, అతడి సెక్స్ పార్టనర్ ఒక కారు.

ఇది వినడానికి చిత్రంగా ఉన్న చేదు నిజం. వాస్తవానికి ఇది 2012లో TLC టీవీ చానెల్‌లో ప్రసారమైన ఓ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తి చెప్పిన విచిత్ర లవ్ స్టోరీ ఇది. ‘మై స్ట్రేంజ్ అడిక్షన్’ ఎపిసోడ్‌లో పాల్గొన్న నథానియల్ అనే వ్యక్తి వింత కోరికలు చూసి అప్పటి వీక్షకులు షాకయ్యారు. అర్కాన్సాన్‌లో నివసిస్తున్న నథానియల్.. తాను 1998 మోడల్‌కు చెందిన చెవీ మోంటే కార్లో కారును ప్రేమిస్తున్నానని తెలిపాడు. 

2005లో తన కారుతో ప్రేమలో పడ్డానని, అప్పటి నుంచి దానితో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని నథానియల్ తెలిపాడు. దానితో కలిసి తాను సుదీర్ఘ ప్రయాణాలు చేశానని, సెక్సులో కూడా పాల్గొన్నామని పేర్కొన్నాడు. ‘‘మొదటి చూపులోనే నేను ఆ కారును ప్రేమించేశాను. నా శరీరాన్ని దానికి అర్పించాను. ఆ వెంటనే దానితో శారీరక సంబంధం పెట్టుకున్నాను’’ అని తెలిపాడు. అయితే, ఆ కారును ఎందుకు ప్రేమిస్తున్నా అనేది అతడి అస్సలు తెలియదట. దానికి కారణం కూడా తన వద్ద లేదట. కానీ, దానితో ఎప్పుడూ కలిసి ఉండాలనే కోరిక పుడుతుందట అతడికి. 

‘‘వస్తువులంటే ఎవరికైనా ప్రేమ ఉంటుంది. కానీ, సెక్స్ చేయడం ఏమిటీ? మరీ పిచ్చికాకపోతే అని అనుకుంటున్నారా? అయితే, ఒక వ్యక్తి కారుతో సెక్సులో ఎలా పాల్గోగలడు’’ అనేగా మీ సందేహం? ఆ విషయాన్ని మరీ లోతుగా చెప్పలేం. కానీ, అతడు చెప్పిన వివరాల ప్రకారం.. తనకు మూడ్ వస్తే ఆ కారు కింది భాగం (ఫెండర్) కిందకి దూరి ఆ పని కానిస్తాడట. ఒక్కోసారి ఆ కారు హుడ్(ముందు ఉండే ఇంజిన్ భాగం)పై వాలిపోయి కూడా లైంగికంగా కలుస్తాడట. తన మర్మాంగాన్ని దానికి రుద్దడం ద్వారా సంతృప్తి చెందుతాడట. 
 
తన కారుకు ఎక్కువగా.. తాను కింద నుంచి చేసే భంగిమే ఇష్టమని నథానియల్ చెప్పాడు. (అయినా, పిచ్చి కాకపోతే.. కారు ఎక్కడైనా మాట్లాడుతుందా? చెప్పండి?). అయితే, నథానియల్‌కు చిన్న వయస్సు నుంచే ఆటోమొబైల్స్ అంటే ఇష్టమట. కానీ, ఏ వాహనంతోనూ అతడు లైంగిక సంబంధాన్ని పెట్టుకోలేదట. కానీ, యుక్త వయస్సు వచ్చిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందట. అంతకు ముందు అతడు అమ్మాయిలతో డేటింగ్ చేశాడు. కానీ, కారుతో రిలేషన్‌షిప్ ఉన్నప్పటి నుంచి ఎవరినీ కలవడం లేదట. అలా చేస్తే తన కారుకు అన్యాయం చేసినట్లేనని ఫీలవుతున్నాడు. తన బంధానికి కట్టుబడి ఉంటానని చెబుతున్నాడు. 

Also Read: పొట్టివాళ్లు గట్టోళ్లా? ఎత్తు పెరిగితే ‘అంగ స్తంభన’ సమస్యలు? తాజా స్టడీలో షాకింగ్ ఫలితాలు
 
‘‘నా డార్లింగ్(కారు)కు చిన్న గీతపడినా చాలా బాధ వేస్తుంది. ఇక దానికి ఏదైనా జరిగితే నా గుండె ఆగిపోతుంది’’ అని తెలిపాడు. తనదో విచిత్రమైన బంధమని  నథానియల్ తెలిపాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే తానేదో తప్పు చేస్తున్నట్లుగా ప్రజలు భావిస్తారని, అందుకే తమ సంబంధం గురించి బయటకు చెప్పలేదని పేర్కొన్నాడు. అంతేగాక, కార్లను ఇష్టపడేవారికి మా బంధం గురించి తెలిస్తే తనని అసహ్యించుకుంటారని, పైగా తమ బంధం ఉద్యోగానికి ఆటంకంగా మారుతుందనే ఆందోళన కూడా ఉందన్నాడు. కానీ, దానిని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానని, దాన్ని ఎట్టి పరిస్థితిలో విక్రయించనని స్పష్టం చేశాడు. ఇతడి లవ్ స్టోరీ కొందరికి చెత్తగా లేదా కొత్తగా అనిపించవచ్చు. కానీ, అతడు దానిపై ఉన్న ప్రేమ గురించి సమాజానికి ధైర్యంగా చెప్పినందుకు మెచ్చుకోవల్సిందే. 

Also Read: మిట్ట మధ్యాహ్నం సెక్స్, సడన్‌గా గతం మరిచి ‘గజినీ’లా మారిపోయిన భర్త, ఈ సమస్య మీకూ రావచ్చు!

టాప్ హెడ్ లైన్స్

High BP : బీపీ తగ్గాలంటే డైట్, లైఫ్‌స్టైల్​లో ఈ మార్పులు తప్పక పాటించండి.. నిపుణుల సూచనలు ఇవే
బీపీ తగ్గాలంటే డైట్, లైఫ్‌స్టైల్​లో ఈ మార్పులు తప్పక పాటించండి.. నిపుణుల సూచనలు ఇవే
Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget