అన్వేషించండి

Low Stamina : త్వరగా అలసిపోతున్నారా? స్టామినా పెంచే రోజువారీ అలవాట్లు ఇవే

Daily Habits To Increase Stamina : స్టామినా ఉండట్లేదా? త్వరగా అలసిపోతున్నారా? అయితే మీ లైఫ్​స్టైల్​ని మార్చుకోవాల్సిన సమయం ఇదే. అందుకే కొన్ని అలవాట్లతో స్టామినాను పెంచుకోవచ్చు. అవేంటంటే..

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రోజూ అరగంట వ్యాయామం, శ్వాస పద్ధతులు స్టామినా పెంచుతాయి.
  • ప్రోటీన్ ఆహారం, తగినంత నీరు, నాణ్యమైన నిద్ర ముఖ్యం.
  • మానసిక ఒత్తిడి తగ్గించుకుంటూ, చెడు అలవాట్లు మానేయాలి.

Tips To Boost Your Stamina : ఈరోజుల్లో వేగవంతమైన జీవనశైలి, ఒత్తిడి, నిద్రలేమి, శారీరక శ్రమ లేకపోవడం వల్ల చాలామందిలో స్టామినా తగ్గిపోతుంది. శరీరానికి ఎక్కువసేపు శక్తిని అందించే సామర్థ్యాన్నే స్టామినా అంటారు. కొద్దిసేపు నడిచినా, మెట్లు ఎక్కినా, రోజువారీ పనులు చేసినా శరీరంలో శక్తి లేనట్లు అనిపించడం సాధారణ సమస్యగా మారింది. దీనిని దూరం చేసుకుని.. స్టామినా పెంచుకోవాలంటే.. కొన్ని అలవాట్లపై దృష్టి పెట్టాలి.

మంచి స్టామినా అంటే శారీరక పనితీరే అనుకుంటారు. కానీ ఇది మానసికంగా కూడా మెరుగుకావడం. అయితే స్టామినా అనేది ఒక్కరోజులో పెరగదు. ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లు క్రమంగా పెంచుకోవడం వల్ల జరుగుతుంది. మరి స్టామినా పెరగడానికి రోజువారీ జీవితంలో ఎలాంటి అలవాట్లు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతిరోజూ అరగంట చేయండి

స్టామినా పెరగాలంటే శరీరాన్ని క్రమంగా వ్యాయామానికి అలవాటు చేయాలి. నడక, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి ఏరోబిక్ వ్యాయామాలు గుండె, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచి శక్తిని పెంచుతాయి. రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం మంచిది.

ప్రోటీన్ ఫుడ్

కండరాల బలం, రికవరీ కోసం ప్రోటీన్ చాలా అవసరం. గుడ్లు, చేపలు, చికెన్, పప్పులు, శనగలు, పాలు వంటి ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.

హైడ్రేషన్

డీహైడ్రేషన్ వల్ల అలసట, బలహీనత త్వరగా వస్తాయి. శరీరంలో నీటి శాతం సరిపడా ఉండటం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి శక్తి స్థాయిలు నిలకడగా ఉంటాయి. దీంతో యాక్టివ్​గా ఉంటారు.

నిద్ర మరీ ముఖ్యం..

రోజుకు 7–9 గంటల నాణ్యమైన నిద్ర శరీరాన్ని రీచార్జ్ చేస్తుంది. నిద్ర తక్కువైతే శక్తి తగ్గిపోవడంతో పాటు వ్యాయామ సామర్థ్యం కూడా దెబ్బతింటుంది. దీంతో స్టామినా తగ్గిపోతుంది. కాబట్టి నిద్రను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి.

బ్రీతింగ్ టెక్నిక్స్..

డీప్ బ్రీతింగ్, ప్రాణాయామం వంటి శ్వాస వ్యాయామాలు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతాయి. వీటిని చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. కానీ వీటిని ప్రాక్టీస్ చేయడం వల్ల ఎక్కువసేపు శారీరక శ్రమ చేయగల సామర్థ్యం పెరుగుతుంది.

స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌

వెయిట్ ట్రైనింగ్ లేదా బాడీ వెయిట్ ఎక్సర్‌సైజ్‌లు కండరాల బలాన్ని పెంచుతాయి. బలమైన కండరాలు ఎక్కువసేపు పని చేయగలవు కాబట్టి స్టామినా కూడా మెరుగుపడుతుంది. వయసు పెరిగే కొద్ది కండరాల బలం తగ్గుతుంది కాబట్టి.. అలా జరగకుండా బాడీని ట్రైన్ చేసుకోవాలి. 

ఒత్తిడి

మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటే శరీరం త్వరగా అలసిపోతుంది. ధ్యానం, యోగా, హాబీలు వంటి వాటి ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవడం శక్తి స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

మానేయాల్సినవి..

స్వీట్స్, చాక్లెట్స్, ఇతర డెజెర్ట్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తిన్న వెంటనే బాడీలో ఎనర్జీ వచ్చినట్లు అనిపిస్తుంది. కానీ కొద్దిసేపటికే అలసట, మత్తు వస్తుంది. కాబట్టి వాటికి దూరంగా ఉంటూ.. పోషకాలు ఎక్కువగా ఉండే సహజమైన ఫుడ్స్ తీసుకోవాలి. ఇవేకాకుండా సిగరెట్లు, మందు వంటివి మానేయాలి. ఎందుకంటే ఇవి నేరుగా గుండె, ఊపిరితిత్తుల పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. వీటి వల్ల శారీరక సామర్థ్యం తగ్గి త్వరగా అలసట వచ్చే అవకాశం ఉంటుంది.

గుర్తించుకోవాల్సిన విషయాలు..

ఒకేసారి ఎక్కువ వ్యాయామం చేయడం కంటే.. రోజూ చేస్తూ.. వారానికి కొద్దికొద్దిగా దూరం, సమయం లేదా తీవ్రత పెంచుకుంటూ వెళ్లడం మంచిది. ఇలా చేస్తే మీరు రోజూ వ్యాయామం చేయగలుగుతారు. అలాగే శరీరం ఒత్తిడికి అలవాటు పడి.. స్టామినా సహజంగా పెరుగుతుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ ఆర్టికల్స్ కోసం దీనిని క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
Fenugreek Growing Tips : ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
Tips To Control Diabetes : మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
651km రేంజ్‌.. రూ.8 లక్షలు తక్కువ ఖర్చు! మహీంద్రా BE 6లో కొత్త మార్పులేంటో తెలుసా?
Embed widget