By: ABP Desam | Updated at : 12 Apr 2022 08:22 PM (IST)
Edited By: harithac
(Image credit: Pixabay)
పదేళ్ల వయసు దాటిన పిల్లలను చాలా సార్లు తల్లిదండ్రులు ఇంటి దగ్గర వదిలి వెళుతుంటారు. అత్యవసర పరిస్థితుల్లో ఒక్కోసారి అలా చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు పిల్లలకు కచ్చితంగా చెప్పాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. వీటిని నేర్పడం వల్ల పిల్లలు జాగ్రత్తగా, సురక్షితంగా ఉంటారు.
1. తల్లిదండ్రులు తప్ప ఎవరు వచ్చినా డోర్ తీయకూడదని గట్టిగా చెప్పాలి. కొందరి ఇళ్ల డోర్‌లకు కిటికీలోంచి, లేదా డోర్‌కున్న ‘పీప్ హోల్’ ద్వారా చూసి ఎవరు వచ్చారో తెలుసుకోవచ్చు. అలా చూడడం ద్వారా తల్లిదండ్రులు వచ్చారో లేదో తెలుసుకుని డోర్ తీయమని ట్రైనింగ్ ఇవ్వాలి. వీలైతే తల్లిదండ్రులు తమ వాయిస్ పోల్చుకున్నాకే డోర్ తీయమని చెప్పాలి. కొత్త వాళ్లయినా, తెలిసిన వాళ్లయినా ఎవరు వచ్చిన డోర్ తీయవద్దని గట్టిగా చెప్పాలి.
2. కిటీకీల వద్దకు లేదా ఇంట్లోని గేటు వద్దకు వచ్చి తెలియని వాళ్లతో మాట్లాడవద్దని, ఏమీ అడిగిన ఇవ్వవద్దని వారికి చెప్పాలి. అదెంత హానికరమో కూడా తెలియజేయాలి.
3. పిల్లలు ఒక్కర్నే ఇంట్లో ఉంచినప్పుడు కచ్చితంగా అతనికి ఫోన్ ఇచ్చి వెళ్లండి. అరగంటకోసారి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండాలి. తిరిగి ఫోన్ ఎలా చేయాలో కూడా నేర్పాలి. ఫోన్ కి పాస్ వర్డ్ లు ఉంటే ఆ సమయంలో తీసేయడం బెటర్.
4. పిల్లలకు తల్లిదండ్రులు తప్ప వేరే ఎవరు ఫోన్ చేసినా తాము ఒక్కరే ఉన్నామని చెప్పకూడదని ట్రైనింగ్ ఇవ్వాలి.
5. గ్యాస్ స్టవ్, కరెంట్ వస్తువులకు దూరంగా ఉండమని గట్టిగా చెప్పాలి. అదెంత ప్రమాదమో కూడా చెప్పాలి. వారికి వంటగదికి వెళ్లాల్సిన అవసరం లేకుండా తినేందుకు రెండూ మూడు రకాల పదార్థాలు దగ్గరే పెట్టి వెళితే ఇంకా మంచిది.
6. ఇంటికి తాళమేసి బయట ఆడుకోవడానికి వెళ్లడం వంటివి చేయకూడదని చెప్పండి.
7. బాల్కనీలోంచి తొంగి చూడడం, కింద వారితో మాట్లాడడం వంటివి చేయద్దని తెలియజేయాలి.
8. ఎవరైనా వచ్చి ‘మీ తల్లిదండ్రులు పంపించారు’ లేదా ‘మీ తల్లిదండ్రులకు యాక్సిడెంట్ అయింది’ వంటివి చెప్పినా నమ్మవద్దని చెప్పాలి.
9. ఎవరైనా అనుమానాస్పదంగా ఇంటి ముందు తిరుగుతున్నాడ, మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నా వెంటనే మీ అపార్ట్‌మెంట్ లేదా, చుట్టుపక్కల మీకు తెలిసిన వారికి ఫోన్ చేసేలా ట్రైనింగ్ ఇవ్వండి. లేదా మీకు ఫోన్ చేసి చెప్పేలా శిక్షణనివ్వండి.
Also read: సిగరెట్లు మానకపోతే చూపు పోయే ప్రమాదం, కళ్లను కాపాడుకోండిలా
Also read: రాత్రిళ్లు పక్కతడపడం ఆ ప్రాణాంతక వ్యాధికి సంకేతం కావచ్చు , అధ్యయనంలో షాకింగ్ రిజల్ట్
Memory Loss With Sex: మిట్ట మధ్యాహ్నం సెక్స్, సడన్గా గతం మరిచి ‘గజినీ’లా మారిపోయిన భర్త, ఈ సమస్య మీకూ రావచ్చు!
Dangerous Medicine: జ్వరం, నొప్పులకు ఈ మాత్ర వాడుతున్నారా? జాగ్రత్త, ప్రాణాలు పోతాయ్!
Sunscreen Benefits: సన్ స్క్రీన్తో చర్మం నల్లగా మారిపోతుందా? ఈ 8 అపోహలను అస్సలు నమ్మొద్దు!
Headphones side effects: హెడ్ఫోన్స్ అతిగా వాడుతున్నారా? చూడండి, ఎంత ప్రమాదమో!
Warts Removal Tips: పులిపిరులు వేదిస్తున్నాయా? ఈ ఆయుర్వేద చిట్కా పాటిస్తే వెంటనే రాలిపోతాయి
Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?
RR Vs RCB: ఆఖర్లో తడబడ్డ బెంగళూరు - రాజస్తాన్ ముందు ఈజీ టార్గెట్!
Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!
Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్ లో రష్మిక - ఫొటోలు వైరల్