By: ABP Desam | Updated at : 17 Apr 2022 06:52 PM (IST)
Edited By: harithac
(Image credit: Wikipedia)
సీజనల్ పండ్లు, కూరగాయలను కచ్చితంగా తినాలి. ఆ సీజన్లో వచ్చ వ్యాధులను తట్టుకునే శక్తిని అవి అందిస్తాయి. వేసవిలో వచ్చేవి మామిడి కాయలు. పుల్లని మామిడికాయలతో చేసే వంటకాలు ఎన్నో ఉన్నాయి. వాటిని వేసవిలో చేసుకుని తింటే చాలా మంచిది. ఇవి వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. మామిడి కాయలు తినడం వల్ల విటమిన్ సి పుష్కలంగా అందుతుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను కూడా ఇవి అడ్డుకుంటాయి. ముఖ్యంగా రొమ్ము, పెద్ద పేగు క్యాన్సర్లు రావని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మామిడితో చేసిన వంటలు తినడం వల్ల నిద్ర కూడా బాగా పడుతుంది. వేసవి తాపాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. వడదెబ్బ కొట్టకుండా కాపాడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కూడా ఇది ముందుంటుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎముకలు బలంగా మారేందుకు, కాలేయ ఆరోగ్యానికి, చర్మానికి కూడా మామిడి కాయ మేలు చేస్తుంది. రోజూ సాంబారు, రసం చేసుకునే అలవాటున్న వారు కాస్త కొత్తగా పప్పు మామిడిరసం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.
కావాల్సిన పదార్థాలు
పుల్ల మామిడి తరుగు -ఒక కప్పు
కంది పప్పు - ఒక కప్పు
పచ్చిమిర్చి - మూడు
కరివేపాకులు - గుప్పెడు
పసుపు - అర టీస్పూను
కొత్తిమీర తరుగు - రెండు స్పూనులు
జీలకర్ర - ఒక స్పూను
ఆవాలు - అర స్పూను
మినప్పప్పు - ఒక స్పూను
రసం మసాలా - ఒక టీస్పూను
ఉప్పు - రుచికి తగినంత
నూనె - ఒక టీస్పూను
తయారీ ఇలా
1. పప్పు బాగా కడిగి కుక్కర్లో వేయాలి. మామిడి ముక్కలు, రెండు కప్పుల నీళ్లో పోయాలి.
2. కుక్కర్‌ను అయిదు విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి.
3. తరువాత కుక్కర్ ఓపెన్ చేసి మెత్తగా మెదపాలి.
4. తిరిగి కుక్కర్‌ను స్టవ్ మీద పెట్టాలి. మూత పెట్టకుండా ఉడికించాలి. రెండు గ్లాసుల నీళ్లు పోయాలి.
5. ఆ పప్పులో పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలపాలి.
6. చారు మసాలా కూడా వేసి బాగా కలపాలి.
7.దించే ముందు కొత్తిమీర చల్లి దింపేయాలి.
పుల్లపుల్లగా ఉండే ఈ రసం చాలా టేస్టీగా ఉంటుంది.
Also read: ఆరోగ్యం కోసం అన్నం తగ్గించండి, కూరలు ఎక్కువ తినండి
Jail Sentece To Sheep: గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష, ఎందుకో తెలిస్తే షాకవుతారు!
Dhaniya Powder: ఈ ధనియాల పొడిని అన్నంతో, ఇడ్లీతో తినొచ్చు, ఎలా చేయాలో తెలుసా?
Brain Foods: పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే బ్రెయిన్ ఫుడ్స్ ఇవన్నీ, రోజుకొకటైనా తప్పకుండా తినిపించాల్సిందే
Sleeping Pills: స్లీపింగ్ పిల్స్ అధికంగా వాడుతున్నారా? వాటి వల్ల కలిగే నష్టాలు ఇవే
Amazon: ఒక ప్లాస్టిక్ బకెట్ ఇరవై ఆరువేల రూపాయలా? అది కూడా ‘సోల్డ్ అవుట్’
YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఏపీతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ఒప్పందం
PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్పోర్ట్
World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?
Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి