అన్వేషించండి

Man Cut in Half: ప్రాణం పోసిన ప్రేమ, ప్రమాదంలో శరీరం సగానికి ముక్కలైనా జీవిస్తున్న యువకుడు

‘‘తల మిగిలినా చాలు, నన్ను బతికించండి. నాకు బతకాలని ఉంది’’ అంటూ వైద్యులను వేడుకున్నాడు. సర్జరీ తర్వాత అతడు బతకడనే అనుకున్నారు. కానీ, అతడి ప్రేయసి తన ప్రేమతో ప్రాణం పోసింది.

‘‘డాక్టర్, నా శరీరం మొత్తం పోయినా పర్వాలేదు. కనీసం తల మిగిలినా బతికేలా చూడండి. నాకు బతకాలని ఉంది’’ అని అన్నాడు. వైద్యులు ఎంతో శ్రమించి అతడి ప్రాణాలను కాపాడారు. కానీ, పాడైన శరీర భాగాల నుంచి ఇన్ఫెక్షన్ ఇతర అవయవాలకు సోకకుండా ఉండేందుకు సగానికి పైగా శరీరాన్ని తొలగించాల్సి వచ్చింది. అయితే, ఆ పరిస్థితుల్లో అతడు ఎన్నాళ్లు బతుకుతాడో చెప్పలేమని వైద్యులు అన్నారు. కానీ అతడు ధైర్యాన్ని కోల్పోలేదు. 

ఎందుకంటే.. అతడిని ఎంతో గాఢంగా ప్రేమించే ప్రేయసి ఆ క్షణంలో అతడి వెంటే ఉంది. జీవితాంతం ‘‘నీ తోడు ఉంటా.. భయపడకు. నువ్వు ఎలా ఉన్నా, నాకే సొంతం కుంగిపోకు. నిన్ను ప్రియుడిలా కాదు, కన్న బిడ్డలా చూసుకుంటా. నువ్వు సగమే ఉన్నావని బాధపడకు. నీలో సగం నేను. నిను వీడి ఎక్కడికి వెళ్లలేను’’ అని చెప్పింది. అవి ఒట్టి మాటలు కాదు. ఒట్టేసి చెప్పిన గట్టి మాటలు. ప్రేమకు శరీరాలు కాదు.. మనసులు కలవడమే ముఖ్యమని చెప్పేందుకు ఆమే నిదర్శనం. తన ప్రియుడిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ.. నిత్యం తోడుగా నిలుస్తోంది. చిన్న వయస్సులోనే జీవితానికి గొప్ప అర్థాన్ని చెప్పిన ఆమె పేరు షావర్స్ సబియా రీచే. 

అతడికి ఏమైంది?: మోంటానాలోని గ్రేట్ ఫాల్స్‌‌కు చెందిన అతడి పేరు లోరెన్ షాయర్స్. 19 ఏళ్ల వయస్సులో అతను ఓ వంతెన నిర్మాణ పనుల కోసం పార్ట్ టైమ్ జాబ్‌లో చేరాడు. ఈ సందర్భంగా అతడు ఫోర్క్ లిఫ్ట్ వాహనం నడిపే బాధ్యతలు తీసుకున్నాడు. పనిలో నిమగ్నమై ఉండగా ఆ వంతెన మీద కొన్ని కార్లు వేగంగా దూసుకు రావడం ప్రారంభించాయి. ఓ కారు లోరెన్ నడుపుతున్న ఫోర్క్ లిఫ్ట్ వాహనం మీదకు వచ్చింది. దీంతో లోరెన్ ఆ వాహనం నుంచి కిందికి దూకాడు. అయితే, ఆ వాహనం సీట్ బెల్ట్ అతడి కాళ్లకు చిక్కుకుంది. దీంతో ఫోర్క్‌లిఫ్ట్ వాహనంతో సహా లోరెన్ వంతెన మీద నుంచి 50 అడుగుల లోయలో పడిపోయాడు. అతడి మీద ఆ ఫోర్క్ లిఫ్ట్ వాహనం కూడా పడింది. ఆ వాహనానికి ఉండే పదునైన భాగం అతడి కడుపుకు గుచ్చుకుని దాదాపు శరీరాన్ని రెండు ముక్కలు చేసింది. ఆ పదునైన భాగం అతడిని నేలలోకి గుచ్చేసింది. ఆ క్షణంలో లోరెన్ నరకయాతన అనుభవించాడు. ఈ ఘటన సెప్టెంబరు 2019లో చోటుచేసుకుంది. 

భార్య కోసం బతకాలనుకున్నాడు: లోరెన్ తాను ప్రేమించిన అమ్మాయి షావర్స్ సబియా రిచేని చిన్న వయస్సులోనే పెళ్లి చేసుకున్నాడు. ప్రమాదం జరిగే సమయానికి వారికి పెళ్లయ్యి 18 నెలలే అయ్యింది. ఈ ప్రమాదకర ఘటన గురించి లోరెన్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘ప్రమాదం సమయంలో నేను స్పృహలోనే ఉన్నాను. నా కళ్ళు తెరిచే ఉన్నాయి. ఫోర్క్‌లిఫ్ట్ నా కుడి చేయి, తుంటిని చీల్చేయడం నేను చూశాను. నా చేతిలో సగ భాగం ఎగిరి ఎక్కడో పడిపోయింది’’ అని తెలిపాడు. ప్రమాదం జరిగిన వెంటనే లోరెన్‌ను మోంటానాలోని బోజ్‌మాన్‌లోని ఒక ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అతడు ప్రాణాలతో ఉండాలంటే నడుము భాగం నుంచి కాళ్ల వరకు అన్ని భాగాలు పూర్తిగా తొలగించడం ఒక్కటే మార్గమని వైద్యులు చెప్పారు. ఈ విషయం తెలిసి.. ‘‘నా తల మిగిలినా పర్వాలేదు. నేను నా భార్య, కుటుంబం కోసం బతకాలని ఉంది’’ అని తెలిపాడు. ఆ మాటలకు భార్య రీచ్ కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగాయి.

మరణాన్ని జయించాడు: శరీరంలో సగ భాగాన్ని తొలగించిన తర్వాత అతడు బతికేందుకు ఫిఫ్టీ-ఫిఫ్టీ అవకాశాలు మాత్రమే ఉన్నాయని వైద్యులు చెప్పారు. అయితే లోరెన్ తల్లి అప్పటికే ఆశలు వదిలేసుకుంది. అతడి బాధను చూడలేకపోతున్నామని, సగం శరీరంతో అతడు జీవించినా అది నరకమేనంటూ గుండెలు అవిసేలా ఏడ్చింది. కానీ, ఏదో చిన్న ఆశ.. అతడు బతికితే కళ్ల ముందు ఉంటాడు. చనిపోతే.. ‘నొప్పి’ అనే నరకం నుంచి బయటపడతాడు. ఏదైతే అయ్యిందని ఆమె లోరెన్ సర్జరీకి అంగీకరించింది. రీచ్ కూడా ఆమె నిర్ణయాన్ని సమర్ధించింది. అప్పటి వరకు లోరెన్‌కు ఏం జరుగుతుందో తెలీదు. వైద్యులు.. వారు చేయబోయే సర్జరీ గురించి లోరెన్‌కు వివరించారు. అదే సమయంలో భార్య రీచ్ అతడిలో ధైర్యాన్ని నింపింది. నీ బాధ్యత నాది అని భరోసా ఇచ్చింది. సర్జరీ పూర్తయిన తర్వాత కొన్నాళ్లు అతడిని అబ్జర్వేషన్లో ఉంచారు. భార్య రీచ్ అన్నీ తానై లోరెన్‌కు సేవలు అందించింది. పూర్తిగా కోలుకున్న తర్వాత తన ఇంటికి తీసుకెళ్లింది. 

Also Read: గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష, ఎందుకో తెలిస్తే షాకవుతారు!

సంసారం సాధ్యం కాదని తెలిసినా..: ప్రమాదం వల్ల లోరెన్ పొట్టకు కింది భాగాలన్నీ కోల్పోయాడు. దీంతో అతడు నడిచే పరిస్థితి లేదు. అలాగే, సంసారం కూడా అసాధ్యం. దీంతో చాలామంది.. లోరెన్‌తో జీవితాన్ని కొనసాగించడం కష్టమని, నీది ఇంకా చిన్న వయస్సేననని, మరోసారి ఆలోచించుకోమని సలహా ఇచ్చారు. కానీ, ఆమె ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇప్పటికీ ఆ జంట అన్యోన్యంగానే జీవిస్తున్నారు. లోరెన్ కోసం రీచ్ ప్రత్యేకమైన వీల్ చైర్ చేయించింది. ఆమె స్వయంగా లోరెన్‌ను ఎత్తుకుని స్నానం చేయిస్తుంది. అతడికి మలమూత్ర విసర్జన అవయవాలు లేకపోవడం వల్ల డాక్టర్లు పౌచ్‌లు పెట్టారు. లోరెన్ అన్నీ ఆ సంచుల్లోకి విసర్జిస్తాడు. రీచ్ నిత్యం అవన్నీ శుభ్రం చేస్తూ అతడికి ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా కంటికి రెప్పలా చూసుకుంటోంది. వీరిద్దరు ఇప్పుడు ఓ యూట్యూబ్ చానెల్ కూడా ప్రారంభించారు. ఆ చానెల్‌లో లోరెన్ గురించి మరింత తెలుసుకోవచ్చు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వ్యక్తులు ఉన్నారంటే నిజంగా అద్భుతం కదూ. ముఖ్యంగా తుమ్మినా, దగ్గినా విడాకులు తీసుకొనే పాశ్చాత్య దేశాల్లో ఇలాంటి యువతి ఉందంటే చాలా గ్రేట్. 

Also Read: గుడ్ న్యూస్, బట్టతలకు ఇక బై బై, ఈ మందుతో జుట్టు తిరిగి వచ్చేస్తుంది! 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Donald Trump : అధ్యక్షుడిగా ప్రమాణం నేడే - మొదటి రోజే 200 ఆర్డర్స్ పై సంతకాలు చేయనున్న ట్రంప్
అధ్యక్షుడిగా ప్రమాణం నేడే - మొదటి రోజే 200 ఆర్డర్స్ పై సంతకాలు చేయనున్న ట్రంప్
Tirupati News: తిరుమలలో తొక్కిసలాట ఘటనపై నివేదికలో ఏం తేలనుంది?
తిరుమలలో తొక్కిసలాట ఘటనపై నివేదికలో ఏం తేలనుంది?
Revanth Reddy: సింగపూర్​ పర్యటన సక్సెస్, ఇక దావోస్​ నుంచి పెట్టుబడులపై తెలంగాణ సర్కార్ ఫోకస్
సింగపూర్​ పర్యటన సక్సెస్, ఇక దావోస్​ నుంచి పెట్టుబడులపై తెలంగాణ సర్కార్ ఫోకస్
Monday TV Movies: చిరు ‘రౌడీ అల్లుడు’, బాలయ్య ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ టు నాగ్ ‘మాస్’, రామ్ చరణ్ ‘ఎవడు’ వరకు- ఈ సోమవారం (జనవరి 20) టీవీలలో వచ్చే సినిమాలివే..
చిరు ‘రౌడీ అల్లుడు’, బాలయ్య ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ టు నాగ్ ‘మాస్’, రామ్ చరణ్ ‘ఎవడు’ వరకు- ఈ సోమవారం (జనవరి 20) టీవీలలో వచ్చే సినిమాలివే..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

2028 లోపు ఏపీ మొత్తం పోలవరం ద్వారా నీళ్లు పరిస్తాంఎన్డీఆర్‌ఎఫ్‌ ను తెచ్చింది టీడీపీ  ప్రభుత్వమేరైతు బంధుపై ఎవరిదీ రాజకీయం?Priest Touches Hydraa Commissioner Feet | కన్నీళ్లతో హైడ్రా కమిషనర్ కాళ్లు పట్టుకున్న పూజారి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Donald Trump : అధ్యక్షుడిగా ప్రమాణం నేడే - మొదటి రోజే 200 ఆర్డర్స్ పై సంతకాలు చేయనున్న ట్రంప్
అధ్యక్షుడిగా ప్రమాణం నేడే - మొదటి రోజే 200 ఆర్డర్స్ పై సంతకాలు చేయనున్న ట్రంప్
Tirupati News: తిరుమలలో తొక్కిసలాట ఘటనపై నివేదికలో ఏం తేలనుంది?
తిరుమలలో తొక్కిసలాట ఘటనపై నివేదికలో ఏం తేలనుంది?
Revanth Reddy: సింగపూర్​ పర్యటన సక్సెస్, ఇక దావోస్​ నుంచి పెట్టుబడులపై తెలంగాణ సర్కార్ ఫోకస్
సింగపూర్​ పర్యటన సక్సెస్, ఇక దావోస్​ నుంచి పెట్టుబడులపై తెలంగాణ సర్కార్ ఫోకస్
Monday TV Movies: చిరు ‘రౌడీ అల్లుడు’, బాలయ్య ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ టు నాగ్ ‘మాస్’, రామ్ చరణ్ ‘ఎవడు’ వరకు- ఈ సోమవారం (జనవరి 20) టీవీలలో వచ్చే సినిమాలివే..
చిరు ‘రౌడీ అల్లుడు’, బాలయ్య ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ టు నాగ్ ‘మాస్’, రామ్ చరణ్ ‘ఎవడు’ వరకు- ఈ సోమవారం (జనవరి 20) టీవీలలో వచ్చే సినిమాలివే..
IPS AB Venkateswara Rao: పోస్టింగ్, జీతం అడిగితే సస్పెండ్ చేశారు- సామాజిక వర్గాన్నే తొక్కేశారు: మాజీ ఐపీఎస్ సంచలనం
IPS AB Venkateswara Rao: పోస్టింగ్, జీతం అడిగితే సస్పెండ్ చేశారు- సామాజిక వర్గాన్నే తొక్కేశారు: మాజీ ఐపీఎస్ సంచలనం
Donald Trump: అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టక ముందే Elon Muskకు కీలక బాధ్యతలు అప్పగించిన డొనాల్డ్ ట్రంప్
అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టక ముందే Elon Muskకు కీలక బాధ్యతలు అప్పగించిన డొనాల్డ్ ట్రంప్
Malaika Arora : బ్లాక్ శారీలో 51 ఏళ్ల అందం.. మలైకా అరోరా గ్లామ్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
బ్లాక్ శారీలో 51 ఏళ్ల అందం.. మలైకా అరోరా గ్లామ్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
Instagram Update : ఇన్​స్టాగ్రామ్​లో న్యూ ఫీచర్స్.. ఇకపై మూడు నిమిషాల నిడివి ఉన్న రీల్స్ పోస్ట్ చేయవచ్చట, మరో అప్​డేట్ కూడా
ఇన్​స్టాగ్రామ్​లో న్యూ ఫీచర్స్.. ఇకపై మూడు నిమిషాల నిడివి ఉన్న రీల్స్ పోస్ట్ చేయవచ్చట, మరో అప్​డేట్ కూడా
Embed widget