Tallest Person Risks: పొట్టివాళ్లు గట్టోళ్లా? ఎత్తు పెరిగితే ‘అంగ స్తంభన’ సమస్యలు? తాజా స్టడీలో షాకింగ్ ఫలితాలు
యుక్త వయస్సులోనే మీ పిల్లలు మీ కంటే ఎత్తు పెరిగారని సంతోషిస్తున్నారా? అయితే, మీరు తాజాగా అధ్యయనంలో వెల్లడైన ఈ భయానక నిజాలు తెలుసుకోవాల్సిందే.

పొట్టివాళ్లు గట్టోళ్లని మన పెద్దలు అంటుంటారు. అయితే, అది కేవలం తెలివితేటల్లో మాత్రమే అని మనం అనుకుంటాం. ఆరోగ్యం విషయంలో కూడా పొట్టివాళ్లు గట్టోళ్లేనని తాజా అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ వెటరన్ అఫైర్స్‌కు చెందిన మిలియన్ వెటరన్ ప్రోగ్రామ్ (MVP) చేసిన జన్యు అధ్యయనంలో ఈ విషయాలు బయటపడ్డాయి. యుక్త వయస్సులోనే బాగా ఎత్తు పెరిగే పిల్లలను అనేక ప్రమాదకర ఆరోగ్య పరిస్థితులు వెంటాడుతాయని అధ్యయనంతో పేర్కొన్నారు.
- తాజా అధ్యయనంలో ఎత్తుగా ఉండేవారిలో కొరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని తేలడం ఒక్కటే గుడ్‌న్యూస్. అయితే, ఎత్తుగా పెరిగే పిల్లలను నరాల వ్యాధులు, రక్తప్రసరణ సమస్యలు వెంటాడుతాయనేది మాత్రం చాలా బ్యాడ్ న్యూస్.
- PLOS జెనిటిక్స్‌లో ప్రచురించిన ఈ అధ్యయనానికి వీఏ ఈస్ట్రర్న్ కొలరాడో హెల్త్ కేర్ సిస్టమ్‌కు చెందిన డాక్టర్ శ్రీధరన్ రాఘవన్ నాయకత్వం వహించారు.
- ఎవరైనా పెద్దయ్యాక ఎంత ఎత్తు ఎదుగుతారనేది వారి తల్లిదండ్రుల నుంచి సంక్రమించే జన్యువులపై ఆధారపడి ఉంటుంది. అయితే, పోషకాహారం, సామాజిక ఆర్థిక స్థితి, పర్యావరణ కారకాలు కూడా ఎత్తును నిర్ణయించడంలో పాత్ర పోషిస్తాయి.
- వైద్య నిపుణులు ఈ అధ్యయనంలో జన్యుపరంగా ఎత్తు ఎదిగే యువతను ఆరోగ్య పరిస్థితులను మాత్రమే తెలుసుకున్నారు. ఈ సందర్భంగా MVPలో నమోదు చేసుకున్న 280,000 మంది జన్యు, వైద్య డేటాను అధ్యయనంలో పరిశీలించారు.
- తెల్లగా, పొడవుగా ఉండే ఎత్తైన వ్యక్తుల్లో సుమారు 127 వైర్వేరు అనారోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. అయితే, ఇందుకు రంగు కారణం కాదని, తమ అధ్యయనంలో తక్కువ మంది నల్ల జాతి వ్యక్తులు ఉండటం వల్లే వారి గురించి ఎక్కువ తెలుసుకోవడం సాధ్యం కాలేదని పరిశోధకులు తెలిపారు.
- ఈ స్టడీలో 21 శాతం మంది నలుపు వ్యక్తులు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. తెల్లగా ఉండే వ్యక్తుల్లో గుర్తించిన రోగాల్లో సుమారు 48 వరకు రుగ్మతలు నల్ల జాతి వ్యక్తుల్లో కూడా గుర్తించామన్నారు.
- ఎత్తుగా ఉండే వ్యక్తుల్లో కరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదం తక్కువగా ఉందని పేర్కొంది. అయితే, వీరిలో Atrial fibrillation సమస్యలు ఎక్కువని తెలిపింది.
- ఈ సమస్య(A-fib) వల్ల గుండె క్రమరహితంగా కొట్టుకుంటుంది. ఒక్కోసారి వేగంగా పెరిగే గుండె లయ (అరిథ్మియా).. గుండెలో రక్తాన్ని గడ్డకట్టేలా చేస్తుంది. దీనినే A-fib స్ట్రోక్ అంటారు. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు పెరుగుతాయి.
- ఎత్తుగా ఉండేవారిలో పెరిఫెరల్ న్యూరోపతి (Peripheral neuropathy), రక్త ప్రసరణ సమస్యలు కూడా ఎక్కువేనని అధ్యయనం వెల్లడించింది. ఇది సిరల రక్తప్రసరణ రుగ్మతలకు సంబంధించినది.
- నరాల సమస్య వల్ల అంగస్తంభన, మూత్రం నిలిచిపోయే ప్రమాదాలు ఎక్కువగా ఉండవచ్చని అధ్యయనంలో పేర్కొన్నారు. పొడవుగా ఉండేవారిలో సిరల్లో రక్తం గడ్డకట్టవచ్చని తెలిపారు. జన్యుపరంగా ఎత్తు ఎదిగే వ్యక్తుల్లో న్యూరోపతి సమస్యలు పెరగవచ్చన్నారు. ఎత్తుగా ఉండే వ్యక్తులు బరువు పెరిగినట్లయితే బొటనవేలు, పాదాల వైకల్యం కూడా ఏర్పడవచ్చని వివరించారు.
- పొడవుగా ఉండే స్త్రీ, పురుషుల్లో ‘ఎత్తు’ వల్ల ఉబ్బసం, నాన్-స్పెసిఫిక్ నరాల వ్యాధులు కూడా పెరుగుతాయని, స్కిన్ ఇన్ఫెక్షన్లు కూడా రావచ్చని అధ్యయనం వెల్లడించింది. అయితే, వీటిపై మరింత స్పష్టత ఇచ్చేందుకు లోతైన అధ్యయనం అవసరమని పరిశోధకులు వెల్లడించారు. దానివల్ల జన్యుపరంగా ఎత్తు ఎదిగే పిల్లల ఆరోగ్యాన్ని రక్షించేందుకు అవసరమైన ప్రయత్నాలు చేయొచ్చని నిపుణులు పేర్కొన్నారు.
Also Read: నా భార్య రోజూ మ్యాగీ పెట్టి చంపేస్తోంది - కోర్టుకు భర్త మొర, చివరికి..
Also Read: జ్వరం, నొప్పులకు ఈ మాత్ర వాడుతున్నారా? జాగ్రత్త, ప్రాణాలు పోతాయ్!
గమనిక: అధ్యయనంలో పేర్కొన్న అంశాలను మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.





















