Memory Loss With Sex: మిట్ట మధ్యాహ్నం సెక్స్, సడన్‌గా గతం మరిచి ‘గజినీ’లా మారిపోయిన భర్త, ఈ సమస్య మీకూ రావచ్చు!
అప్పటివరకు ఆనందంగా శృంగారంలో మునిగి తేలాడు. 10 నిమిషాల తర్వాత.. ఫోన్ చూడగానే అతడి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. ఎందుకంటే..
ఎవరైనా తలకు దెబ్బ తగిలితే గతాన్ని మరిచిపోతారు. లేదా మెదడు సమస్యలు లేదా అనారోగ్య కారణాల వల్ల జ్ఞాపకశక్తిని కోల్పోతారు. కానీ, ఇతడేంటో.. తన భార్యతో మిట్టమధ్యాహ్నం సెక్స్‌లో పాల్గొన్నాడు. ఆ వెంటనే గతాన్ని మరిచిపోయాడు. కొద్ది సేపటి తర్వాత అతడికి అంతా కొత్తగా అనిపించింది. ముందు రోజు ఏం జరిగిందో తనకు అస్సలు గుర్తులేదని భార్యకు చెప్పాడు. వెంటనే గది నుంచి బయటకు వచ్చి తన పిల్లలను కూడా ఇదే విషయాన్ని అడిగాడు. నిన్న ఏం జరిగిందో గుర్తురావడం లేదని తెలిపాడు. దీంతో వారు.. ‘‘నిన్న మీ వెడ్డింగ్ యానివర్శరీ. ఇంట్లో పెద్ద పార్టీ కూడా జరిగింది. గుర్తులేదా?’’ అని పిల్లలు తిరిగి ప్రశ్నించారు. దీంతో అతడు బిక్క ముఖం వేశాడు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాడు. ఈ అరుదైన ఘటన గురించి ఐరిష్ మెడికల్ జర్నల్‌లో పేర్కొన్నారు.
అమ్నీషియా సమస్యే కారణమా?: సెక్స్ చేస్తున్నప్పుడు కూడా స్వల్పకాలిక జ్ఞాపకశక్తిని కోల్పోయే అవకాశాలున్నాయని, ఇందుకు ఈ ఘటనే నిదర్శనమని తాజా అధ్యయనం వెల్లడించింది. బాధితుడు తన భార్యతో సెక్స్ చేసిన 10 నిమిషాల్లోనే ‘ట్రాన్సియెంట్ గ్లోబల్ అమ్నీషియా’కు గురయ్యాడు. ఈ కేసును పరిశీలించిన యూనివర్శిటీ హాస్పిటల్ లిమెరిక్‌లోని న్యూరాలజీ విభాగం.. సెక్స్ వల్లే అతడు జ్ఞాపకశక్తిని కోల్పోయాడని నిర్ధరించింది.
10 నిమిషాల్లోనే..: సుమారు ఏడు సంవత్సరాల కిందట చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలను ‘రికరెంట్ పోస్ట్‌కోయిటల్ ట్రాన్సియెంట్ అమ్నీషియా అసోసియేటెడ్ విత్ డిఫ్యూజన్ రిస్ట్రిక్షన్’ అనే నివేదికలో పేర్కొన్నారు. జ్ఞాపకశక్తి కోల్పోయిన తర్వాత ఆ వ్యక్తి డాక్టర్లను సంప్రదించాడు. సెక్స్ చేస్తున్నప్పుడు తనకు ఒక్కసారే మైండ్ బ్లాకైనట్లు అనిపించిందని ముందు రోజు జరిగినదంతా మరిచిపోయానని తెలిపాడు. సెక్స్ చేసిన 10 నిమిషాల తర్వాత అతడు తన ఫోన్ చూసుకున్నాడు. అందులో ఉన్న వెడ్డింగ్ యానివర్శరీ ఫొటోలు చూసి ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ఫొటోల డేట్‌ను చూసి షాకయ్యాడు. అదంతా ఆ ముందు రోజే జరిగింది. కానీ, అదంతా నాకెందుకు గుర్తులేదని భార్య, పిల్లలను అడిగేసరికి.. ఆయన జోక్ చేస్తున్నారని అనుకున్నారు. ఆ తర్వాత అది నిజమని తెలిసి.. డాక్టర్‌ను సంప్రదించారు.
Also Read: పులిపిరులు వేదిస్తున్నాయా? ఈ ఆయుర్వేద చిట్కా పాటిస్తే వెంటనే రాలిపోతాయి
ఒకటిన్నర రోజు డిలీట్ అయిపోయింది: అతడు కేవలం ముందు రోజును మాత్రమే మరిచిపోయాడు. భార్య, పిల్లలు, తన గత జీవితాన్ని మరిచిపోలేదు. కేవలం ఆ ఒక్క రోజు మాత్రమే అతడి మెమరీ నుంచి డిలీట్ అయిపోయింది. అంతేకాదు, భార్యతో సెక్స్‌కు ముందు ఆ రోజు ఉదయం ఏం జరిగిందో కూడా అతడికి గుర్తులేదు. ఈ పరిస్థితిని ‘పోస్ట్‌కోయిటల్ డైస్ఫోరియా’ అని కూడా అంటారు. సాధారణంగా కొంతమంది మహిళల్లో అరుదుగా జరుగుతుంది. సెక్స్ తర్వాత వారిలో ఒక సూన్యమైన భావన కలుగుతుంది. కాసేపు ఏం జరిగిందో గుర్తు ఉండదు. బాధితుడికి ఏర్పడిన సమస్య కూడా అలాంటిదేనని నివేదికలో వెల్లడించారు. సాధారణంగా 50 నుంచి 70 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తుల్లో ఇలాంటివి ఏర్పడుతుంటాయి. ఈ సమస్యను ఎదుర్కొన్న బాధితుడి వయస్సు 66 ఏళ్లు. మీకు కూడా ఇలాంటి సమస్య వస్తే కంగారు పడకండి. వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
Also Read: గుడ్ న్యూస్, బట్టతలకు ఇక బై బై, ఈ మందుతో జుట్టు తిరిగి వచ్చేస్తుంది!
గమనిక: ఈ కథనంలో కేవలం మీ అవగాహన కోసమే అందించాం. పలు అధ్యయనాలు, నివేదికల్లో పేర్కొన్న విషయాలను అక్కడ యథావిధిగా అందించాం. ఇందులోని అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.