Warts Removal Tips: పులిపిరులు వేదిస్తున్నాయా? ఈ ఆయుర్వేద చిట్కా పాటిస్తే వెంటనే రాలిపోతాయి
పులిపిరులు ఇబ్బంది కలిగిస్తున్నాయా? అయితే, ఈ కింది ఆయుర్వేద, వంటింటి చిట్కాలను పాటించండి.
పులిపిరులు(Warts) అందానికి అడ్డంగా మారతాయి. కొన్ని పులిపిరులు నొప్పి రావు. కానీ, దుస్తులతో రాపిడి వల్ల దురద లేదా నొప్పి కలుగుతుంది. ఈ పులిపిరులు ఎక్కువగా మెడ, ముఖం, చేతులు, కాళ్లపై ఏర్పడుతుంటాయి. మరి ఈ పులిపిర్లు ఎందుకు ఏర్పడతాయి? ఇవి పోవాలంటే ఏం చేయాలి?
పులిపిరులు అంటే?: రోగ నిరోధక శక్తి లోపం, హార్మోన్ల అసమతుల్యత వల్ల శరీరంపై కొన్ని వైరస్‌లు దాడి చేస్తాయి. హ్యూమన్ పాపిలోమా(human papilloma) అనే వైరస్ పురిపిరులకు కారణమవుతాయి. అయితే, వీటిలో చాలా రకాలున్నాయి. మెడ, ముఖం మీద వచ్చే పులిపిరులను ఫ్లాట్ వార్ట్స్ అని అంటారు. పాదాలపై వస్తే ఫ్లాంటార్ వార్ట్స్ అని, చేతి వేళ్లపై వస్తే కామన్ వార్ట్స్ అని అంటారు. కొందరికి జననాంగాలపై కూడా పులిపిరులు వస్తాయి. వాటిని జనైటల్ వార్ట్స్ అని అంటారు. పిలిపిర్లను కత్తిరిస్తే చాలా ప్రమాదం. వాటి నుంచి ఉత్పత్తయ్యే ద్రవం వల్ల ఇతర భాగాల్లో కూడా పులిపురులు ఏర్పడటానికి కారణం కావచ్చు. కొన్ని ఆయుర్వేద, వంటింటి చిట్కాలను పాటిస్తే.. వాటికవే మాడిపోయి రాలిపోతాయి. అవేంటో చూసేయండి మరి.
ఆయుర్వేద చిట్కా:
కావలసిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్, వెల్లుల్లి, కిళ్లీలో వేసుకొనే సున్నం.
ఇలా చేయండి: 100 మిల్లీలీటర్ల ఆలివ్ ఆయిల్‌ను ఒక గిన్నెలోకి తీసుకోండి. వాటిలో 10 వెల్లులి రెబ్బలు వేయండి. ఆ తర్వాత దాన్ని పొయ్యి మీద పెట్టి వేడి చేయండి. వెల్లులి రెబ్బలు నల్లగా మారేవరకు నూనెను వేడి చేయాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని వడపోయాలి. అనంతరం కాస్త సున్నంలో ఆయిల్ చుక్క వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని పులిపురులు ఉన్న చోట పెట్టాలి. ఇలా రెండు, మూడుసార్లు చేస్తే పులిపురులు నల్లగా మాడిపోయి, ఊడిపోతాయి. పులిపిరులు ఊడిపోయిన ప్రాంతంలో మంటగా అనిపిస్తే.. స్వచ్ఛమైన తేనె లేదా కొబ్బరి నూనె రాస్తే ఉపశమనం లభిస్తుంది. పులిపిరులు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండేవారిలో ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి ఆలివ్ ఆయిల్, వెల్లులి మిశ్రమం తాగినా మంచిదే. దీని వల్ల భవిష్యత్తులో పులిపిరులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అయితే, సున్నం, ఆలివ్ ఆయిల్ మిశ్రమాన్ని కంటికి సమీపంలో ఉండే పులిపిరులకు మాత్రం పెట్టొద్దు. సున్నం వల్ల కళ్లు దెబ్బతినే ప్రమాదం ఉంది.
Also Read: ప్రాణం పోసిన ప్రేమ, ప్రమాదంలో శరీరం సగానికి ముక్కలైనా జీవిస్తున్న యువకుడు
వంటింటి చిట్కాలు:
⦿ బేకింగ్ పౌడర్‌ను ఆముదంతో కలిపి పులిపిర్లపై రాయండి. రెండు లేదా మూడు రోజులు ఇలా చేస్తే పులిపిరుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
⦿ కలబంద ఆకు మధ్యలో ఉండే జిగురులో మేలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది పులిపిర్లలోని వైరస్‌కు చుక్కలు చూపిస్తుంది. ఫలితంగా పులిపిరులు వెంటనే తగ్గిపోతాయి.
⦿ అరటి పండు తొక్కలో ఎంజైమ్‌లు ఉంటాయి. కాబట్టి, అరటి పండును పులిపిరులపై రుద్దడం వల్ల కాస్త ఆలస్యమైనా ఉపశమనం లభిస్తుంది.
⦿ యాపిల్ సిడర్ వెనిగర్‌తో కూడా పులిపిరులను వదిలించుకోవచ్చు. ఈ వెనిగర్‌లో ఉండే యాసిడ్ కంటెంట్ పులిపిర్లను మాడ్చేస్తాయి. యాపిల్ సిడర్ వెనిగర్‌లో దూదిని ముంచి పులిపుర్లు ఉన్నచోట అద్దితే వారం రోజుల్లో ఉపశమనం లభిస్తుంది.
Also Read: గుడ్ న్యూస్, బట్టతలకు ఇక బై బై, ఈ మందుతో జుట్టు తిరిగి వచ్చేస్తుంది!